Wife: మూడు రోజుల ముందు పెళ్లి, భార్య మూడు నెలల గర్బవతి, క్వీన్ ను చంపేసిన భర్త, ఏం జరిగిందంటే !
చెన్నై/ మదురై: కాలేజ్ కు వెళ్లి వస్తున్న అమ్యాయి బాగా చదువుకుంటున్నదని ఆమె కుటుంబ సభ్యులు బావించారు. కాలేజ్ కు వెళ్లి వస్తున్న యువతిని పరిచయం చేసుకున్న యువకుడు ఆమెతో చనువుగా ఉన్నాడు. కొంత కాలం నుంచి యువకుడి ప్రేమలో పడిన కాలేజ్ అమ్మాయి అతనికి శారీరకంగా దగ్గర అయ్యింది. కొన్ని నెలల నుంచి ఇద్దరూ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. లాక్ డౌన్ దెబ్బతో కాలేజ్ అమ్మాయి ఇంటికే పరిమితం అయింది. కాలేజ్ అమ్మాయి ఇటీవల మూడు నెలల గర్బవతి అని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు.

కాలేజ్ అమ్మాయి
తమిళనాడులోని మదురై సమీపంలోని అవనియపురం సమీపంలోని చోళవంతన్ రాయపురంలో శ్యామ్ రాజ్, సెల్వమేరి దంపతులు నివాసం ఉంటున్నారు. శ్యామ్ రాజ్, సెల్వమేరి దంపతుల కుమార్తె గ్లాడిస్ క్వీన్ అలియాస్ రాణి (21) అవనియపురంలోని ఓ ప్రైవేట్ కాలేజ్ లో డిగ్రీ మూడవ సంవత్సరం విద్యాభ్యాసం చేస్తోంది.

ప్రేమలో పడిన కాలేజ్ అమ్మాయి
అవనియపురంలోని కాలేజ్ కు వెళ్లి వస్తున్న క్వీన్ బాగా చదువుకుంటున్నదని ఆమె కుటుంబ సభ్యులు బావించారు. మదురైకి చెందిన జ్యోతిమణి (23) అనే యువకుడితో క్వీన్ కు పరిచయం అయ్యింది. కాలేజ్ కు వెళ్లి వస్తున్న క్వీన్ తో పరిచయం చేసుకున్న జ్యోతిమణి ఆమెతో చనువుగా ఉండేవాడు. ఇలా ప్రతిరోజు క్వీన్, జ్యోతిమణి కలుసుకునే వాళ్లు.

హ్యాపీగా ప్రేమికులు ఎంజాయ్
కొంత కాలం నుంచి జ్యోతిమణితో ప్రేమలో పడిన కాలేజ్ అమ్మాయి క్వీన్ అతనికి శారీరకంగా దగ్గర అయ్యింది. కొన్ని నెలల నుంచి జ్యోతిమణి, క్వీన్ పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. కరోనా వైరస్, లాక్ డౌన్ దెబ్బతో కాలేజ్ మూసివేయడంతో క్వీన్ మూడు నెలలుగా ఇంటికే పరిమితం అయింది. క్వీన్ ఆమె ప్రియుడు జ్యోతిమణితో మాత్రం వీలు చిక్కిప్పుడు ఫోన్ లో మాట్లాడుతూనే ఉంది.

క్వీన్ దెబ్బతో ఫ్యామిలీ షాక్
ఇటీవల కూతురు క్వీన్ మూడు నెలల గర్బవతి అని తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు. క్వీన్ ను నిలదియ్యడంతో తన ప్రియుడు జ్యోతిమణి తనను తల్లినిచేశాడని కూతురు చెప్పింది. క్వీన్ కుటుంబ సభ్యులు ఆమె ప్రియుడి కోసం వెతికి వెతికి జ్యోతిమణిని పట్టుకుని వాళ్ల ఇంటికి పిలుచుకుని వెళ్లి నాలుగు తగిలించారు,

తండ్రి నేను కాదు మహాప్రభో
మీ అమ్మాయి క్వీన్ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నేను కాదని, ఆమెతో తాను శృంగారంలో పాల్గొనలేదని ప్రియుడు జ్యోతిమణి లబోదిబో అన్నాడు. అయినా అమ్మాయి కుటుంబ సభ్యులు జ్యోతిమణి మాటలు నమ్మలేదు. అమ్మాయి, అబ్బాయి ఇద్దరి మతాలు వేరు. అయినా క్వీన్ కుటుంబ సభ్యులు బలవంతంగా ప్రియుడు జ్యోతిమణితో ఆమె పెళ్లి జరిపించేశారు. ఇక ముందు క్వీన్ ను బాగా చూసుకోవాలని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు జ్యోతిమణికి వార్నింగ్ ఇచ్చారు.

మూడు రోజులకే చంపేసిన భర్త
మా తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుని రెండు మూడు రోజుల్లో మళ్లీ ఇంటికి తిరిగి వస్తామని జ్యోతిమణి అతని భార్య క్వీన్ కుటుంబ సభ్యులను నమ్మించాడు. పెళ్లైన మూడు రోజులకే మూడు నెలల గర్బవతి భార్య క్వీన్ ను ఆమె ఇంటి నుంచి బయటకు పిలుచుకుని వెళ్లిన భర్త జ్యోతిమణి నేరుగా అవనియపురం జాతీయ రహదారి సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి వెళ్లాడు.

భార్యను చంపేసి శవం కాల్చేసిన భర్త
నువ్వు ఎవ్వరితోనో అక్రమ సంబంధం పెట్టుకుని కడుపు చేయించుకుని ఆ బిడ్డకు తనను తండ్రి చేస్తావా అంటూ జ్యోతిమణి మూడు రోజుల క్రితం పెళ్లి చేసుకున్న భార్య క్వీన్ తో గొడవపడ్డాడు. ఆ సమయంలో ఇద్దరి మద్య మాటామాటా పెరిగిపోయింది. తరువాత కత్తి తీసుకుని మూడు నెలల గర్బవతి అయిన భార్య క్వీన్ ను పొడిచి చంపేసి ఆమె శవం మీద పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త జ్యోతిమణి అక్కడి నుంచి నేరుగా భార్య ఇంటికి వెళ్లాడు.

బెండ్ తీస్తే మ్యాటర్ బయటకు వచ్చింది
క్వీన్ ఇంటికి వెళ్లిన జ్యోతిమణి నా భార్య నిన్న ఇక్కడి వచ్చేసిందని, ఎక్కడ ఉందని ఆమె కుటుంబ సభ్యులను ప్రశ్నించాడు. క్వీన్ కుటుంబ సభ్యులకు జ్యోతిమణి మీద అనుమానం వచ్చి అతన్ని పట్టుకుని చితకబాదేసి అవనియపురం పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో తానే క్వీన్ ను హత్య చేశానని జ్యోతిమణి అంగీకరించాడు.

సార్ ఇది జరిగింది
కాలేజ్ లో చదువుతున్న క్వీన్ కు తాను దగ్గర అయ్యానని, అయితే ఆమె కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నేను కాదని, తనతో బలవంతంగా పెళ్లి చేశారని, అందుకే చంపేశానని జ్యోతిమణి పోలీసులకు చెప్పాడు. క్వీన్ ను హత్య చేసిన ప్రదేశాన్ని జ్యోతిమణి పోలీసులకు చూపించాడు. క్వీన్ శవాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్వీన్ ను జ్యోతిమణి ఒక్కడే హత్య చేశాడా ? లేక ఎవరైనా అతనికి సహాయం చేశారా అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు. పెళ్లైన మూడు రోజులకే మూడు నెలల గర్బవతి అయిన భార్య క్వీన్ ను ఆమె భర్త జ్యోతిమణి హత్య చెయ్యడం మదురైలో కలకలం రేపింది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications