రోహిత్ శర్మకు టీమిండియా కేప్టెన్సీని అప్పగించడం వెనుక..: స్టింగ్ ఆపరేషన్‌ వలలో చీఫ్ సెలెక్టర్

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. రెండో టెస్ట్ ఈ నెల 17వ తేదీన ఢిల్లీ వేదికగా ప్రారంభం కానుంది. ఈ పరిణామాల మధ్య బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ చేసి

న్యూఢిల్లీ: డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడిక రెండో టెస్ట్ కోసం సమాయాత్తమౌతోంది. ఈ మ్యాచ్ కు ఢిల్లీ ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ నెల 17వ తేదీన ఆరంభమౌతుందీ టెస్ట్. దీనికోసం టీమిండియా ప్లేయర్లు ముమ్మరంగా కసరత్తు సాగిస్తోన్నారు. నెట్ ప్రాక్టీస్ లో చేస్తోన్నారు.

స్టింగ్ ఆపరేషన్ లో..

స్టింగ్ ఆపరేషన్ లో..

ఈ పరిణామాల మధ్య తాజాగా- భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సరికొత్త వివాదానికి కేంద్రబిందువు అయ్యాయి. ఓ జాతీయ న్యూస్ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో బుక్ అయ్యాడు అలనాటి హ్యాట్రిక్ హీరో చేతన్ శర్మ. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేప్టెన్సీ మార్పు వెనుక చోటు చేసుకున్న తతంగాన్ని అనూహ్యంగా బయటపెట్టాడు. విరాట్ కోహ్లీ తన కేప్టెన్సీని వదులుకోవడానికి గల అసలు కారణాన్ని బయటపెట్టాడు.

ఇద్దరికీ పడదు..

ఇద్దరికీ పడదు..

టీమిండియా మాజీ కేప్టెన్, టాప్ ఆర్డర్ బ్యాటంగ్ బ్యాక్ బోన్ విరాట్ కోహ్లీ- బీసీసీఐ మాజీ ఛైర్మన్ సౌరభ్ గంగూలీకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉండేదని చేతన్ శర్మ వ్యాఖ్యానించాడు. ఇద్దరికీ ఈగో విభేదాలు పతాకస్థాయిలో ఉండేవని చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ అంటే సౌరభ్ గంగూలీకి ఏ మాత్రం అభిమానం ఉండేది కాదని, అతణ్ణి ప్రశంసించడానికీ అంగీకరించేవాడు కాదని అన్నారు. కోహ్లీని మెచ్చుకోవడానికి గంగూలీ ఇష్టపడేవాడు కాదని చెప్పారు.

ఆ కారణంతోనే..

ఆ కారణంతోనే..

విరాట్ కోహ్లీని అన్ని ఫార్మట్ల క్రికెట్ కేప్టెన్సీ నుంచి తొలగించడానికి అదే ప్రధాన కారణమై ఉండొచ్చని తాను భావిస్తున్నట్లు చేతన్ శర్మ వ్యాఖ్యానించాడు. ఒకదశలో- బీసీసీఐ అధ్యక్షుడి వల్లే తాను కేప్టెన్సీని కోల్పోయానని విరాట్ కోహ్లీ భావించాడని వ్యాఖ్యానించాడు చేతన్ శర్మ. కోహ్లీ తన మాట వినడనే నిశ్చితాభిప్రాయంలో సౌరభ్ గంగూలీ ఉండేవాడని, ఈ విషయం- తొమ్మిదిమంది సెలెక్షన్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ లో బయటపడిందని వివరించాడు.

రోహిత్ అంటే కూడా..

రోహిత్ అంటే కూడా..

విరాట్ కోహ్లీతో ఈగో క్లాష్ ఉన్న నేపథ్యంలో సౌరభ్ గంగూలీ.. అటు రోహిత్ శర్మను కూడా ఇష్టపడే వాడు కాదని చేతన్ శర్మ స్పష్టం చేశారు. రోహిత్‌ శర్మను గంగూలీ మెచ్చుకోవడం, ప్రశంసించడం తాను చూడలేదని చెప్పాడు. తాను కేప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు భారత్- దక్షిణాఫ్రికా సిరీస్‌ కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో విరాట్ కోహ్లీ ప్రకటించడానికి గంటన్నర ముందు తనకు చెప్పాడని గుర్తు చేశారు.

సంజును తీసుకోకపోతే..

సంజును తీసుకోకపోతే..

టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ సంజు శాంసన్ ను జట్టులోకి గనక తీసుకోకపోతే నెటిజన్లు, అతని అభిమానులు తమను ఏకీపారేస్తారనే అభిప్రాయం తమలో ఉండేదని చేతన్ శర్మ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. సంజులో ఓ మంచి స్పెషలిస్ట్ బ్యాటర్ ఉన్నాడని అన్నాడు. ఇషాన్ కిషన్ ఆడిన ఒకే ఒక్క సెంచరీ ఇన్నింగ్- ముగ్గురు బ్యాటర్లు జట్టులో స్థానం కోల్పోయేలా చేసిందని వ్యాఖ్యానించాడు. సంజు శాంసన్, శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్ ను పక్కన పెట్టాల్సి వచ్చిందని వ్యాఖ్యానించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+