డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేసిన అజ్జయ్య ఎవరు ?, ఆ గుడి ఎక్కడ ఉంది, ఎందుకు !
బెంగళూరు/తుమకూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన డీకే శివకుమార్ గంగాధర అజ్జయ్య సాక్షిగా తాను ప్రమాణం చేస్తున్నానని ప్రమాణ స్వీకారం సందర్బంగా అందరి సమక్షంలో చెప్పారు. సిద్దరామయ్యతో పాటు మంత్రులు దేవుడి మీద ప్రమాణం చెయ్యడంతో డీకే శివకుమార్ మాత్రం గంగాధర అజ్జయ్య సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని బహిరంగంగా చెప్పారు.
తాను కష్టకాలంలో ఉన్న సమయంలో తనను ఆదుకున్నది గంగాధర అజ్జయ్య అని అనేక సందర్బాల్లో డీకే శివకుమార్ చెప్పారు. తనను కాపాడిన దేవుడు గంగాధర అజ్జయ్య అని డీకే శివకుమార్ బహిరంగంగా అందరికి చెప్పారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నమ్ముతున్న దేవుడు ఎవరు ?, ఆ గుడి ఎక్కడ ఉంది అని ఇప్పుడు చాలా మంది ఆరా తీస్తున్నారు.

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని తిపటూరు తాలుకాకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో నోణువీనకెరె గ్రామంలోని కాడుసిద్దేశ్వర మఠంలో పూజించే దేవుడు గంగాధర అజ్జయ్య. 800 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ మఠంలో గంగాధర అజ్జయ్య వస్తువులు, గుడి, గోశాల ఉంది. తుమకూరు జిల్లాతో పాటు పలు జిల్లాలకు చెందిన భక్తులు, ప్రముఖులు ఈ మఠంకు వెళ్లి గంగాధర అజ్జయ్య ఆశీర్వాదం తీసుకుంటారు.
ఎస్ఎం క్రిష్ణ మహారాష్ట్ర గవర్నర్ గా నియమితులు అయిన సమయంలో ఇదే గంగాధర అజ్జయ్య ఆశ్రమానికి వెళ్లి మఠాధిపతి ఆశీర్వాదం తసుకుని వెళ్లారు. మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు వీ. సోమణ్ణ కూడా ఇదే మఠం భక్తుడు సుమారు 20 ఏళ్ల నుంచి గంగాధర అజ్జయ్య మఠంకు వెళ్లి గురూజీ ఆశీర్వాదం తీసుకుంటున్న డీకే శివకుమార్ గంగాధర అజ్జయ్యకు పరమభక్తుడు అయ్యారు.
మూడు సంవత్సరాల క్రితం ఐటీ. ఇడీ, సీబీఐ దాడులతో ఉక్కిరిబిక్కిరి అయిన డీకే శివకుమార్ జైలుకు వెళ్లారు. జైలు నుంచి విడుదల అయిన డీకే శివకుమార్ నేరుగా గంగాధర అజ్జయ్య సన్నిధికి వెళ్లి స్వామిజీ ఆశీర్వాదం తీసుకున్నారు. నువ్వు ఇలాంటి దాడులకు భయపడకూడదని, నీకు భవిష్యత్తులో సీఎం అయ్యే యోగ్యం ఉందని, ధైర్యంగా ఉండాలని అక్కడి గురూజీ డీకే శివకుమార్ కు ధైర్యం చెప్పారని తెలిసింది.

డీకే శివకుమార్ ఆయన కుమార్తె ఐశ్వర్య వివాహం చేసుకునే ముందు కూడా గంగాధర అజ్జయ్య ఆశీర్వాదం తీసుకుని కూతురు పెళ్లి చేశారు. సీఎం రేసులో సిద్దరామయ్య గట్టిపోటీ ఇచ్చిన సమయంలో. ఢిల్లీకి వెళ్లే ముందు రోజు, డీకే శివకుమార్ పుట్టిన రోజు కూడా గంగాధర అజ్జయ్య అశీర్వాదం తీసుకుని అక్కడి గురూజీ సూచనలు, సలహాలు తీసుకుని డీకే శివకుమార్ ముందుకు వెళ్లారు.












Click it and Unblock the Notifications