Wedding: ఫంక్షన్ హాల్ లోనే పెళ్లికూతురికి స్వీట్ లో విషం పెట్టి ఇచ్చి ?, రూమ్ లో ఏం జరిగింది ?

బెంగళూరు/చింతామణి/మదనపల్లె: పక్కరాష్ట్రంలో ఉన్న పెళ్లికొడుకు ఫంక్షన్ హాల్ కు చేరుకున్నాడు. పెళ్లి కూతురు ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఫంక్షన్ హాల్ లోకి వెళ్లింది. పెళ్లికూతురు రెడీ కావడానికి ఓ రూమ్ ఇచ్చారు. రూమ్ లో రెడీ అవుతున్న పెళ్లికూతురి దగ్గరకు ఓ మహిళ వెళ్లింది. నీకు అంతామంచి జరగాలని స్వీట్ చేసుకుని వచ్చానని చెప్పింది. పెళ్లికూతురికి స్వీట్, జ్యూస్ ఇచ్చింది. స్వీట్ తిని జ్యూస్ తాగిన పెళ్లికూతురు కుప్పకూలిపోయింది. రెండు గంటల్లో పెళ్లి చేసుకోవలసిన పెళ్లికూతురికి స్వీట్ లో విషం కలిపి ఇచ్చారని వెలుగు చూడటం కలకలం రేపింది.

ఆంధ్రా అబ్బాయి.... కర్ణాటక అమ్మాయి

ఆంధ్రా అబ్బాయి.... కర్ణాటక అమ్మాయి

కర్ణాటకలోని చింతామణి పట్టణం సమీపంలోని చెన్నసంద్రలో నివాసం ఉంటున్న ఫిజాకానం అలియాస్ ఫిజా జబీవుల్లా (20) అనే యువతికి, ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణంలోని ఇందిరానగర్ లో నివాసం ఉంటున్న నూర్ బాషా అనే యువకుడితో పెళ్లి ఫిక్స్ అయ్యింది.

ఫంక్షన్ హాల్ లో పెళ్లికూతురు

ఫంక్షన్ హాల్ లో పెళ్లికూతురు

పెద్దలు కుదుర్చిన పెళ్లికావడంతో ఇరు వైపుల కుటుంబ సభ్యులు పెళ్లికి బయలుదేరారు. బెంగళూరు-మదనపల్లె బైపాస్ రోడ్డులోని చింతామణి సమీపంలోని రాయల్ ఫ్యామిలీ ఫంక్షన్ హాల్ లో మంగళవారం రాత్రి పెళ్లి జరిపించడానికి ఏర్పాట్లు చేశారు. పెళ్లికూతురు ఫిజా కానమ్ ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి జరిపించారు.

రెఢీ అవుతున్న పెళ్లికూతురు

రెఢీ అవుతున్న పెళ్లికూతురు

పెళ్లి కొడుకు నూర్ కూడా అతని కుటుంబ సభ్యులతో మదనపల్లె నుంచి బయలుదేరి చింతామణి సమీపంలోని రాయల్ ఫామిలీ ఫంక్షన్ హాల్ కు చేరుకున్నాడు. పెళ్లి కూతురు ఫిజా కానం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఫంక్షన్ హాల్ లోని ఓరూమ్ లోకి వెళ్లింది. పెళ్లికూతురు ఫిజా కానం రెడీ కావడానికి మరో రూమ్ కూడా ఇవ్వడంతో ఆమె అక్కడ రెఢీ అవుతోంది.

నా మొగుడు దుబాయ్ లో ఉన్నాడు... నీకు మంచి జరుగుతోంది

నా మొగుడు దుబాయ్ లో ఉన్నాడు... నీకు మంచి జరుగుతోంది

రూమ్ లో రెడీ అవుతున్న పెళ్లికూతురు ఫిజా కానం దగ్గరకు ఓ మహిళ వెళ్లింది. నా భర్త దుబాయ్ లో ఉన్నాడని, తాను పెళ్లికొడుక్కి చాలా దగ్గర బంధువు అని పెళ్లికూతురు ఫిజా కానంను పరిచం చేసుకుంది. నీకు అంతామంచి జరగాలని ఇంట్లో ప్రత్యేకంగా స్వీట్ తయారు చేసుకుని తీసుకువచ్చానని పెళ్లికూతురు ఫిజా కానంకు మాయమాటు చెప్పింది.

స్వీట్ లో విషం కలిపి పెళ్లికూతురికి ఇచ్చింది

స్వీట్ లో విషం కలిపి పెళ్లికూతురికి ఇచ్చింది

పెళ్లికూతురు ఫిజా కానంకు స్వీట్, జ్యూస్ ఇచ్చింది. పెళ్లికూతురు ఫిజా కానం స్వీట్ తిని జ్యూస్ తాగే వరకు అక్కడే ఉన్న మహిళ తరువాత రూమ్ లో నుంచి వెళ్లిపోయింది. స్వీట్ తిన్న కొంతసేపటికి పెళ్లికూతురు ఫిజా కానం కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను చింతామణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేసి స్వీట్ లో విషం కలిపారని చెప్పడంతో అందరూ హడలిపోయారు.

కిలాడీ లేడీ చిక్కింది..... ఎందుకు చేసింది ?

కిలాడీ లేడీ చిక్కింది..... ఎందుకు చేసింది ?

రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. పెళ్లికూతురు కుటుంబ సభ్యులు, పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులను విచారణ చేసి వివరాలు సేకరించారు. బెంగళూరులోని కేఆర్ పురంలో నివాసం ఉంటున్న తస్లీమా ఆలం అలియాస్ తస్లీమా తన్వీర్ అనే మహిళ మీద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రెండు గంటల్లో పెళ్లి చేసుకోవలసిన పెళ్లికూతురికి స్వీట్ లో విషం కలిపి ఇచ్చారని వెలుగు చూడటం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+