Mukesh Ambani Dance Video:అంబానీలో ఈ యాంగిల్ కూడా ఉందా..!!

అపరకుబేరుడు రిలియన్స్ అధినేత ముఖేష్ అంబానీ గురించి అందరికీ తెలిసిందే. ఒక్క క్షణం ఖాలీగా లేకుండా బిజీబిజీగా రోజంతా గడిపేస్తారు. అయితే తన కొడుకు అనంత్ అంబానీ వివాహం సందర్భంగా ముఖేష్ అంబానీ కొంత రిలాక్స్‌డ్‌గా కనిపించారు. తన ఇంట్లో ఏదైనా వేడుక ఉంటే అంబానీ జోరే వేరుగా కనిపిస్తుంది. ఇక బిలయనీర్ కపుల్స్‌లో ముఖేష్ అంబానీ దంపతులు కచ్చితంగా ముందుంటారు.ఈ దంపతులు ఏం చేసినా ప్రధాన వార్తల్లో ఉంటారు. తాజాగా అంబానీ దంపతులకు సంబంధించి ఓ డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.

ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహం జూలై 12న చాలా గ్రాండ్‌గా జరిగిన విషయం తెలిసిందే. ఆ వివాహానికి ప్రపంచ నలుమూలల నుంచి అతిరథమహారథులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.ఇక అంబానీ ఇంట వేడుక అంటే ప్రతి ఒక్కరూ చర్చించుకునేది రకరకాల వంటల గురించే. ఇక పెళ్లిలో జరిగిన వేడుకలు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

Viral Video Mukesh Ambani and Nita Ambani Share a Romantic Dance Moment internet melts

ఇక అనంత్ అంబానీ వివాహంకు సంబంధించి పలు వీడియోలో ఆన్‌లైన్‌లో హల్చల్ చేశాయి. సెలబ్రిటీలు స్టెప్పులు వేయడం, వధూవరులు కలిసి డ్యాన్స్ వేయడం, అంబానీ కుటుంబం అంతా ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.తాజాగా అంబానీ దంపతులకు సంబంధించిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.భార్య నీతా అంబానీతో కలిసి రొమాంటిక్ సాంగ్‌కు కాలు కదిపారు. బాలీవుడ్ చిత్రంలోని "గీత్ హమారే ప్యార్‌ కే" పాటకు ఈ కపుల్ డ్యాన్స్ వేసింది. అయితే వీడియోలో మాత్రం ముఖేష్ అంబానీ ముఖం చాలా సీరియస్‌గా పెట్టినప్పటికీ కాస్త రొమాన్స్‌ను పండించాడు. ఈ వీడియోను చూసిన నెటిజెన్లు తమకు తోచినట్లుగా కామెంట్స్ పెడుతున్నారు.

నీతా అంబానీ గురించి మనందరికీ తెలిసిందే.ఆమె క్లాసికల్ డ్యాన్సర్. సంప్రదాయ నృత్యంలో నీతా అంబానీకి మంచి పట్టుంది. స్టేజ్ పై చేసిన డ్యాన్స్‌లో ముఖేష్ అంబానీ నీతా అంబానీకి చాలా కష్టపడి సపోర్ట్ చేస్తున్నట్లు కనిపించింది. ఇద్దరూ చక్కగా డ్యాన్స్ వేస్తు ఒకరికొకరు కాంప్లిమెంట్ చేసుకుంటున్నట్లుగా వీడియోలో కనిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+