అఖిలేష్ అక్రమాస్తుల కేసు ఏమైంది ? సుప్రిం ధర్మాసనం
మరోసారి యూపి రాజకీయాలు వెడెక్కాయి, తాజా రాజకీయ పరిమాణాల నేపథ్యంలో పార్టీల మధ్య పోరు రసవత్తరంగా మారింది, ఈనేపథ్యంలోనే ములాయం సింగ్ యాదవ్ కుటుంభ సభ్యుల అక్రమాస్తుల విచారణ మరోసారి తెరపైకి వచ్చింది..కేసు పురోగతి విషయాలు తెలుపాలంటూ సుప్రిం కోర్టు సిబిఐని ఆదేశించింది

ములాయం కుటుంభసభ్యుల అక్రమాస్తుల కేసు
సమాజ్ వాది చీఫ్ అఖిలేష్ యాదవ్,మరియు ములాయం యాదవ్ ల అక్రమాస్తుల కేసుపై సుప్రిం కోర్టు మరోసారి స్పందించింది. వారి అక్రమాస్తుల కేసుకు సంబందించి ఏం జరుగుతుందని సిబిఐని ప్రశ్నించింది. 2007 కేసుకు సంబందించి వివరాలను అసలు కేసు రిజస్టర్ అయిందా లేదా మేము తెలుసుకోవాలనుకుంటున్నామని సిబిఐని అడిగింది. కాగా రెండు వారాల్లో పూర్తి వివరాలు సమర్పించాలని జస్టీస్ రంజన్ గగోయ్ తో కూడిన ధర్మాసనం సిబిఐని ఆదేశించింది.

2007 లో సుప్రిం కోర్టు ఆదేశం
కాగా యూపి మాజి ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మరియు అఖిలేష్ యాదవ్ లపై అక్రమ అస్తులు కల్గి ఉన్నారంటూ 2007 లో ఆరోపణలు వచ్చాయి.దీంతో సిబిఐ విచారణ చేపట్టింది ...అయితే అప్పటి నుండి కేసుకు సంబందించి ఎలాంటీ పురోగతి లేకపోవడంతో తాజగా సుప్రిం కోర్టు సిబిఐని ప్రశ్నించింది..

కేసు పూర్వాపరాలు
విశ్వనాథ్ చతుర్వేది అనే రాజకీయ కార్యకర్త 2005 లో ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ ,ఆయన భార్య డింపుల్ తో పాటు ములాయం కుమారులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ ఆస్తులు సంపాదించారని ఆరోపిస్తూ దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని సుప్రిం కోర్టులో కేసు వేశారు.దీంతో సుప్రిం కోర్టు మార్చ్ 2007 న వారందరిపై విచారణ చేపట్టాలని సిబిఐని ఆదేశించింది.ఈనేపథ్యంలోనే మరోసారి 2012 లో సైతం సుప్రిం కోర్టు ములాయం సింగ్ తోపాటు అఖిలేశ్ యాదవ్ లపై విచారణ చేపట్టాలని ఆదేశించింది
2007, 2012 లో ఆదేశాలు సుప్రిం నుండి ఆదేశాలు వెళ్లినా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు కాకపోవడం గమనార్హం
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications