అల్లు అర్జున్ పుష్ప సినిమాను కర్ణాటకలో బాయ్‌కాట్ చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు?

పుష్ప

అల్లు అర్జున్ నటించిన 'పుష్ప: ది రైజ్' చిత్రం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా.. అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలు పోషించారు.

సినిమా విడుదల నేపథ్యంలో #PushpaTheRise హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

https://twitter.com/PushpaMovie/status/1471388806662156294

అల్లు అర్జున్ నటన, సుకుమార్ మార్క్ డైరెక్షన్ బాగుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

https://twitter.com/Deepi2Siva/status/1471685365320720386

ఎక్కడ కూడా తగ్గేదేలే అంటూ మరికొందరు ట్వీట్ చేశారు.

https://twitter.com/VJ_prabhas/status/1471685008284741633

అయితే, కర్ణాటకలో ఈ చిత్రాన్ని బాయ్‌కాట్‌ చేయాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.

#BoycottPushpaInKarnataka హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండ్ అయింది.

కర్ణాటకలో కన్నడ కంటే తెలుగు వర్షన్‌కే ఎక్కువ స్క్రీన్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"ఇది ఆంధ్రా కాదు. ఇది కర్ణాటక. కన్నడలో ఎక్కువ వర్షన్లు విడుదల చేయండి. లేదంటే బాయ్‌కాట్‌కు సిద్ధంకండి" అంటూ gowdaraitha యూజర్ ట్వీట్ చేశారు.

https://twitter.com/gowdaraitha/status/1471669324649689089

కర్ణాటకలో పుష్ప సినిమా విడుదల చేయాలనుకుంటే కన్నడలోనే రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

"తెలుగు ప్రజలారా.. పుప్ప సినిమాకు మేం వ్యతిరేకం కాదు. తెలుగు సినిమాలకూ వ్యతిరేకం కాదు. కానీ కర్ణాటకలో కన్నడ వర్షన్ మాత్రమే విడుదల చేయాలి. మాకు కన్నడ కంటే ఎవరూ గొప్ప కాదు" అని Nav_Mocktail యూజర్ ట్వీట్ చేశారు.

https://twitter.com/NMocktail/status/1471367127508475905

"కర్ణాటకలో తెలుగును బలవంతంగా రుద్దే హక్కు ఎవరికీ లేదు" అంటూ Dikshit46194286 అనే యూజర్ అభిప్రాయపడ్డారు.

https://twitter.com/Dikshit46194286/status/1471360691546116098

"కర్ణాటకలో కన్నడ భాషలో విడుదల చేసే ఉద్దేశం లేకపోతే వాళ్లు పుష్ప సినిమాను ఎందుకు డబ్బింగ్ చెప్పించారో నాకు అర్థం కావడం లేదు" అని దిలీప్ నాయక్ అనే వ్యక్తి కామెంట్ చేశారు.

https://twitter.com/dilipnaikr/status/1471354511918727173

అయితే, తాము తెలుగు సినిమాలకు, అల్లు అర్జున్‌కు వ్యతిరేకం కాదని పలువురు చెప్పారు.

"తెలుగు సినిమా ప్రేమికులకు, అల్లు అర్జున్ అభిమానులకు విజ్ఞప్తి. మేము సినిమాకు, హీరోకు వ్యతిరేకం కాదు. మేము డిస్ట్రిబ్యూటర్లను వ్యతిరేకిస్తున్నాం. నిజానికి మేము ఆ సినిమా చూడాలని అనుకుంటున్నాం. అది కూడా కన్నడలో మాత్రమే. అందుకే నిరసన తెలుపుతున్నాం" అని YashasVK యూజర్ అన్నారు.

https://twitter.com/YashasVK/status/1471377663914700805

కర్ణాటకలో పుష్ప సినిమాను కన్నడ వెర్షన్‌లో ఎక్కువగా విడుదల చేయాలని పలువురు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

https://twitter.com/KannadigaAnand/status/1471658602494513154

"పాన్ ఇండియా మూవీ అని చెప్పినప్పుడు కర్ణాటకలో మాత్రం కన్నడ డబ్బింగ్ వెర్షన్ ఎందుకు విడుదల చేయడం లేదు.. కన్నడ ప్రేక్షకులను ఎందుకు పట్టించుకోవడం లేదు" అని అమరేష్ అనే ట్విటర్ యూజర్ ప్రశ్నించారు.

https://twitter.com/Amaresh0777/status/1471364118087045121

https://twitter.com/JagadeeshTrolls/status/1471400137293398016

పుష్ప చిత్రాన్ని బాయ్‌కాట్ చేస్తే.. కన్నడ ఇండస్ట్రీని మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ బాయ్‌కాట్ చేస్తారంటూ జగదీశ్ ట్వీట్ చేశారు.

https://twitter.com/JagadeeshTrolls/status/1471400137293398016

అయితే, కన్నడ అభిమానుల డిమాండ్‌పై పుష్ప డిస్ట్రిబ్యూటర్లు, చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+