ఈసారి దక్షిణాదిలో మండిపోనున్న ఎండలు: కానీ, ఉత్తరాది కంటే తక్కువే
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఎండలు మండిపోనున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. అయితే, ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ఎండలు కాస్తంత తక్కువగానే ఉండనున్నాయని తెలిపింది. పలు ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం ఎండలు మండిపోనున్నాయని తెలిపింది.
హైదరాబాద్, బెంగళూరు నగరాల్లోనూ ఎండలు ఎక్కువగానే ఉండనున్నాయని వెల్లడించింది. వచ్చే వేసవిని ఎదుర్కొనేందుకు హైదరాబాద్ నగర ప్రజలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని వాతావరణ శాఖ డైరెక్టర్ వైకే రెరడ్డి తెలిపారు. 45 డిగ్రీల వరకు ఎండలు నమోదు కానున్నాయని తెలిపారు.

దేశంలోని 17 రాష్ట్రాల్లో సాధారణం కన్నా ఒక డిగ్రీ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా 0.5 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.
కాగా, ఎల్‌నినో కారణంగా గతేడాది సరైన వర్షాలు కురవలేదు. కానీ ఈసారి లా నినా వల్ల కొంత ఉపశమనం లభిస్తుందని ఐఎండీ స్పష్టంచేసింది. పసిఫిక్ మహాసముద్ర తూర్పు భూమధ్యరేఖ ప్రాంతంలో ఏర్పడే లా నినా పరిస్థితుల వల్ల మన దేశంలో వర్షాలు మెండుగా కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. లా నినా పరిస్థితులంటే.. తూర్పు భూమధ్యరేఖ ప్రాంత పసిఫిక్ మహాసముద్ర జలాల ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. కచ్చితంగా వర్షాకాలం ఎలా ఉంటుందన్నది ఐఎండీ చెప్పకపోయినా.. ఈ పరిస్థితులు మాత్రం మంచి పరిణామమేనని స్పష్టంచేసింది.
నిజానికి జూన్ తర్వాత లా నినా పరిస్థితుల బలహీన పడతాయని గత జనవరిలో ఐఎండీ అంచనా వేసినా.. ఇప్పుడు వాటిని సవరించింది. గతేడాది ఊహించినదానికంటే రెండు రోజుల ముందూ రుతు పవనాలు వచ్చినా.. ఎల్ నినో పరిస్థితుల కారణంగా సరైన వర్షాలు కురవలేదు. అయితే ఈ ఏడాది ఎండాకాలం మాత్రం మాడు పగలగొట్టడం ఖాయమని వాతావరణ శాఖ తెలిపింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications