19 నుంచి సెకెండ్ లాక్‌డౌన్: 28 రోజుల పాటు.. ఆ వార్తలను నమ్మొద్దు: డబ్ల్యూహెచ్ఓ

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌కు సంబంధించిన ఓ షెడ్యూల్, ప్రొసీజర్.. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నెల 15వ తేదీన లాక్‌డౌన్‌ను ఎత్తేస్తారని, అనంతరం 19వ తేదీ నుంచి సెకెండ్ లాక్‌డౌన్ ఆరంభమౌతుందని, ఈ సారి ఏకంగా 28 రోజుల పాటు కొనసాగిస్తారని అనేది దాని సారంశం. ఈ షెడ్యూల్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్ ఈస్ట్ ఆసియా విభాగం అధికారులు క్లారిఫికేషన్ ఇచ్చారు.

Recommended Video

    WHO Praises PM Modi’s Initiatives During Lockdown

    ఈ వార్తలను నమ్మొద్దని స్పష్టం చేశారు. తాము ఎలాంటి షెడ్యూల్‌ను గానీ ప్రొసీజర్‌ను గానీ విడుదల చేయలేదని తెలిపారు. సాధారణంగా లాక్‌డౌన్ విధించిన సందర్భాలను అనుసరించడానికి ప్రత్యేకంగా ఓ ప్రొసీజర్‌ను రూపొందించుకున్నామని, ఆ ప్రొసీజర్ ఆధారంగా లాక్‌డౌన్ షెడ్యూల్‌ను రూపొందించి ఉంటారని పేర్కొంది. తాము అధికారింగా ఎలాంటి షెడ్యూల్ లేదా ప్రొసీజర్‌ను గానీ విడుదల చేయలేదని స్పష్టం చేసింది.

    WHO has not issued any protocols and procedures on lockdown in India

    సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోన్న ఆ షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 14వ తేదీన ఇప్పుడు అమల్లో ఉన్న లాక్‌డౌన్ సమయం ముగుస్తుంది. అయిదు రోజుల పాటు సడళింపు ఉంటుంది. మళ్లీ 19వ తేదీ నుంచి 28 రోజుల పాటు లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. ఈ 28 రోజుల లాక్‌డౌన్ తరువాత మరోసారి సడళింపు ఉంటుందని, అనంతరం 15 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటిస్తారనే వార్త ఒకటి విస్తృతంగా సర్కులేట్ అయిన విషయం తెలిసిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+