దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
 • search

జియోకు షాక్: రూ.38లకే 100 ఎంబి డేటా, వాయిస్ కాల్స్

By Narsimha
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  న్యూఢిల్లీ: వొడాఫోన్ కొత్త ప్యాకేజీని ప్రకటించింది.దేశంలోని మధ్య ప్రదేశ్‌, చత్తీష్‌ఘడ్, బీహార్‌, జార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రాంత ప్రీపెయిడ్‌ కస్టమర్లకు వొడాఫోన్‌ చోటా ఛాంపియన్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.రూ. 38లకే ఈ ఆఫర్‌ను ఇస్తున్నట్టు వొడాఫోన్ ప్రకటించింది.

  షాక్: తగ్గిన జియో చందాదారులు, ఎందుకంటే?

  రిలయన్స్ జియో మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇతర టెలికం కంపెనీలు కూడ తమ టారిఫ్ ప్లాన్లు కూడ మార్చుతున్నాయి. తమ కష్టమర్లను ఆకర్షించేందుకు వొడాఫోన్ కూడ తాజాగా కొత్త టారిఫ్ ప్రకటించింది.

  జియో బంపర్ ఆఫర్: రూ.399 రీ ఛార్జీ చేస్తే, రూ.2599 క్యాష్ బ్యాక్

  వొడాఫోన్ చోటా చాంపియన్ పేరుతో ఈ కొత్త ప్లాన్‌ను అమల్లోకి తెచ్చింది. రిలయన్స్ జియో ట్రిపుల్ క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ఇటీవలే ప్రకటించింది. అయితే కష్టమర్లను ఇతర కంపెనీల వైపుకు వెళ్ళకుండా ఉండేందుకు ఈ ప్యాకేజీని ప్రవేపెట్టిందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

  శుభవార్త: వర్చువల్ రియాలిటీ అప్లికేషన్ ప్రారంభించనున్న జియో

  చోటా ఛాంపియన్ ప్యాకేజీ

  చోటా ఛాంపియన్ ప్యాకేజీ


  వోడాఫోన్ సోమవారం నాడు ఓ స్పెషల్‌ వాయిస్‌, డేటా ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. మధ్య ప్రదేశ్‌, చత్తీష్‌ఘడ్, బీహార్‌, జార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రాంత ప్రీపెయిడ్‌ కస్టమర్లకు వొడాఫోన్‌ చోటా ఛాంపియన్‌ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్‌ కింద రూ.38 రూపాయలకే 100 నిమిషాల లోకల్‌, ఎస్టీడీ కాలింగ్ సౌకర్యాన్ని కల్పించింది వొడాపోన్. 100ఎంబీ 3జీ, 4జీ డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు పేర్కొంది.

  తక్కువ ధరకే నెలంతా సౌకర్యం

  తక్కువ ధరకే నెలంతా సౌకర్యం

  తమ కస్టమర్లు ఇతర కంపెనీలకు తరలిపోకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో వొడాఫోన్ కొత్త ప్లాన్ తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. చోటా ఛాంపియన్ ప్యాక్ అని తీసుకొచ్చారు. తక్కువ ధరలో నెలంతా ప్రయోజనాలను అందించడం ఇదే తొలిసారని వోడాఫోన్ ఇండియా కన్జ్యూమర్‌ బిజినెస్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ అవ్‌నీష్‌ కోస్లా తెలిపారు.

  ఉచితంగా 100 ఎంబీ డేటా

  ఉచితంగా 100 ఎంబీ డేటా

  వోడాఫోన్ కష్టమర్లకు ఈ ప్లాన్ కింద అదనంగా కస్టమర్లకు 100ఎంబీ డేటాను అందించనున్నారు. అంతేకాదు ఉచితంగా వాయిస్ కాల్స్ కూడ ఇవ్వనున్నారు. ఈ కారణంగా తమ కష్టమర్లు ఇతర టెలికం కంపెనీల వైపుకు వెళ్ళే అవకాశం తక్కువగా ఉంటుందని వోడాపోన్ మార్కెటింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

  జియోకు పోటీగా వొడాఫోన్ ప్లాన్స్

  జియోకు పోటీగా వొడాఫోన్ ప్లాన్స్

  ఇటీవలే వొడాఫోన్‌ తన కొత్త ఫస్ట్‌ రీఛార్జ్‌ కూపన్‌ రూ.496కు లాంచ్‌చేసింది. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ పరిధిలోని కొత్త వొడాఫోన్‌ ప్రీపెయిడ్‌ యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. వొడాఫోన్‌ తీసుకొచ్చిన రూ.496 ప్లాన్‌, రిలయన్స్‌ జియో రూ.459 ప్లాన్‌కి గట్టి పోటీగా ఉంది. దీంతో పాటు వొడాఫోన్‌ ఎఫ్‌ఆర్‌సీ 177 ప్లాన్‌ను లాంచ్‌చేసింది. దీని కింద 28 రోజలు పాటు 28జీబీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్‌ సౌకర్యాన్ని అందిస్తోంది.

  English summary
  Vodafone has launched a new prepaid recharge pack, named Chhota Champion, with both data and calling benefits at Rs. 38. The new recharge pack comes with validity of 28 days and comes with 100 minutes of local and STD calls as well as 100MB data for the entire validity period. It can be purchased via retail outlets, MyVodafone app, Vodafone and other recharge websites, and USSD.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more