West Bengal: బీజేపీతో బంధం బట్టబయలు-ముస్లిం పార్టీతో ఎంఐఎం కటాఫ్..!

పశ్చిమబెంగాల్లో (west bengal) అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో మమతా బెనర్జీ హవాకు అడ్డుకట్ట వేసి ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీతో తృణమూల్ మాజీ నేత, ఏజేయూపీ పార్టీ అధ్యక్షుడు హుమాయూన్ కబీర్ (humayun kabir) వెయ్యి కోట్లకు డీల్ కుదుర్చుకున్న వీడియో బయటికి వచ్చింది. ముస్లింలను (muslims) బీజేపీ (bjp)వైపు తిప్పడానికి ఆయన చేసిన ప్రయత్నం ఇందులో బయటపడింది. దీన్ని కబీర్ ఖండించినా ఆయనతో పొత్తును తెగదెంపులు చేసుకుంటున్నట్లు ఎంఐఎం (AIMIM) ప్రకటించింది.

బెంగాల్లో గతేడాది బాబ్రీ మసీదు కూల్చివేత దినమైన డిసెంబర్ 6న హడావిడిగా మరో బాబ్రీ మసీదు నిర్మిస్తానని టీఎంసీ నేత హుమాయూన్ కబీర్ ముందుకొచ్చారు. అలాగే ఈ మసీదు నిర్మాణం కోసం దాదాపు 200-300 కోట్ల చందాలు కూడా సేకరించారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న టీఎంసీకి కూడా ఈ పరిణామం ఇబ్బందికరంగా మారింది. దీంతో హుమాయూన్ కబీర్ ను మమత పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఆయన ఆమ్ జనతా ఉన్నయాన్ పార్టీ పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎంతో పొత్తు కూడా పెట్టుకుంది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న మమతా బెనర్జీ కూపీ లాగారు.

West Bengal AIMIM Dumps Ally Humayun Kabir Following TMC Sting on Alleged BJP Deal to Divide Votes

ఇందులో హుమాయూన్ కబీర్ ముస్లింలను బీజేపీవైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తేలింది. ఈ వీడియోలో వెల్లడైన ఆరోపణలపై ఈడీ విచారణ జరపాలని టీఎంసీ కోరింది. ఈ వీడియో బెంగాల్ ఎన్నికలలో మమతా బెనర్జీని ఓడించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి కార్యాలయం పన్నిన కోట్ల రూపాయల ప్లాన్ లో భాగమని టీఎంసీ ఆరోపించింది. అయితే కబీర్ ఆ వీడియోను "ఏఐ-జనరేటెడ్" అని కొట్టిపారేశారు. తనపై బురదజల్లే ప్రచారాన్ని టీఎంసీ నాయకత్వం నడిపిస్తోందని ఆయన ఆరోపించారు. పార్టీలోని సీనియర్ నాయకులపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

West Bengal AIMIM Dumps Ally Humayun Kabir Following TMC Sting on Alleged BJP Deal to Divide Votes

అయితే ఈ వీడియోలో, తాను ప్రధానమంత్రి కార్యాలయంతో సంప్రదింపులు జరిపినట్లు, ప్రతిపక్ష నేత సువేందు అధికారి, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల నాయకులతో సమన్వయం చేసుకోవాలని తనకు సలహా ఇచ్చినట్లు కబీర్ పేర్కొన్నట్లుగా ఉంది. అలాగే "ముస్లింలను మోసం చేయడం సులభం" అని చెప్తూ కబీర్ చేసిన వ్యాఖ్యలు బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించిన ప్రస్తావనలు, అలాగే అడ్వాన్స్ నిధులుగా రూ.200 కోట్లు కావాలన్న ఆరోపణలతో కూడిన డిమాండ్లు ఉన్నాయి. అలాగే మైనారిటీ ఓట్లను టీఎంసీ నుండి మళ్లించే వ్యూహాన్ని కబీర్ వివరిస్తున్నట్లుగా కూడా ఉంది. ఇలా ఓట్లను మళ్లించడం వల్ల బీజేపీకి ప్రయోజనం చేకూరుతుందని ఆయన చెప్తున్నారు. అలాగే రూ.1,000 కోట్ల ప్లాన్ గురించి ప్రస్తావిస్తూ, అందులో రూ. 200 కోట్లు ఇప్పటికే అడ్వాన్స్‌గా అందినట్లు ఆయన చెప్తున్నట్లుగా ఉంది. ఈ వీడియో నేపథ్యంలో కబీర్ పై ఫైర్ అయిన ఎంఐఎం.. ఆయన పార్టీతో తెగదెంపులు చేసుకుని ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+