బిహార్ లో రోడ్డుపై VVPAT స్లిప్పులు .. ఏం జరుగుతోంది..?
బిహార్ లో ఇటీవల తొలి దశ పోలింగ్ పూర్తయిన విషయం తెలిసిందే. అయితే సమస్తిపూర్ జిల్లాలో రోడ్డుపై VVPAT స్లిప్పులు పెద్దసంఖ్యలో కనిపించాయి. దీంతో స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్ ను సస్పెండ్ చేశారు. అతడిపై కేసు నమోదు చేశారు అధికారులు. సమస్తిపూర్ జిల్లా సరాయ్ రంజన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఓ కాలేజీ వద్ద రోడ్డుపై ఇలా VVPAT స్లిప్పులు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో వెంటనే ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ఈ మేరకు జిల్లా మేజిస్ట్రేట్ కు ఆదేశాలు జారీ చేశారు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
"ఈ VVPAT స్లిప్పులు మాక్ పోలింగ్ లో భాగమైనవి. కానీ ఇలా జరగడం ఎన్నికల విధానానికి విఘాతం కలిగిస్తుంది. ఎన్నికల సమగ్రతను దెబ్బతీస్తుంది. ఇప్పటికే పోటీ చేసిన అభ్యర్థులకు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సమాచారం అందించారు. ఏఆర్ఓ సస్పెండ్ అయ్యారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది" అని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు.
समस्तीपुर के सरायरंजन विधानसभा क्षेत्र के KSR कॉलेज के पास सड़क पर भारी संख्या में EVM से निकलने वाली VVPAT पर्चियां फेंकी हुई मिली।
— Rashtriya Janata Dal (@RJDforIndia) November 8, 2025
कब, कैसे, क्यों किसके इशारे पर इन पर्चियों को फेंका गया? क्या चोर आयोग इसका जवाब देगा? क्या यह सब बाहर से आकर बिहार में डेरा डाले लोकतंत्र के… pic.twitter.com/SxOR6dd7Me
అయితే ఈ ఘటనపై రాష్ట్రీయ జనతాదళ్ పలు ప్రశ్నలు సంధించింది. ఎవరి ఆదేశాల మేరకు ఇలా చేశారని మండిపడింది. ఈసీ దీనికి సమాధానం చెప్తుందా అని ప్రశ్నించారు ఆర్జేడీ నేతలు. అయితే ఈ ఘటనకు సంబంధించిన అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు ఈసీ స్పష్టం చేసింది. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నట్లు స్పష్టం చేసింది.

ఇక నవంబర్ 6 న బిహార్ తొలిదశ పోలింగ్ నిర్వహించారు. 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. నవంబర్ 6న జరిగిన ఎన్నికలో మొత్తం 65.08 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఇక రాష్ట్రంలో రెండో దశ పోలింగ్ నవంబర్ 11వ తేదీన జరగనుంది. ఆ దశతో బిహార్ లో మొత్తం ఎన్నికలు ముగుస్తాయి. రెండో దశలో 20 జిల్లాల్లో 122 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. రెండు దశల పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. ఫలితాలు అదే రోజు వెల్లడికానున్నాయి.












Click it and Unblock the Notifications