• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పార్టీలకు నిధుల్లో పార‌ద‌ర్శ‌క‌త ఎక్క‌డ ? 50శాతం అజ్ఞాత నిధులే..!!

|

న్యూఢిల్లీ/ హైద‌రాబాద్ : ప్రాంతీయ పార్టీల‌తో స‌హా జాతీయ రాజ‌కీయ పార్టీలు నాలుగు రోజులు మ‌నుగ‌డ సాధించాలంటే ముఖ్యంగా కావ‌ల్సింది ఆర్ధిక ప‌రిపుష్టి. ఆర్థికంగా నిల‌దొక్కుకున్న పార్టీలు ఎక్కువ రోజులు ప్ర‌జా క్షేత్రంలో ప‌నిచేస్తాయ‌ని చాలా సార్లు రుజువైంది. ఆర్ధికంగా చితికి పోయిన పార్టీల మ‌నుగ‌డ అంతంత మాత్రంగానే ఉంటుంద‌ని, ఎప్పుడు ఏ పార్టీలో విలీనం అవుతుందో తెలియ‌ని ప‌రిస్థితులు నెల‌కొంటాయి. కాని ఎక్కువ రోజులు మ‌న గ‌లుగుతున్న రాజ‌కీయ పార్టీల ఆర్థిక ప‌రిస్థితి, వ‌న‌రుల స‌మీక‌ర‌ణ‌, ఆదాయం తదిత‌ర అంశాలు ఆస‌క్తిని రేకెత్తిస్తుంటాయి.

జాతీయ పార్టీలకు అజ్ఞాత నిధులు..! ఎంత మొత్తం అదిందో వెల్ల‌డించిన‌ ఎడిఆర్‌..!!

జాతీయ పార్టీలకు అజ్ఞాత నిధులు..! ఎంత మొత్తం అదిందో వెల్ల‌డించిన‌ ఎడిఆర్‌..!!

అస‌లు ప్రాంతీయ పార్టీల‌కు గాని, రాజ‌కీయ పార్టీల‌కు గాని అంత పెద్ద మొత్తంలో నిధులు ఎలా స‌మ‌కూరుతాయ‌నేదే మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా త‌యార‌య్యింది. విరాళాలు సేక‌రించో, పార్టీ వ్య‌వ‌స్తాప‌క దినోత్స‌వం రోజున నాయ‌కులు ఇచ్చే ఫండ్స్ పార్టీని న‌డిపించ‌డం సాద్య‌మౌతుందా.? అనేది కూడా అంతుచిక్క‌ని ప్ర‌శ్నే..! ఐతే పార్టీల‌కు సానుభూతి ప‌రులు, నాయ‌కులు ఇచ్చే విరాళాలు కాకుండా మ‌రో దారి నుండి నిధులు నీటి ప్ర‌వాహంలా పార్టీల‌కు వ‌చ్చి చేరుతున్న‌ట్టు తెలుస్తోంది. జాతీయ పార్టీల‌తో స‌హా ప్రాంతీయ పార్టీల మ‌నుగ‌డ‌కు ఇదే మూల ఆదాయంగా తెలుస్తోంది. మ‌రి ఈ ఆజ్ఞాత నిధులు ఏ పార్టీకి ఎంత మొత్తంలో చేరుతున్నాయో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

బిజెపి, కాంగ్రెస్‌, బిఎస్‌పి, టిఎంసి, ఎన్‌సిపిలకు ఆదాయం..! సుమారు 12వేల కోట్ల అజ్ఞాత ఆదాయం..!

బిజెపి, కాంగ్రెస్‌, బిఎస్‌పి, టిఎంసి, ఎన్‌సిపిలకు ఆదాయం..! సుమారు 12వేల కోట్ల అజ్ఞాత ఆదాయం..!

2017- ఆర్థిక సంవత్సరంలో జాతీయ పార్టీలకు 50 శాతంకుపైగా నిధులు తెలియని అజ్ఞాత వర్గాల గుండా అందాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్‌(ఎడిఆర్‌) పేర్కొంది. ఎన్నికల సంఘానికి ఆరు జాతీయ పార్టీలు సమర్పించిన ఐటి రిటర్ను లు, విరాళాల ప్రకటనలను విశ్లేషించి కనుగొన్న విషయాలను ఎడిఆర్‌ బుధవారం వెల్లడించింది. 2017- బిజెపి, కాంగ్రెస్‌, బిఎస్‌పి, టిఎంసి, ఎన్‌సిపిల మొత్తం ఆదాయం 1293.05 కోట్లు. ఈ పార్టీలకు తెలియని వర్గాల నుంచి అందిన ఆదాయం 689.44 కోట్లు. అంటే ఇది వాటి మొత్తం ఆదాయంలో 53 శాతం. బిజెపి ఒక్కటే తెలియని వర్గాల ద్వారా 553.38 కోట్లు ఆదాయాన్ని ప్రకటించింది. దేశంలో ఇదే అజ్ఞాతం నుంచి వ‌చ్చిన పెద్ద మొత్తంగా త‌లుస్తోంది.

పార్టీల మ‌నుగ‌డ‌కు అజ్ఞాత నిధులే కీల‌క‌మా..? ఎవ‌రిస్తున్నారో తెలియ‌ని ప‌రిస్థితులు..!!

పార్టీల మ‌నుగ‌డ‌కు అజ్ఞాత నిధులే కీల‌క‌మా..? ఎవ‌రిస్తున్నారో తెలియ‌ని ప‌రిస్థితులు..!!

ఇది జాతీయ పార్టీల తెలియని వర్గాల మొత్తం ఆదాయంలో 80 శాతం. 689.44 కోట్లలో ఎలక్టోరల్‌ బాండ్లల ద్వారా అందింది 215 కోట్లు. ఇది 31 శాతం అని ఎడిఆర్‌ తన నివేదికలో పేర్కొంది. పార్టీలకు తెలియని వర్గాల నుంచి అందిన నిధులు 354.22. వాటికి అందిన 36 శాతం ఆదాయం లేక 467.13 కోట్లు తెలిసిన దాతలు ఇచ్చినవి. వారిపేర్లు ఎన్నికల సంఘానికి ఇచ్చిన నివేదిక ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఆరు జాతీయ పార్టీలు ఇతరత్రా అంటే ప్రచురణలు, సభ్యత్వ ఫీజులు, బ్యాంకు వడ్డీ, పార్టీ లెవీ వంటి రూపేణ 136.48 కోట్లు ఆదాయం పొందాయి.

నిధుల విష‌యంలో లోపించిన స్ప‌ష్ట‌త‌..! లెక్క‌లు చెప్ప‌ని పార్టీలు..!

నిధుల విష‌యంలో లోపించిన స్ప‌ష్ట‌త‌..! లెక్క‌లు చెప్ప‌ని పార్టీలు..!

జాతీయ పార్టీలకు కేవలం 16.80 లక్షలు మాత్రమే నగదు రూపేణ విరాళాలు అందాయిన ఆ నివేదిక పేర్కొంది. సిపిఐ(ఎం) కూడా జాతీయ పార్టీయే అయినప్పటికీ దానిని ఈ విశ్లేషణలో చేర్చలేదు. ఎందుకంటే 2017- ఆర్థిక సంవత్సరంలో దాని షెడ్యూల్స్‌ లేక అనెక్సర్స్‌ అందుబాటులో లేవు. ప్రస్తుతం 20,000 లేక ఎలక్టోరల్‌ బాండ్ల రూపేణ విరాళాలు ఇచ్చే సంస్థలు, వ్యక్తుల పేర్లను వెల్లడించాల్సిన పనిలేదు. సెంట్రల్‌ ఇన్‌ఫార్మేషన్‌ కమిషన్‌(సిఐసి) తెచ్చిన సమాచార హక్కు చట్టం కిందకి జాతీయ పార్టీలను తీసుకొచ్చారు. అయినప్పటికీ అవి ఈ నిర్ణయానికి కట్టుబడడం లేదు. అంటే పార్టీల నిధుల విష‌యంలో పార‌ద‌ర్శ‌క‌త లేద‌ని స్ప‌ష్ట‌మౌతోంది.

English summary
The Association for Democratic Reform (ADR) has stated that in 2017, national parties have received more than 50 percent of the funding for unknown states. ADR has revealed the findings of the IT returns submitted by six national parties to the Election Commission and analyzing donations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X