ఈ ఏడాది ఎక్కువమంది గూగుల్​లో ఏం వెతికారు.. టాప్ ట్రెండ్ లో ఏం ఉందంటే!

2025 సంవత్సరం ముగింపు దశకు వచ్చేసింది. ఇక ఈ సంవత్సరం జనాల ఇంట్రెస్ట్ ఏంటి? ఎక్కువగా దేనిని చూశారు? ఏమేం చేశారు? ఎలాంటి టాపిక్స్ మీద ఆసక్తి చూపించారు? వంటి వివరాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అయితే ఈ సంవత్సరం గూగుల్లో ఎక్కువమంది దేశప్రజల ఆసక్తులను, ప్రాధాన్యతలను తెలియజేసే ఇయర్ ఇన్ సెర్చ్ 2025 నివేదికను గూగుల్ విడుదల చేసింది. ఈ నివేదిక ద్వారా ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.

టాప్ సెర్చ్ లో ఇదే
గూగుల్ లో ఓవరాల్ ట్రెండింగ్ జాబితాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ అగ్రస్థానంలో నిలిచింది. సహజంగా ఐపీఎల్ మీద ప్రజల ఆసక్తి ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి దీనికోసం సెర్చ్ చేసిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ఇది టాప్ పొజిషన్లో ఉంది. ఆ తర్వాత గూగుల్ జెమినీ ఏఐ చాట్ బాట్ రెండవ స్థానంలో నిలిచింది. దేశంలో కృత్రిమ మేధస్సు పట్ల పెరుగుతున్న ఆసక్తిని ఇది స్పష్టం చేస్తుంది.

What did people search for most on Google in 2025 What s in the top trend

ఈ పదాలు ఎక్కువగా సెర్చ్ చేసిన జాబితాలో
టాప్ టెన్ లో సగానికి పైగా క్రికెట్ తో సహా క్రీడా సంబంధిత అంశాలే ఉండడం ప్రధానంగా కనిపిస్తుంది. భారతదేశంలో క్రికెట్ పట్ల ఉన్న అపారమైన ఆసక్తిని, ప్రాచుర్యాన్ని ఇస్ సెర్చ్ ట్రెండ్ స్పష్టం చేస్తుంది. ఇక స్పోర్ట్స్ తో పాటు 2025 లో భారతీయులు సయ్యారా, ధర్మేంద్ర, మహా కుంభమేళ వంటి పదాలను గూగుల్లో ఎక్కువగా సెర్చ్ చేశారు.

ఏఐ లో ఆధిక్యాన్ని కొనసాగించింది ఇదే
గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెమినీ తన ఆధిక్యాన్ని కొనసాగించగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలైన గ్రోక్, డీప్ సీక్, పెర్ప్లెక్సిటీ వంటి ఇతర ఏఐ సాధనాలను కూడా గూగుల్ లో ఎక్కువ మంది శోధించారు. గూగుల్లో చాట్ జీపీటీ ఏడవ స్థానంలో, చాట్ జి పి టి గిబ్లి ఆర్ట్ ట్రెండ్ ఎనిమిదవ స్థానంలో నిలిచాయి.

ట్రెండింగ్ ట్రెండ్స్ లో అగ్రస్థానంలో ఇదే
ఇక google లో ట్రెండింగ్ ట్రెండ్స్ జాబితాలో జెమినీ ట్రెండ్ అగ్రస్థానం సంపాదించగా దీని తర్వాత గిబ్లి ట్రెండ్, 3డి మోడల్ ట్రెండ్, జెమిని శారీ ట్రెండ్ వంటి శోధనలు దేశంలో బాగా ప్రాచుర్యాన్ని పొందాయి. సాంకేతికత, కళా, ఫ్యాషన్ రంగాలలో ఇవి వినియోగదారుల యొక్క ఆసక్తులను సూచిస్తున్నాయి.

సినిమాలు, టీవీ షోలలో టాప్ లో ఇవే
ఇక సినిమాలు టీవీ షోలో విషయానికి వస్తే 2025 లో అత్యధికంగా సెర్చ్ చేసిన టీవీ షో లలో స్క్విడ్ గేమ్, పంచాయత్, బిగ్ బాస్, ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్, పాతాళ లోక్ వంటి టీవీ షోస్ ఉన్నాయి. సినిమాలు విభాగంలో కాంతార లెజెండ్ చాప్టర్ 1, సయ్యారా, కూలి వంటి చిత్రాలు ఉన్నాయి.

లోకల్ సమాచారం సెర్చ్ లో ఎక్కువ అడిగిన సమాచారం ఇదే
ఇక ప్రజలు లోకల్ సమాచారం కోసం సెర్చ్ చేసిన దానిలో నియర్ మీ ప్రశ్నలలో ఎర్త్ క్వేక్ నియర్ మీ, ఎయిర్ క్వాలిటీ నియర్ మీ, దుర్గా పూజ నియర్ మీ వంటి పదాలు ముఖ్యంగా ట్రెండ్ అయ్యాయి. ఇక అది మాత్రమే కాకుండా గూగుల్ ఇండియా ఇయర్ ఇన్ సెర్చ్ 2025 ది ఏ టు జెడ్ పేరుతో ఆసక్తికరమైన జాబితాను అలాగే మీనింగ్ క్యూస్ విభాగాన్ని కూడా అందించింది. మొత్తంగా 2025 సంవత్సరంలో టాప్ లో ఐపీఎల్ నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+