మంత్రి స్మృతి ఇరానీపై బాలీవుడ్ నటుడు, ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ : ప్రముఖ నటుడు బీజేపీ ఎంపీ పరేశ్‌ రావల్‌ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఫైర్‌ బ్రాండ్‌ గా అభివర్ణించారు. ఆమె సారథ్యంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ దూసుకెళుతోందని ప్రశంసించారు.

అంతేకాదు, మంత్రి చేపడుతున్న నియామకాలు చిత్ర పరిశ్రమకు మరింత లబ్ధి చేకూర్చేలా ఉన్నాయని పరేశ్ రావల్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌(సీబీఎఫ్‌సీ)కి ప్రముఖ పాటల రచయిత ప్రసూన్‌ జోషిని, అలాగే, పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు చైర్మన్‌గా అనుపమ్‌ ఖేర్‌ను నియమించడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

వీరిద్దరు కూడా చిత్ర పరిశ్రమకు మరింత ఊపునిచ్చేందుకు చాలా అవసరం అని పరేశ్ రావల్ వ్యాఖ్యానించారు. వారి నియామకం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి స్మృతి ఇరానీ కూడా పరేశ్ రావల్ వ్యాఖ్యలకు కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కారం పెడుతున్న ఎమోజీని ట్వీట్‌ రూపంలో బదులిచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Actor and BJP MP Paresh Rawal tweeted his admiration for Union minister Smriti Irani, calling her a "firebrand". Rawal said the Information and Broadcasting is a "firebrand" for appointing lyricist Prasoon Joshi+ as chairman of the Central Board of Film Certification (CBFC) and for yesterday naming actor Anupam Kher+ , chair of the Film and Television Training Institute of India. "Much needed boost for the film industry," is how Rawal described the appointments.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి