జారిపడ్డ సీఎం: నుదుటన మళ్లీ గాయం

Mamata Banerjee: దేశంలో లోక్‌సభ కోలాహలం నెలకొంది. ప్రచార తీవ్రత ఉధృతమౌతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే సహా వివిధ పార్టీల నాయకులు ముమ్మరంగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నారు.

ఇప్పటికే రెండు విడతల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. 190 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. తొలి విడతలో 102, మలి విడతలో 88 నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంకా అయిదు దశల్లో పోలింగ్ కొనసాగాల్సి ఉంది. జూన్ 1వ తేదీన ఎన్నికలు ముగుస్తాయి. 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.

West Bengal Lok Sabha election 2024 CM Mamata Banerjee fell down in helicopter

ఈ పరిణామాల మధ్య తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి కష్టాలు తొలగట్లేదు. అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నట్టు కనిపిస్తోంది. ఇదివరకు నుదుట గాయంతో బాధపడ్డారామె. ఇప్పుడిప్పుడే ఆ గాయం పూర్తిగా మానిపోయింది. ఇప్పుడు మళ్లీ నుదుట గాయం అయినట్లు తెలుస్తోంది.

ఎన్నికల ప్రచార కార్యక్రంలో పాల్గొనడానికి బయలుదేరి వెళ్తూన్న ఆమె కిందపడ్డారు. పశ్చిమ్ బర్ధమాన్ జిల్లాలోని దుర్గాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ ఎక్కి.. లోనికి వెళ్లిన అనంతరం సీటులో కూర్చోబోయే ముందు మమత బెనర్జీ కిందపడ్డారు. దీనితో నుదుటికి గాయమైనట్లు సమాచారం. అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించారు. అసన్‌సోల్‌కు బయలుదేరి వెళ్లారు.

మూడో విడత ఎన్నికల్లో భాగంగా మే 7వ తేదీన పశ్చిమ బెంగాల్‌లో నాలుగు లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. మల్దాహా నార్త్, మల్దాహా సౌత్, జంగీపూర్, ముర్షీదాబాద్ స్థానాలకు పోలింగ్ ఉంటుంది. ఇప్పటికే రెండు విడతల్లో కూచ్ బిహార్, అలీపూర్‌దార్, జల్‌పాయ్‌గురి, డార్జిలింగ్, రాయ్‌గంజ్, బలూర్‌ఘాట్ సీట్లకు పోలింగ్ పూర్తయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+