హైఅలర్ట్, చెన్నై చిత్తడి, రెండు రోజులు జాగ్రత్త అంటూ వార్నింగ్, ఆంధ్రాకు !
చెన్నై: రానున్న 24 గంటల్లో చెన్నైతో పాటు ఆ నగర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ కేంద్రం సౌత్ జోన్ చీఫ్ బాలచంద్రన్ సోమవారం మీడియాకు చెప్పారు. చెన్నై సిటీతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, కడలూరు, డెల్టా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం సౌత్ జోన్ చీఫ్ బాలచంద్రన్ తెలిపారు.
నైరుతి బంగాళాఖాతంలో ఎగువన మారిన పరిస్థితుల కారణంగా దాని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో పలు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని బాలచంద్రన్ అన్నారు. చెన్నైలో భారీ వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి. రాత్రి మొదలైన వర్షం చెన్నైలో పగలంతా కొనసాగింది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలే కాకుండా ప్రధాన రహదారులు సైతం జలమయం అయ్యాయి.

మెట్రో రైలు పనులు జరుగుతున్న రోడ్లపై భారీ ఎత్తున నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కార్యాలయాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాగా భారీ వర్షాలకు గల కారణాలను వివరించిన బాలచంద్రన్ భారీ వర్షాలు మాత్రమే కురుస్తాయని అయితే తుపాను వచ్చే అవకాశం లేదని తెలిపారు. వాతావరణంలో భారీ మార్పుల వలన భారీ వర్షాలు కురుస్తాయని బాలచంద్రన్ తెలిపారు.

జూన్‌లో చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాలపై బాలచంద్రన్ స్పందిస్తూ 1996 తరువాత ఈ ఏడాది అత్యంత భారీ వర్షాలు కురిశాయని అన్నారు. గతంలో 1996లో చెన్నైలో 285 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఈ ఏడాది 158 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని బాలచంద్రన్ వివరించారు. మీనంబాక్కంలో 16 సెంటీమీటర్లు, నుంగంబాక్కంలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షం 2 రోజుల పాటు ఉంటుందని బాలచంద్రన్ తెలిపారు.

బంగాళకాతం ఎగువన వాతావరణం మార్పుల కారణంగా రానున్న రెండు రోజుల చెన్నైతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని బాలచంద్రన్ తెలిపారు. నుంగంబాక్కంలో 1996లో 347 మి.మీ వర్షం కురిసింది. ఈ ఏడాది 84.7 మి.మీ వర్షం కురిసింది. నైరుతి రుతుపవనాలు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌కు 34 మి.మీ సాధారణంగా నమోదు అయ్యింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, విల్లుపురం, కడలూరు, డెల్టా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ కేంద్రం చీఫ్ బాలచంద్రన్ సూచించారు.












Click it and Unblock the Notifications