Viral Video: డ్యాన్స్ రీల్స్ చేస్తున్న యువతికి షాకిచ్చిన ఆవు!
నేటి యువత అంతా సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. వీడియోలు చూడటంతోపాటు.. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లలో రీల్స్ చేస్తూ బిజీగా ఉంటున్నారు. వినూత్నంగా ఏదో ఒకటి చేసి వ్యూస్ సంపాదించాలని ఆరాట పడుతున్నారు. డ్యాన్సులు చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
తాజాగా, ఓ యువతి రీల్స్ కోసం ఆవును ముందు ఉంచి.. డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించింది. అయితే, అక్కడున్న ఆవు మాత్రం ఆమెకు షాకిచ్చింది. తన వద్దే చిందులా అంటూ ఒక్కసారిగా ఆ యువతి వైపు కదిలింది. దీంతో బిత్తరపోయిన యువతి అక్కడ్నుంచి పరుగు లంఘించింది.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీ షర్ట్, ట్రాక్ ప్యాంట్ వేసుకున్న యువతి ఆవు వెనుకాల డ్యాన్స్ చేస్తోంది. ముందు కాసేపు మామూలుగానే ఉన్న ఆవు.. ఒక్కసారిగా ఆ యువతి వైపు ఆగ్రహంగా వెళుతుంది.
తనపై ఎక్కడ దాడి చేస్తుందో అని భయపడిన యువతి అక్కడ్నుంచి కొంత దూరం పరుగుపెడుతుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. యువతి వీడియో... ఆవును ఇంప్రెస్ చేసినట్లు లేదని అంటున్నారు. యువతి మంచిగా ప్రాక్టీస్ చేసి వచ్చి డ్యాన్స్ చేయాలనుకుంటా.. అని మరికొందరు అంటున్నారు.












Click it and Unblock the Notifications