గెలుపు ముఖ్యం బిగులు: బ్లాక్ బస్టర్ మూవీ టైటిలే విజయ్ ఎన్నికల గుర్తు

త్వరలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తమిళనాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ అడుగుపెడుతున్నందున అందరి దృష్టి ఆయనపైనే ఉంది. విజయ్ రాకతో త్రిముఖ పోటీ నెలకొంది. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డీఎంకే.. ఈ పార్టీని గద్దె దింపడానికి ఏఐఏడీఎంకే ఇప్పటికే హోరాహోరి పోరు సాగిస్తోన్నాయి.

ఎన్నికల సన్నాహాలు ముమ్మరమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తమిళగ వెట్రి కజగం (TVK) అధ్యక్షుడు విజయ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సంబంధిత కార్యకలాపాలను సమన్వయం చేయడానికి, వీటిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఓ ఎన్నికల ప్రచార కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ పార్టీ సంస్థాగత బలాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Whistle Symbol Granted by EC to Vijay s TVK

మొత్తం 10 మందితో ఈ కమిటీ ఏర్పాటైంది. ఇందులో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్, ఎన్నికల ప్రచార నిర్వహణ విభాగం ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున, ఉన్నతస్థాయి పరిపాలనా కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ కేఎన్ సెంగోటయ్యన్, ఏ పార్థిబన్, బీ రాజ్‌కుమార్, కేవీ విజయ్ థాము, ఎస్పీ సెల్వం, కే పిచ్చైరతినం కరికలన్, ఎం సెరవు మొహిదీన్ అలియాస్ నియాస్, జే కేథరిన్ పాండియన్ సభ్యులుగా నియమితులయ్యారు.

ఈ పరిణామాల మధ్య కేంద్ర ఎన్నికల కమిషన్ గురువారం కీలక ప్రకటన చేసింది. విజయ్ పార్టీకి 'విజిల్‌' గుర్తును కేటాయించింది. గతంలో ఇదే టైటిల్ లో ఓ స్పోర్ట్స్ డ్రామా మూవీని తెరకెక్కించారు విజయ్. అది బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అదే మూవీ టైటిల్.. ఇప్పుడు విజయ్ స్థాపించిన టీవీకేకు దక్కింది. దీంతో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. విజిల్ తో సందడి చేయడం మొదలు పెట్టారప్పుడే.

లోకనాయకుడు కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం (ఎంఎన్‌ఎం)కు 'బ్యాటరీ టార్చ్' గుర్తును కేటాయించింది. 2018లో స్థాపించిన ఎంఎన్‌ఎం గతంలోనూ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసింది. 'బ్యాటరీ టార్చ్' గుర్తు గత ఎన్నికలలో కూడా వారికి కేటాయించింది ఈసీ. ఇది ఆ పార్టీకి సుపరిచితమైన గుర్తు. ఈ రెండు ప్రముఖ పార్టీల ఎన్నికల రంగ ప్రవేశం తమిళనాడులో తీవ్ర పోటీకి వేదికగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+