Taliban: తాలిబన్ అంటే అర్థం ఏమిటి ?, వీళ్లు చేస్తున్న పని ఏమిటి, వేల కోట్ల డాలర్ల ఖర్చు గోవిందా !

కాబూల్/ న్యూఢిల్లీ/చెన్నై: అఫ్గానిస్తాన్ లో తాలిబన్లు రాజ్యం ఏలడానికి సిద్దం అయ్యారు. అమెరికా, నాటో బలగాల ఉపసంహరణతో తాలిబన్లకు లడ్డూ లాంటి అవకాశం చిక్కడంతో వారు ఆ అవకాశం చేజారిపోకుండా చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. అఫ్గానిస్తాన్ స్వాధీనం చేసుకోవడానికి నెల రోజులు సమయం పడుతుందని అంచనా వేసిన అమెరికా లెక్కలు తారుమారైనాయి. ఇప్పటి వరకు అమెరికా, నాటో ఖర్చు చేసిన వేల కోట్ల డాలర్లు బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. అమెరికా అంచనాలు తల్లకిందులు చేసి వారంలో అఫ్గానిస్తాన్ దేశాన్ని పూర్తిగా కైవసం చేసుకున్న తాలిబన్లు ఇప్పుడు వారి రాజ్యం ఏలడానికి సర్వం సిద్దం చేసుకుంటున్నారు. అఫ్గానిస్తాన్ లో తాలిబన్లు ఆక్రమించని భూమి లేదంటే ఎవ్వరూ నమ్మడం లేదు. అసలు తాలిబన్లు అంటే ఎవరు ?, పష్రూ బాషలో తాలిబన్ అంటే విద్యార్థులు అని అర్థం. అలాంటి విద్యార్థులు ఈ రోజు అఫ్గానిస్తాన్ లో ఏం చేస్తున్నారు ? కరుడుకట్టిన ఉగ్రవాదులుగా ఎలా మారిపోయారు అని విషయం తెలుసుకోవాలి.

 1994లో కాందహార్ లో ఏం జరిగిందంటే ?

1994లో కాందహార్ లో ఏం జరిగిందంటే ?

పష్రూ బాషలో తాలిబన్ అంటే విద్యార్థులు అని అర్థం. అలాంటి విద్యార్థులు ఇప్పుడు ఈ రోజు అఫ్గానిస్తాన్ లో కరుడుకట్టిన ఉగ్రవాదులుగా మారిపోయారు. 1994లో అఫ్గానిస్తాన్ లోని కాందహార్ లో తాలిబన్ సంస్థ పురుడు పోసుకుంది. ముల్లా మోహమ్మద్ ఓమర్ తాలిబన్ సంస్థను ప్రారంభించాడు. తరువాత అఫ్గానిస్తాన్ లో ప్రభుత్వం కూలిపోయిన తరువాత తాలిబన్లు అఫ్గానిస్తాన్ లో అంతర్యుద్దం మొదలు పెట్టారు.

 రెండు ఏళ్లలో కింగ్ మేకర్లు

రెండు ఏళ్లలో కింగ్ మేకర్లు

తాలిబన్ సంస్థ అవతరించిన తరువాత వారి ప్రభాల్యం పెంచుకోవడానికి రాక్షసుల్లా మారిపోయారు. 1980లో అమెరికా మద్దతుతో సేవియట్ బలగాలను వెనక్కి నెట్టిన ముజాహిద్దీన్ లీడర్లు తరువాత తాలిబన్లతో చేతులు కలిపారు. రెండు సంవత్సరాల్లో తాలిబన్లు అఫ్గానిస్తాన్ లో పాగా వెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేశారు.

 ఆ రోజు ఏం జరిగిందంటే ?

ఆ రోజు ఏం జరిగిందంటే ?

1996లో అఫ్గానిస్తాన్ మీద పట్టుసాదిస్తూ వచ్చిన తాలిబన్లు ఇస్లామిక్ ఎమిరేట్స్ అని ఆదేశానికి పేరు మార్చుకుని పిలవడం మొదలు పెట్టారు. ఇస్లామిక్ చట్టాలు అంటూ తాలిబన్లు అఫ్గానిస్తాన్ ప్రజలకు నిద్రలేకుండా చేశారు. అఫ్గానిస్తాన్ లోని ప్రముఖ నగరాలు, కట్టడాలను తాలిబన్లు వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారు.

 అమెరికా దెబ్బతో తోక ముడిచిన తాలిబన్లు

అమెరికా దెబ్బతో తోక ముడిచిన తాలిబన్లు

2001 సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్ ను ఆల్ ఖైదా ఉగ్రవాదులు విమానాలతో పేల్చేశారు. ఆల్ ఖైదా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అమెరికా బలగాలు అఫ్గానిస్తాన్ లోని కాబూల్ లో వైమానిక దాడులు ముమ్మరం చేసింది. అమెరికా వైమానిక దాడుల దెబ్బతో రానురాను తాలిబన్లు తోకముడిచారు. అప్పటి నుంచి 20 సంవత్సరాల పాటు అఫ్గానిస్తాన్ లో అమెరికా బలగాలు మొహరించాయి.

 తాలిబన్లకు లడ్డూలా చాన్స్ చిక్కింది

తాలిబన్లకు లడ్డూలా చాన్స్ చిక్కింది

ఇటీవల అఫ్గానిస్తాన్ లో అమెరికా బలగాలు ఉపసంహరించడంతో ఆ అవకాశాన్ని తాలిబన్లు లడ్డూలా ఉపయోగించుకున్నారు. ఇంతకాలం అఫ్గానిస్తాన్ లో కొంత ప్రాంతాన్ని వారి ఆధీనంలో పెట్టుకున్న తాలిబన్లు రష్యా సహకారంతో రెచ్చిపోయారని ఆరోపణలు ఉన్నాయి. అఫ్గానిస్తాన్ దేశం మొత్తం తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు ఇప్పుడు రాక్షసరాజ్యం ఏర్పాటు చేసుకోవడానికి సర్వం సిద్దం చేసుకున్నారు.

 తాలిబన్ సిద్దాంతాలతో ప్రజలు హడల్

తాలిబన్ సిద్దాంతాలతో ప్రజలు హడల్

తాలిబన్ షారియా చట్టం ప్రకరారం కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు. మహిళలు ఒంటరిగా ఇంటి నుంచి బయటకు రాకూడదని, మహిళలు విధ్యాభ్యాసం చెయ్యకూడదని నియమాలు జారీ చేశారు. మహిళలు ఎవరైనా ఒంటరిగా బయటకు వస్తే వారిని బహిరంగంగా ప్రజల సమక్షంలో మరణ శిక్ష అమలు చెయ్యడం, కొరడాలు, రాళ్లతో కొట్టి చంపడం లాంటి కఠినమైన శిక్షలు అమలు చేసిన తాలిబన్లు కొన్ని దేశాల ప్రజల ముందు రాక్షసుల్లా అవతరించారు.

 ఇదే సంవత్సరం చెప్పారు.... ఇప్పుడు అదే జరిగింది

ఇదే సంవత్సరం చెప్పారు.... ఇప్పుడు అదే జరిగింది

అఫ్గానిస్తాన్ లో ఇస్లామిక్ ఎమిరేట్స్ పరిపాలన ప్రారంభం అవుతుందని ఇదే సంవత్సరంలో మొదట్లో తాలిబన్ లీడర్లు చెప్పారు. ఇప్పుడు ప్రస్తుం అఫ్గానిస్తాన్ ప్రజలకు ముందు అదే పరిస్థితి ఎదురైయ్యింది. అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల మద్దతు తాలిబన్లకు లేదు. అయితే పాకిస్తాన్, చైనా తోపాటు మూడు నాలుగు దేశాల మాత్రం తాలిబన్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద అఫ్గానిస్తాన్ లో రాక్షస పాలన మొదలు కావడంతో ఆదేశ ప్రజలు హడలిపోతున్నారు.

 ఏం చెయ్యాలో తెలీక లూటీలు..... డబ్బులు డ్రా

ఏం చెయ్యాలో తెలీక లూటీలు..... డబ్బులు డ్రా

కాబూల్ ను ఆదివారం తాలిబన్లు వారి ఆధీనంలోకి తీసుకున్నారు. అఫ్గానిస్తాన్ అధ్యక్ష భవనం కూడా తాలిబన్ల చేతికి వెళ్లిపోయింది. పేద ప్రజలు వారి ఇళ్లు ఖాళీ చేసి పార్క్ లు, మైదనాలలోకి పరుగు తీస్తున్నారు. ఇక ఇంతకాలం బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు డ్రా చేసుకోవడానికి సామాన్య ప్రజలు ఏటీఎం కేంద్రాల దగ్గరకు పరుగు తీస్తున్నారు. కొందరు అయితే చిక్కినకాడికి చిక్కనీ అంటూ లూటీలు చెయ్యడం మొదలు పెట్టారు. కాబూల్ తో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన చెందకుండా తాలిబన్లు రంగంలోకి దిగారు. అయితే కాబూల్ లో తాలిబన్లను అడ్డుకోవడానికి అఫ్గానిస్తాన్ సైనికులు ఏమాత్రం సాహసం చెయ్యకపోవడంతో తాలిబన్లకు మరో రకంగా కలిసి వచ్చింది. అఫ్గానిస్తాన్ లో ఉన్న విదేశీయులతో పాటు ఆదేశ ప్రజలు ఎప్పుడెప్పుడు దేశం విడిచి పారిపోదామా అంటూ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+