వైరల్ వీడియో: లిఫ్టులో ఇరుక్కున్న ఇద్దరు చిన్నారులు.. ఆ అమ్మాయి ఏం చేసిందో చూడండి..!
ఆడుకుంటూ వెళ్లి లిఫ్టులో ఇరుక్కున్న ఇద్దరు చిన్నారుల్ని ఓ బాలిక ఎంతో డేరింగ్ గా కాపాడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ బాలిక సమయస్ఫూర్తి, ధైర్య సాహసాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బాలిక తీవ్రంగా శ్రమించి ఇద్దరు చిన్నారుల్ని కాపాడటంపై అందరూ ప్రశంసిస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియో 4 మిలియన్ల వ్యూస్ రాగా వేల కొద్ది కామెంట్స్ వచ్చాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఈ వీడియోలోని దృశ్యాలు చూస్తే..

అపార్ట్ మెంట్ లోని కొందరు మహిళలు లిఫ్టు వద్ద నిల్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఇద్దరు చిన్నారులు లిఫ్టులోకి వెళ్లారు. లిఫ్టు డోర్ల వద్ద ఓ బాలిక చిన్నారులతో మాట్లాడుతోంది. అదే సమయంలో ఒక్కసారిగా లిఫ్టు డోర్లు మూసుకుపోవడం స్టార్ట్ అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఆ బాలిక తలుపుల మధ్యలో నిలబడి అవి మూసుకుపోకుండా ఆపడానికి ప్రయత్నించింది. ఈ దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
డోర్ల వద్ద ఆ బాలిక అవి మూసుకుపోయోలోపు లిఫ్టులో ఓ చిన్నారిని బయట నిల్చున్న మహిళకు అప్పగించింది. తర్వాత మరో చిన్నారిని సైతం లిఫ్టులోనుంచి బయటకు తీసి.. ఆ బాలిక కూడా బయటకు వెళ్లిపోయింది. ఇదంతా క్షణాల్లోనే లిఫ్టు డోర్లు క్లోజ్ అవుతున్న క్రమంలోనే చకచకా జరిగిపోయింది. బాలిక తెలివి, సమయస్ఫూర్తి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. చాలామంది పిల్లలు ఏదైనా ఆపద వస్తే భయపడి పారిపోవడం, లేదా ఏడ్వడం చేస్తారు. కానీ ఆ బాలిక మాత్రం డేరింగ్ గా వ్యవహరించి ఇద్దరు చిన్నారుల ప్రాణాలు కాపాడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు చిన్నారిని ప్రశంసిస్తున్నారు.












Click it and Unblock the Notifications