డేరాబాబా తర్వాత డేరా చీఫ్ ఈమే!: నిద్రలేని రాత్రి గడిపిన బాబా

డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్ సింగ్‌(డేరా బాబా)ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అత్యాచార కేసులో దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తీర్పు డేరాబాబాను జైలుకు తరలించారు పోలీసులు.

పంచకుల: డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్ సింగ్‌(డేరా బాబా)ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అత్యాచార కేసులో దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తీర్పు డేరాబాబాను జైలుకు తరలించారు పోలీసులు. దీంతో పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో భారీ ఎత్తున చోటుచేసుకున్న అల్లర్లలో 30 మందికి పైగా మృతి చెందారు.

డేరా చీఫ్ ఈమే..

డేరా చీఫ్ ఈమే..

అయితే గుర్మీత్‌ జైలుకు వెళ్లిన నేపథ్యంలో డేరా సచ్చా సౌధాకు కొత్త యజమాని ఎవరు అవుతారంటూ అందరిలో సందేహం నెలకొంది. అయితే, డేరా సౌధాకు యజమానిగా గుర్మీత్.. దత్త కుమార్తె హనీప్రీత్‌ ఇన్సాన్‌ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. దర్శకురాలు, ఎడిటర్‌, నటి అయిన హనీప్రీత్‌ సొంత ప్రాంతం హర్యానాలోని ఫతేపూర్‌. 1999లో హనీప్రీత్‌.. డేరా అనుచరుడు విశ్వాస్‌ గుప్తాను వివాహం చేసుకుంది. అయితే, తనని అత్తింటివారు హింసిస్తున్నారంటూ గుర్మీత్‌ సాయం కోరడంతో ఆయన హనీప్రీత్‌ను 2009లో కూతురిగా దత్తత తీసుకున్నారు.

పోటీలో మరొకరు కూడా..

పోటీలో మరొకరు కూడా..

అంతేగాక, తాను నటించే సినిమాల్లోనూ హనీకి అవకాశాలు ఇచ్చేవారు గుర్మీత్. ఇప్పుడు గుర్మీత్‌కి శిక్ష పడడంతో డేరాకు సంబంధించిన వ్యాపారాలన్నింటికీ హనీనే యజమానిగా వ్యవహరించే అవకాశమున్నట్లు డేరా ప్రతినిధులు చెబుతున్నారు. అయితే, గురు బ్రహ్మచారి విపాసన కూడా సౌధా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

డేరాబాబాకు నిద్రలేని రాత్రి..

డేరాబాబాకు నిద్రలేని రాత్రి..

డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ సింగ్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా తేల్చడంతో అతనిని రోహ్‌తక్‌ జిల్లా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే జైలులో గుర్మీత్‌కు అతిథి మర్యాదలు చేస్తున్నారని వచ్చిన వార్తలను అధికారులు ఖండించారు. సాధారణ ఖైదీల్లాగే గుర్మీత్‌ను చూశామని జైలు అధికారులు స్పష్టం చేశారు. కాగా, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. జైలులో బాబా మొదటి రోజు నిద్రలేకుండానే గడిపినట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం సునారియా జైలుకు తీసుకెళ్లి నిబంధనల ప్రకారం ఖైదీ వివరాలు నమోదు చేసి రాత్రి 8.30 గంటలకు జైలులో ఆయనకు కేటాయించిన ప్రత్యేక సెల్‌లో ప్రవేశపెట్టారు. గుర్మీత్‌ మొదటి రోజు రాత్రి ఒక చపాతి, గ్లాసు పాలు మాత్రమే తీసుకున్నారని తెలిసింది. ఆయనకు ఎంతసేపటికీ నిద్ర పట్టలేదని, ఒక గంటపాటు యోగా చేసి తెల్లవారుజామున 5 గంటలకు నిద్రపోయినట్లు సమాచారం.

భద్రత కట్టుదిట్టం

భద్రత కట్టుదిట్టం

అత్యాచార కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు సోమవారం శిక్ష ఖరారు చేయనున్న నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. రోహ్‌తక్‌లోకి డేరా అనుచరులు, మద్దతుదారులను అనుమతించేది లేదని అక్కడి పోలీసులు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. రోహ్‌తక్‌ చేరుకునేందుకు ఆయన మద్దతుదారులు ప్రయత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు.

10కి.మీల ప్రాంతం భద్రతా దళాలు ఆధీనంలో..

10కి.మీల ప్రాంతం భద్రతా దళాలు ఆధీనంలో..

బీఎస్‌ఎఫ్‌, హర్యానా పోలీసు సిబ్బంది గుర్మీత్‌ ఉంటున్న సునారియా జైలు పరిసర ప్రాంతాల్లో గస్తీ కాస్తున్నారు. దాదాపు 10కి.మీ మేర ప్రాంతాన్ని భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గుర్మీత్‌ను ఉంచిన జైలునే ప్రస్తుతం సీబీఐ న్యాయస్థానంగా మార్చనున్నారు. ఇందుకోసం జైలులో ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేస్తున్నారు. శిక్ష ఖరారు చేసేందుకు సీబీఐ న్యాయమూర్తిని రోహ్‌తక్‌కు ప్రత్యేక విమానంలో తరలించనున్నారు.

అల్లర్లను అణచేసేందుకు..

అల్లర్లను అణచేసేందుకు..

ఇది ఇలావుంటే.. మరోసారి అల్లర్లు చెలరేగే అవకాశం ఉండటంతో డేరా ఆశ్రమ ప్రధాన కార్యాలయం ఉన్న సిర్సాలో కర్ఫ్యూ విధించారు. డేరా ఆశ్రమంలో ఇప్పటికీ దాదాపు 30వేల మంది అనుచరులు, మద్దతుదారులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సోమవారం శిక్ష ఖరారు చేయనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రోహ్‌తక్‌లో మొత్తం 28 కంపెనీలకు చెందిన పారామిలటరీ బలగాల సిబ్బంది భద్రతా చర్యల్లో పాల్గొంటున్నారు. అత్యాచారం కేసులో డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ను దోషిగా తేలుస్తూ శుక్రవారం పంచకుల సీబీఐ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+