"రేపిస్టు మీ గదికే వస్తే మీరేం చేస్తారు?..": విద్యార్థినులకు ఎమ్మెల్యే వికృత ప్రశ్నలు

అత్యాచార ఘటనపై బీహార్ కు చెందిన ఓ ఎమ్మెల్యే విద్యార్థినులతో అత్యంత మొరటుగా వ్యవహరించారు. తానే పోలీసు అవతారం ఎత్తి ఇంటరాగేషన్ చేపట్టిన సదరు నాయకుడు వికృత ప్రశ్నలు సంధించి .

బీహార్: అత్యాచార ఘటనపై బీహార్ కు చెందిన ఓ ఎమ్మెల్యే విద్యార్థినులతో అత్యంత మొరటుగా వ్యవహరించారు. తానే పోలీసు అవతారం ఎత్తి ఇంటరాగేషన్ చేపట్టిన సదరు నాయకుడు 'ఆ అమ్మాయి రేప్ కు గురైందని ఎలా చెప్పగలరు? ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది? అని ప్రశ్నిస్తూ వారిని మరింత ఆందోళనకు గురిచేశారు.

బీజేపీ మిత్ర పక్షమైన కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ ఎమ్మెల్యే లలన్ పాశ్వాన్ ఇలా వికృత ప్రశ్నలు సంధించి ఆ విద్యార్థినులను ఇబ్బంది పెట్టారు.

బీహార్ లోని వైశాలీలో ప్రభుత్వ వసతిగృహంలో చదువుకునే ఓ పదో తరగతి విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఆమె దుస్తులు రక్తంలో తడిసిపోయాయి. ఈ ఘటన నేపథ్యంలో వసతిగృహానికి వచ్చిన ఎమ్మెల్యే పాశ్వాన్ తానే స్వయంగా మిగిలిన విద్యార్థినులను ప్రశ్నిస్తూ ఇంటరాగేషన్ కు పూనుకున్నారు.

"What If It Happens To You?.." Bihar MLA Asks Girls On Friend's Rape-Murder

అభ్యంతరకరమైన ప్రశ్నలు అడిగిన ఆయన.. "మీరు విద్యార్థులు. మీ సమాధానాలు స్పష్టంగా ఉండాలి. రేపెప్పుడైనా మీపైనే ఇలాంటి ఘటన జరగొచ్చు.. ఏం జరిగిందో మీరు స్పష్టంగా చెప్పలేకపోతే ఎలా? రేపిస్టు మీ గదికే వస్తే మీరేం చేస్తారు?.." అంటూ విద్యార్థినులపై ప్రశ్నల వర్షం కురిపించారు.

తానే స్వయంగా డిటెక్టివ్ అవతారం ఎత్తి.. "రేపిస్టు కొంతమంది అమ్మాయిలకు తెలిసినవాడే అయి ఉండొచ్చు.." అంటూ విద్యార్థినుల వంక అనుమానంగా చూశారు. అంతటితో ఎమ్మెల్యే ఆగలేదు. ఉపాధ్యాయులవైపు తిరిగి.. " మీలో కూడా కొంతమంది రేపిస్టుకు సాయం చేసి ఉండొచ్చు కదా?.." అన్నారు.

ఈ ఘటనకు సంబంధించి వీడియో ఒకటి వెలుగు చూడడం దుమారం రేపుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా బెంగళూరులో కీచక పర్వం నేపథ్యంలో.. విద్యార్థినుల పట్ల ఎమ్మెల్యే పాశ్వాన్ మొరటు ప్రవర్తన చర్చనీయాంశం అవుతోంది. అయితే ఎమ్మెల్యే లలన్ పాశ్వాన్ మాత్రం తన తీరును సమర్థించుకుంటూ.. " నా ప్రశ్నల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదు.." అని దులిపేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+