viral video:వరద తాకిడికి కొట్టుకుపోయిన కారు, ఇదిగో వీడియో, వైరల్
అసలే వర్షాలు.. వర్షపునీటితో వరద పోటెత్తుతుంది. అవును రహదారులు కూడా చెరువులను తలపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. రాజస్థాన్‌లో వర్షాలు ఎక్కువగానే ఉన్నాయి. వర్షాల తాకిడికి ఏకంగా వాహనాలే కొట్టుకుపోతున్నాయి. జనం ఏమో ఇళ్లలో బిక్కుబిక్కుమనే పరిస్థితి నెలకొంది. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యారు.

కొట్టుకుపోయిన కారు
వీడియోలో కనిపిస్తోంది రాజస్థాన్‌లోని జోధ్‌పూర్.. ఇక్కడ వర్ష బీభత్సం కొనసాగుతుంది. అయితే జోధ్‌పూర్‌లో ఒక కారు కొట్టుకుపోయింది. ఆ వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతుంది. ఇక్కడే కాదు చాలా చోట్ల ఇలాంటి పరిస్థితి నెలకొంది. జోధ్‌పూర్‌లో వర్షాల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులను ప్రకటించారు. వర్షాలతో ఇప్పటికే ఐదుగురు చనిపోయారని.. వీరిలో నలుగురు చిన్నారులు ఉన్నారని లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. మృతిచెందిన వారికి సభ సంతాపం తెలియజేసింది.

వానొచ్చే.. వరదొచ్చే
అజ్మీర్‌లో 9 సెంటిమీటర్ల వర్షం కురిసింది. అలిఘడ్‌లో 7 సెంటిమీటర్లు, అసింద్‌లో 6 సెంటిమీటర్లు, ప్రతాప్ ఘడ్‌లో 5 సెంటిమీటర్లు, కరౌలీ, జైపూర్‌లో 5 సెంటిమీటర్ల వర్షం కురిసింది. జోధ్ పూర్, కోట, అజ్మీర్, ఉదయ్ పూర్‌లో భారీగా వర్షం కురిసింది. భరత్ పూర్, జైపూర్ బికనీర్‌లలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశ ఉందని తెలిపింది.
ఆగి ఉన్న మరో కారు..
వర్షం దాటికి కారు మాత్రం కొట్టుకుపోయింది. కారు బ్లూ కలర్‌లో కనిపించింది. అదీ కొట్టుకుపోయే సమయంలో వాటర్ ప్లో ఎక్కువగా ఉంది. అదే వీడియోలో మరో కారు కనిపించింది. కానీ అక్కడ వరద ప్రవాహాం కాస్త తక్కువగా ఉంది. అందుకే ఆ కారు అలా నిలిచిపోయింది. బ్లూ కారు మాత్రం కొట్టుకుపోయింది. ఆ సమయంలో అందులో ఎవరూ లేరు. దీంతో ప్రమాదం తప్పింది. ఆ వీడియోలో కొందరు బాల్కనీలో ఉన్నట్టు కనిపించారు. వారు ఇదేం వర్షాలు రా బాబు అని తలలు పట్టుకున్నారు. వరుణా దేవ ఇక శాంతించు అని అడిగారు.












Click it and Unblock the Notifications