వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:గైరెటరీ సీజర్.. అంటే 180 డిగ్రీల్లో తిప్పడమే, ఇతడు ఇలా రైలు కింద పడి...

|
Google Oneindia TeluguNews

కొందరికీ నీళ్లు చూస్తే భయం, మరికొందరికీ ఎత్తయిన ప్రాంతం నుంచి చూస్తే ఒళ్లు జరదరిస్తోంది. ఇంకొందరికీ ఊరికే తిప్పుతుంది. వారు ఆడినా.. నిల్చొన్నా అంతే.. అయితే గైరెటరీ సీజర్.. అంటే సమీపం నుంచి ఏదయినా కదులుతుంటే వారు కూడా 180 డిగ్రీలు తిరుగుతారు. అంటే బస్సు కావచ్చు.. రైలు కావచ్చు.. ఇలాంటి ఘటన ఒకటి ఆగ్రా రైల్వేస్టేషన్‌లో జరిగింది. ఆ వీడియో ఒకరు తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. తెగ వైరల్ అవుతుంది. 51 సెకన్ల నిడివి గల ఆ వీడియోకు 230 కే వ్యూస్ వచ్చాయి. మీరు ఆ వీడియో చూడండి.

నిల్చొని ఉన్న వ్యక్తి..

నిల్చొని ఉన్న వ్యక్తి..

అక్కడ రైల్వే స్టేషన్‌లో ఒక్కరు నిల్చొని ఉన్నారు. వ్యక్తి బాగానే ఉన్నారు అని అనుకున్నాం. ఎదురుగా ఒకరు ఉన్నారు.. కానీ బానే ఉన్నారు కదా అనుకుని ఉంటాడు. ఇంతలో ఒక గూడ్స్ రైలు వచ్చింది. అతను కాసేపు అలానే ఉండిపోయాడు. కానీ రైలు కదా.. బోగీలు బానే ఉన్నాయి. 20 సెకన్ల వరకు బానే ఉన్నాడు.. ఇక అప్పటి నుంచి తిరగడం ప్రారంభించాడు. 180 డిగ్రీల యాంగిల్‌లో మెల్లగా తిరిగాడు. అలా 10 సెకన్లు తిరిగాడో లేదు.. వెళుతున్న రైలు కింద పడిపోయాడు. ఎదురుగా ఉన్న వ్యక్తి మాత్రం అలానే ఉన్నాడు. కానీ దూరంగా ఉన్న వ్యక్తి మాత్రం పరుగెత్తుకుని వచ్చాడు. కాపాడే ప్రయత్నం చేయాలని అనుకున్నాడు. కానీ అక్కడ ఏ మాత్రం ఛాన్స్ లేదు. అలా చూస్తు ఉండిపోయాడు.

గైరెటరీ సీజర్.. అంటే


అతను అలా పడిపోవడాన్ని గైరెటరీ సీజర్ అంటారు. సమస్య ఉన్న వారు కదిలే వస్తువులను చూడొద్దట. కానీ అతను రైల్వేస్టేషన్ వద్ద ఉండి.. రైలు పక్కనే ఉన్నాడు. కాసేపు ఒర్చుకున్నాడు.. కానీ లాభం లేకపోయింది. అతని మెదడు ఆయన ఆధీనంలో లేకుండా పోయింది. చివరకు తిరిగి తిరిగి పడిపోయాడు. అయితే అతని వద్ద కూడా ఎవరూ లేరు. ఎవరైనా తోడు ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చది కాదు. కానీ ఒక్కడే ఉండటంతో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.

ఒంటరిగా ఉండొద్దట

ఒంటరిగా ఉండొద్దట

మెదడులో సమస్య ఉన్న వారు.. కదిలే వస్తువులను చూస్తే 180 డిగ్రీల వరకు తిరుగుతారట. శరీరం నియంత్రణను కోల్పోతుందట. అలా తిరిగి, తిరిగి పడిపోతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. సమస్య ఉన్న వారిని ఒంటరిగా వదిలి వేయొద్దని సూచిస్తున్నారు. అలా వదిలి వేస్తే ఆగ్రా రైల్వే స్టేషన్‌లో జరిగిన విధంగా ప్రమాదాలు జరుగుతాయని.. ప్రాణాలు కూడా కోల్పోవచ్చు అని చెబుతున్నారు. సో సమస్య ఉన్న వారు మెడిసిన్స్ వాడుతూ.. జాగ్రత్తగా ఉండాల్సిందే.. లేదంటే విలువైన ప్రాణం కోల్పోతారు.

English summary
Gyratory Seizure.. defined as rotation around d body's axis during a seizure for at least 180° Looking at big moving objects in different directions may cause this temporary neuro-anomaly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X