Viral Video: కాక్‌పిట్‌లో నిద్రపోతున్నఫ్లైట్ ఓనర్ కొడుకు

ఒకవైపు తండ్రిని కోల్పోయిన తీరని శోకం.. మరోవైపు ఆ మరణానికి కారణమైన వారి నిర్లక్ష్యం కళ్లముందే కనిపిస్తుంటే కలిగే ఆవేదన. మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు జయ్ పవార్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. విమానం గాల్లో ఉండగానే, ప్రాణాలకు భరోసా ఇవ్వాల్సిన విమానయాన సంస్థ ఓనర్ కొడుకు కో పైలెట్ సీటులో గుర్రుపెట్టి నిద్రిస్తున్న దృశ్యాలు చూసి సామాన్య ప్రజానీకం విస్తుపోతోంది.

సోమవారం మధ్యాహ్నం విడుదలైన ఈ వీడియో క్లిప్‌లో, సివిల్ దుస్తుల్లో ఉన్న ఒక వ్యక్తి హెలికాప్టర్ కాక్‌పిట్‌లో కో-పైలెట్ సీటులో గాఢ నిద్రలో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సదరు వ్యక్తి వీఎస్ఆర్ వెంచర్స్ (VSR Ventures) యజమాని రోహిత్ సింగ్ అని జయ్ పవార్ గుర్తించారు. "వందల అడుగుల ఎత్తులో ప్రయాణికుల ప్రాణాలు గాలిలో వేలాడుతుంటే, బాధ్యతాయుతమైన సీటులో ఉండి నిద్రపోవడం క్షమించరాని నేరం" అంటూ జయ్ పవార్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో నిప్పులు చెరిగారు.

Jay Pawar Shares Shocking Cockpit Video Demands Action After Ajit Pawar Plane Crash Tragedy

ఆ చేదు జ్ఞాపకం..

ఈ ఏడాది జనవరి 28న బారామతిలో జరిగిన భీకర విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదానికి కారణమైన లీర్‌జెట్ 45XR విమానం కూడా వీఎస్ఆర్ వెంచర్స్ సంస్థకు చెందినదే. తన తండ్రి మరణానికి సదరు సంస్థ అడ్డగోలు నిర్లక్ష్యమే కారణమని జయ్ పవార్ ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా, తక్కువ విజిబులిటి ఉన్న సమయంలో విమానాన్ని ల్యాండ్ చేయడానికి ప్రయత్నించడం వల్లే ఆ ఘోరకలి జరిగింది.

DGCAకు డిమాండ్: 'తక్షణమే అరెస్ట్ చేయండి'

కేవలం వీడియో పోస్ట్ చేయడమే కాకుండా, సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (DGCA)కు జయ్ పవార్ బహిరంగ విజ్ఞప్తి చేశారు. విచారణ పూర్తయ్యే వరకు వీఎస్ఆర్ వెంచర్స్ విమానాలన్నింటినీ తక్షణమే గ్రౌండ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రయాణికుల భద్రతను పణంగా పెట్టిన కంపెనీ యజమానిని అరెస్ట్ చేయాలిని కోరారు. విమానయాన రంగంలో భద్రతా ప్రమాణాలపై సమగ్ర విచారణ జరపాలన్నారు.

విచారణలో తేలిన నగ్న సత్యాలు

ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక ప్రకారం.. ప్రమాదం జరిగిన రోజున విజిబిలిటీ కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే ఉంది. నిబంధనల ప్రకారం (VFR) కనీసం 5 కిలోమీటర్ల విజిబిలిటీ ఉంటేనే విమానాన్ని నడపాలి. ఈ నిబంధనలను బేఖాతరు చేయడం వల్లే విమానం కూలిపోయి, పైలట్లతో సహా అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+