Viral Video: సేవలో తరించిపోయిన ఎంపీ: జనాల భుజాలెక్కిన నాయకుడు!

Viral Video: ఇటీవల కుండపోత వర్షాల వల్ల బీహార్ రాష్ట్రంలోని కతిహార్ జిల్లా అతలాకుతలమైంది. అక్కడి లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. ఈ క్రమంలో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించడానికి వెళ్లి కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ వివాదంలో చిక్కుకున్నారు. నీట మునిగిన ప్రాంతంలో గ్రామస్థులు ఆయనను వీవులపై మోసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేగింది. అయితే ఆయన ఒంట్లో బాగోలేదని.. అందుకే గ్రామస్థులు ప్రేమతో ఇలా చేశారని కాంగ్రెస్ పార్టీ ఈ చర్యను సమర్థించుకుంది.

అసలేం జరిగిందంటే?
కతిహార్ ఎంపీ అయిన తారిఖ్ అన్వర్ వరద సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన ట్రాక్టర్, పడవ వంటి వివిధ రకాల వాహనాలను ఉపయోగించి ప్రజలను కలుసుకున్నారు. అయితే ఓ వీడియోలో గ్రామస్థులు ఆయనను తమ భుజాలపై ఎత్తుకుని నీట మునిగిన పొలాల గుండా తీసుకెళ్తున్నారు. ఈ దృశ్యం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఎంపీ వరద నీటిలో దిగకపోవడంతో గ్రామస్థులు వీపులపై మోసుకెళ్లారని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు.

Viral Video MP Tariq Anwar Carried by Villagers in Flooded Bihar Sparks Political Row

కాంగ్రెస్ వివరణ
ఈ ఘటనపై కతిహార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సునీల్ యాదవ్ స్పందించారు. "మేము ట్రాక్టర్, పడవ, బైక్ వంటి వాటిని ఉపయోగించి ప్రయాణించాం. అయితే, ఒక చోట మా వాహనం బురదలో కూరుకుపోయింది. దీంతో మేము దాదాపు 2 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. ఎండ తీవ్రంగా ఉండటం వల్ల తారిఖ్ అన్వర్‌కు ఒంట్లో బాగోలేదని, తల తిరుగుతున్నట్లు అనిపించింది. ఆయన ఈ విషయం చెప్పగానే, గ్రామస్తులు ప్రేమతో ఆయన్ని తమ భుజాలపై ఎత్తుకున్నారు" అని సునీల్ యాదవ్ వివరించారు. ఈ ఘటనలో ఒక పోలీసు అధికారి కూడా అన్వర్‌కు సహాయం చేస్తూ కనిపించారు.

అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇతర ఫోటోలలో, తారిఖ్ అన్వర్ నడుస్తూ కనిపించారు. మరొక వ్యక్తి, ఒక పోలీసు అధికారి ఆయన కోసం గొడుగులు పట్టుకొని నడుస్తూ ఉన్నారు. ఇంకో వీడియోలో ఆయన కొంతమందితో ట్రాక్టర్ మీద వెళ్తూ, అందరూ గొడుగులు పట్టుకుని ఉండటం కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+