డబ్బు కోసం వ్యభిచారం చేయమన్న బాయ్ ఫ్రెండ్, ఆమె ఏం చేసిందంటే..
ఏడాది కాలంగా తనతో సహజీవనం చేస్తున్న బాయ్‌ఫ్రెండ్ డబ్బు కోసం వ్యభిచారం చేయమని ఒత్తిడి చేస్తుండడంతో భరించలేక ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో జరిగింది.
న్యూఢిల్లీ : ఏడాది కాలంగా తనతో సహజీవనం చేస్తున్న బాయ్‌ఫ్రెండ్ డబ్బు కోసం వ్యభిచారం చేయమని ఒత్తిడి చేస్తుండడంతో భరించలేక ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో జరిగింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బడాన్ ప్రాంతానికి చెందిన నీరజ్ ట్యాక్సీ డ్రైవరుగా పని చేస్తున్నాడు. నీరజ్ కు రేష్మా అలియాస్ దీప్తీ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సహజీవనం దాకా వెళ్లింది.
ఏడాదికాలంగా నీరజ్, రేష్మాలిద్దరూ దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలోని ఓ ఫ్లాటులో అద్దెకు ఉంటూ సహజీవనం చేస్తున్నారు. డబ్బు సంపాదించేందుకు రేష్మాను వ్యభిచారం చేయాలని నీరజ్ ఒత్తిడి చేశాడు.

దీంతో రేష్మా భరించలేక సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బయటకు వెళ్లిన నీరజ్ ఫ్లాటుకు వచ్చి తలుపు తట్టినా తీయకపోవడంతో స్థానికుల సహకారంతో తలుపు పగులగొట్టి చూడగా రేష్మా మృతదేహం కనిపించింది.
పోలీసులు వచ్చి ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, అక్కడ ఉన్న సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్నారు. బాయ్‌ఫ్రెండ్ వ్యభిచారం చేయమని వేధిస్తున్నందునే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని రేష్మా తన సూసైడ్ నోట్ లో రాసింది. రేష్మా ఆత్మహత్యకు కారణమైన నీరజ్ ను పోలీసులు అరెస్టు చేశారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ..












Click it and Unblock the Notifications