Halal meat: యుద్ధానికి సిద్దం, అధికార పార్టీతో ఢీ, అదే జరిగింతే వార్ వన్ సైడ్, నో డౌట్ !
బెంగళూరు/బెళగావి: కర్ణాటకలో బెళగావిలో శాసన సభ సమావేశాలు వాడివేడిగా జరగడానికి రంగం సిద్దం అయ్యింది. 14 బిల్లులు ప్రవేశపెట్టి సభలో ఆమోదం పొందాలని అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ప్రయత్నాలను తిప్పికొట్టాలని ప్రతిపక్షాలు సిద్దం అవుతున్నాయి. ముఖ్యంగా అధిక పార్టీ, ప్రతిపక్షాల నాయకుల మద్య హలాల్ మాంసం వ్యవహారం ముదిరిపోయే అవకాశం ఉందని తెలిసింది. కర్ణాటకలో హలాల్ మాంసం నిషేధంపై బిల్లు ప్రవేశపెట్టడానికి రంగం సిద్దం కావడంతో ఈ శీతాకాల సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది.

బెళగావిలో శీతాకాల సమావేశాలు
కర్ణాటక శాసన సభా సమావేశాలు సోమవారం నుంచి బెళగావిలో జరుగుతున్నాయి. కర్ణాటకలో హలాల్ మాంసాన్ని నిషేధించే హలాల్ వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టాలనే బీజేపీ ప్రభుత్వ ప్రణాళి సిద్దం చేసింది. కర్ణాటక శాసన సభా శీతాకాల సమావేశాలలో ఢీకొట్టడానికి బిజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు మళ్లీ సిద్దం అవుతున్నారు.

హలాల్ మంసాం నిషేధించాలని ?
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ మినహా మరే ఇతర సంస్థల ద్వారా ఫుడ్ సర్టిఫికేషన్‌ను నిషేధించాలని మనవి చేస్తూ బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రవికుమార్ బిల్లును తీసుకొచ్చారు. ఇదే సంవత్సరం మార్చి నెలలో ఉగాది పండుగ సందర్భంగా హలాల్ మాంసాన్ని కర్ణాటకలో బహిష్కరించాలని హిందుత్వ సంస్థలు పిలుపునిచ్చాయి. తరువాత హలాల్ మాంసం వ్యవహారం వివాదానికిదారితీసింది.

గవర్నర్ కు లేఖ
హలాల్ మాసం నిషేధం బిల్లును ఆమోదించడం ద్వారా దీనికి చట్టబద్ధత కల్పించాలని బీజేపీలోని ఒక వర్గం కోరుతోంది.
బీజేపీ ఎమ్మెల్సీ రవికుమార్ దీన్ని ప్రైవేట్ బిల్లుగా ప్రవేశపెట్టాలని భావించి కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు ఇప్పటికే లేఖ రాశారు. అయితే, ఇప్పుడు దానిని ప్రభుత్వ బిల్లుగా ప్రవేశపెట్టాలని బీజేపీ శాసన సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఎన్నికలకు సమయం లేదు మిత్రమా
కర్ణాటక అసెంబ్లీలో హలాల్ మాంసానికి వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకురావాలని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 2023లో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. శాసనభ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో మరో రాజకీయ ఘర్షణకు హలాల్ మాంసం వేదిక అవుతోంది. బీజేపీ ఎమ్మెల్సీ రవికుమార్ దీనిని ప్రైవేట్ బిల్లుగా తీసుకురావాలని భావించారు. అయితే ఇప్పుడు బీజేపీ నాయకత్వం హలాల్ మాంసం నిషేధాన్ని అధికారిక చట్టంగా మార్చాలని కోరుతోంది.

గతంలో మతమార్పిడి నిషేధం చట్టం కూడా ఇక్కడే
గతంలో బెళగావిలో జరిగిన శాసన సభ సమావేశాల్లో బీజేపీ ప్రభుత్వం మతమార్పిడి నిరోధక చట్టం బిల్లుకు ఇక్కడే ఆమోద ముద్ర వేసింది. ఆ సందర్బంలో బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగింది. ఇప్పుడు అదే బెళగావి శాసన సభ సమావేశాల సందర్బంగా హలాల్ మాంసం నిషేధం బిల్లు వ్యవహారంలో సేమ్ సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంది.

ఇరు పార్టీల చాలెంజ్
హలాల్ బిల్లు ఆమోదం కాకుండా అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ నాయకులు యూటీ, ఖాదర్, బీకే. హరిప్రసాద్ అంటున్నారు. ఈ శాస సభా సమావేశాల్లో మేము ప్రవేశపెట్టే అన్ని బిల్లులకు ఆమోదం పొందుతామని మంత్రి మధుస్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కన్నడిగులకు ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల శాతం పెంచాలని బిల్లుతో పాటు మొత్తం 14 బిల్లులకు ఆమెద ముద్ర వెయ్యాలని అధికార బీజేపీ నాయకులు అన్ని సిద్దం చేసుకుంటున్నారు.
-
చిరంజీవి మార్గమా? పవన్ వ్యూహమా? విజయ్ ముందున్న అసలు సవాల్ ఇదే! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?












Click it and Unblock the Notifications