VIRAL VIDEO:గులాబ్ జామ్‌తో ఓల్డ్ మంక్ రమ్, వేడి చేసి మరీ, వైరల్
వెరైటీ టేస్ట్ కోసం ట్రై చేస్తుంటారు కొందరు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అవును ఇటీవల కొందరు ఓల్డ్ మంక్‌తో టీ కలిపేశారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఇప్పుడు గులాబ్ జామ్‌తో మరోటి కలిపారు. అదీ టీ, కాఫీ, బూస్ట్ కాదు.. ఓల్డ్ మంక్ రమ్, అవును.. దానిని కలిపి, షేర్ చేశారు. ఇప్పుడు ఇదీ వైరల్ అవుతుంది.
స్విట్‌తో ఇలా..
గులాబ్ జామ్ అంటే చాలా మందికి ఇష్టం. అదీ వారి ఫేవరేట్ ఫుడ్ కూడా. అయితే దాంతో ఇటీవల కొందరు చేసినట్టు రమ్ కలిపారు. అవును ఓ కప్పులో రెండు జామ్ వేసి.. అందులో పానకం కూడా వేశారు. అందులో కొంచెం రమ్ యాడ్ చేశారు. దానిని స్టౌ మీద పెట్టి కాసేపు ఉంచారు. ప్లేమ్ రాగానే.. కిందకి దింపేశారు. అందులో పెట్టిన ప్లేమ్ కనిపించింది.

జామున్‌తో ఇలా..
ఈ వీడియోను ఇన్ స్టాలో గౌరవి షేర్ చేశారు. ప్రిపేర్ చేసిన ఆమె క్లినికల్ న్యూట్రిషీయనిస్ట్ కావడం విశేషం. దానికి గులాబ్ జామున్ ఓల్డ్ మంక్ ప్లేంబే అని క్యాప్షన్ ఇచ్చారు. ఇంకేముంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది. ఆ వీడియోకు ఇప్పటికే 9 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. లక్ష 69 వేల 116 లైకులు వచ్చాయి.

ఓల్డ్ మంక్ రమ్
ఇదివరకు గోవాలో టీలో ఓల్డ్ మంక్ రమ్ కలిపారు. దానికి ఓల్డ్ మంక్ టీ ఇన్ గోవా అని క్యాప్షన్ పెట్టారు. దాంతోపాటు ఈ వీడియో కూడా ట్రోల్ అవుతుంది. నెటిజన్లు జోరుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓల్డ్ మంక్ రమ్ అనేది ఫుడ్ ఐటెమ్స్ కోసం కూడా పనిచేస్తోందని అంటున్నారు. అందుకోసమే, టీలో.. గులాబ్ జామ్‌లో పనిచేస్తోందని వివరించారు. దీనిపై చాలా మంది కామెంట్ చేస్తున్నారు. కొందరెమ టెక్ ఇట్ ఈజీ అంటున్నారు. మరికొందరు ఇదీ చాలా ప్రమాదకరం అంటున్నారు. ఛీ చీ అనే కామెంట్ ఒకరు పెట్టారు. చాలా మంది రియాక్ట్ అవుతూ.. తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.












Click it and Unblock the Notifications