VIRAL:కింగ్ కోబ్రాకు కిస్, నీ ధైర్యానికి జోహర్లు, వైరల్
పాములు అంటే హడలిపోతాం. ఇక నాగుపాములు అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవును అదీ దూరంగా ఉంటేనే భయపడాల్సిన పరిస్థితి. కానీ ఒకతను మాత్రం భయం లేకుండా పామునే కిస్ చేశాడు. అదీ కూడా కింగ్ కోబ్రా కావడం విశేషం. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు కూడా ఆ వీడియో చూడండి.

పెట్స్‌గా పాములు
కొందరు పాములను పెట్స్‌గా కూడా పెంచుకుంటారు. కానీ అన్నీ పాములు పెట్స్ కావు. విషపూరితమైనవి కూడా.. కొందరు పైథాన్స్ పెంచుతున్నారు. కానీ అవీ వారితో సరదాగా ఉంటున్నాయి. కానీ ఒకతను మాత్రం చాలానే ధైర్యం చేశారు. నాగు పామును వెనకనుంచి ముద్దు పెట్టుకున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ట్రోల్ అవుతుంది.

ఇన్ స్టలో షేర్
వీడియోను ఇన్ స్టలో సౌరభ్ జాదవ్ షేర్ చేశారు. వావా సురేశ్ అనే వ్యక్తి కింగ్ కోబ్రాను కిస్ చేశాడు. చాలా మెల్లిగా దానిని కిస్ చేశారు. ఆ వీడియో తెగ ట్రోల్ అవుతుంది. ఇప్పటికే 16 వేల సార్లు చూశారు. చాలా మంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక విధంగా రాస్తున్నారు. నాగుపాముతో డేంజర్ అని అంటున్నారు. చాలానే ధైర్యం చేశారుగా అని అన్నారు. నయం అదీ ఏం చేయలేదు అని మరొకరు రాశారు. తృటిలో తప్పించుకున్నాడు అని మరొకరు రాశారు.
డేంజరే.. కానీ
పాములు.. విష పురుగులు, కొన్ని మహా డేంజర్. కానీ కొందరు వాటితో ఫీట్స్ చేస్తున్నారు. కొందరు వ్యక్తులు అందులో నిపుణులు.. సో ఫర్లేదు. మరికొందరు అయితే అలా కాకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో సదరు వ్యక్తులు చనిపోతున్నారు కూడా. సురేశ్ కూడా అలానే చేశాడు. కానీ బతికి బయటపడ్డాడు.












Click it and Unblock the Notifications