Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు
రెప్పల చాటున కన్నీటిని దాచి.. కొండంత ధైర్యం ప్రదర్శించేవాడు నాన్న! లోకాన్నే ఎదిరించే గుండె ఉన్నా.. పసికూన లేత స్పర్శకు కరిగిపోయేవాడు నాన్న! బిడ్డకు జన్మనివ్వడం అమ్మకు పునర్జన్మ అయితే.. ఆ చిన్నారిని చేతుల్లోకి తీసుకోవడం నాన్నకు సరికొత్త అస్తిత్వం!
లోకంలో మగవాడు అంటేనే ధైర్యానికి మారుపేరు అంటారు. ఎటువంటి కష్టాన్నైనా భుజాన మోయగల శక్తి, ఎంతటి ఉద్వేగాన్నైనా దిగమింగి నిశ్చలంగా నిలబడగల స్థితప్రజ్ఞత అతడి సొంతం. కానీ, ప్రకృతి సిద్ధాంతం ప్రకారం.. ఎంతటి మొండివాడినైనా మోకరిల్లేలా చేసే ఒకే ఒక్క క్షణం 'తండ్రి' కావడం. దునియాని గడగడలాడించే మొనగాడైనా సరే, తన కన్నబిడ్డను తొలిసారి చేతుల్లోకి తీసుకునే ఆ క్షణాన చేతులు వణకాల్సిందే. ఆ వణుకు చేవ లేక కాదు.. తన అరచేతిలోకి చేరిన ఆ "అమ్మలాంటి నాన్న" ప్రతిరూపానికి ఎక్కడ చిన్నపాటి గాయం తగులుతుందోనన్న నిష్కల్మషమైన భయం!

వైరల్ వీడియో: ఒక తండ్రి హృదయ స్పందన
తాజాగా చెన్నైకి చెందిన ఒక వైద్యురాలు సోషల్ మీడియాలో పంచుకున్న వీడియో ఇప్పుడు కోట్లాది మంది తండ్రుల కళ్ళను చెమర్చుస్తోంది. లేబర్ రూమ్ బయట ఆందోళనగా ఎదురుచూస్తున్న ఆ తండ్రి వద్దకు డాక్టర్ వెళ్ళి, "ఇదిగో మీ బిడ్డ" అంటూ ఆ పసికందును అందించారు. ఆ క్షణాన ఆ తండ్రి ముఖంలో కనిపించిన భావాలు వర్ణనాతీతం. ఆ పసి ప్రాణాన్ని ఎలా పట్టుకోవాలో తెలియక, ఏమన్నా అవుతుందేమోనన్న కంగారుతో అతడి చేతులు వణికిపోయాయి. అప్పటివరకు లోకాన్ని చుట్టేసిన ఆ ధైర్యం ఏమైందో తెలీదు కానీ, డాక్టర్ ధైర్యం చెప్పి బిడ్డను చేతిలో పెట్టగానే.. ఆ తండ్రి కళ్ళు చెమర్చాయి.
తన రక్తపు ముద్దను గుండెలకు హత్తుకున్న ఆ క్షణాన, అతడి జీవితం ఒక పరిపూర్ణతను సంతరించుకుంది. అప్పటివరకు ఉన్న కంగారు మాయమై, ఒక తెలియని బాధ్యత, అంతులేని ప్రేమ ఆ తండ్రి కళ్ళలో మెరిసాయి.
20 కోట్ల వ్యూస్.. ఒకే ఒక్క ఎమోషన్!
ఈ వీడియో కేవలం ఒక దృశ్యం మాత్రమే కాదు, ప్రతి మగాడి జీవితంలో వచ్చే అత్యున్నత ఘట్టం. అందుకే ఈ వీడియోకు సోషల్ మీడియాలో ఏకంగా 20 కోట్ల వ్యూస్ లభించాయి. తండ్రి ప్రేమకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుందంటూ నెటిజన్లు భావోద్వేగంతో స్పందిస్తున్నారు. భుజాన ఎత్తుకుని ఊరేగించే తండ్రి వెనుక, ఆ తొలి క్షణంలో వణికిపోయిన ఒక సున్నితమైన మనసు ఉంటుందని ఈ వీడియో మరోసారి చాటిచెప్పింది.












Click it and Unblock the Notifications