అదే నిజమైతే- జార్ఖండ్‌లో ఎలా గెలిచారట..!!

Chandrababu: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ పాగా వేసింది. కనీవినీ ఎరుగని అత్యంత భారీ మెజారిటీని సాధించింది. శివసేన (ఏక్‌నాథ్ షిండే)- బీజేపీ- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) సారథ్యంలోని మహాయుటికే మరోసారి ఓటర్లు జైకొట్టారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఇక్కడ ఫలితాలు వెలువడుతున్నాయి.

మొత్తం 288 నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 145. దీన్ని అలవోకగా అందుకుంది మహాయుటి. మధ్యాహ్నానికి ఈ కూటమి అభ్యర్థులు 73 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించారు. మరో 156 చోట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

When Congess win in Jharkhand the EVM is correct says Eknath Shinde

ఎన్నో అంచనాలు ఉన్న మహా వికాస్ అఘాడీ పూర్తిగా నిరాశపరిచింది. ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. 10 సీట్లల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 42 చోట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఏకపక్షంగా వెలువడుతున్నాయి ఇక్కడి ఫలితాలు.కొప్రి- పఛ్‌పకడీలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, నాగ్‌పూర్ సౌత్ వెస్ట్‌, బారామతిల్లో ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్.. తమ ప్రత్యర్థులపై భారీ ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

ఈ ఘన విజయం నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ సమావేశం అయ్యారు. సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు ఎలా ఉండాలి?, కూటమిలో భాగస్వామిగా ఉంటోన్న మూడు పార్టీలకూ ఎలాంటి పోర్ట్‌ఫోలియోలను కేటాయించాలనే విషయం చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు.

ఈ భేటీ ముగిసిన తరువాత ఈ ముగ్గురు నేతలూ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్రిక్కిరిసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మరాఠా ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. చారిత్రాత్మక తీర్పు ఇచ్చారంటూ కితాబిచ్చారు. ప్రజా సేవకు పునరంకితమౌతామని అన్నారు.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్ల వల్లే గెలిచారంటూ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన యూబీటీ వర్గానికి చెందిన నాయకులు చేస్తోన్న ఆరోపణలను తిప్పి కొట్టారు. కాంగ్రెస్ ఎప్పుడు, ఎక్కడ ఓటమి పాలైనా సరే- ఈవీఎంలపై ఆడిపోసుకోవడం అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.

మహారాష్ట్రలో తాము ఈవీఎంల వల్లే గెలిచివుంటే జార్ఖండ్‌లోనూ అదే జరిగివుండేదని ఏక్‌నాథ్ షిండే అన్నారు. జార్ఖండ్‌లో ఈవీఎంల వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచిందని తాము ఆరోపణలు చేయవచ్చు కదా? అని చురకలు అంటించారు. కాంగ్రెస్ ఆరోపణలు అర్థరహితమైనవని కొట్టిపారేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+