Wife: నైట్ డ్యూటీ నుంచి వెళ్లిన భర్త, భార్యను మంచం మీద చంపేసి పక్కనే నిద్రపోయాడు, తమ్ముడికి!
లూధియానా/పంజాబ్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతుల కుమారుడు పెళ్లి వయసుకు వచ్చాడు. మంచి పెళ్లి సంబంధం కుదిరితే కొడుక్కి పెళ్లి చెయ్యాలని తండ్రి అనుకుంటున్నాడు. ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న భర్త పగటి పూట, నైట్ డ్యూటీలు చేస్తున్నాడు. కొడుకు కూడా వేరే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లిన భర్త అతని భార్యతో గొడవ పెట్టుకున్నాడు. ఆ సమయంలో దంపతుల మద్య మాటామాటా పెరిగిపోయింది.
ఆ టైమ్ లో సహనం కోల్పోయిన భర్త మంచం మీద ఉన్న భార్యను పట్టుకుని చితకబాదేశాడు. అంతటితో శాంతించని భర్త భార్య గొంతు కోసేశాడు. భార్య మంచం మీదపడి ఉంటే ఆమె పక్కనే భర్త నిద్రపోయాడు. నిద్రలేచిన భర్త అతని భార్య చనిపోయిందని తెలుసుకుని షాక్ అయ్యాడు. సోదరుడికి ఫోన్ చేసిన భర్త మీ వదినను చంపేశాను, ఏం చెయ్యమంటావు ? అని అడిగాడు.

దంపతుల హ్యాపీలైఫ్
పంజాబ్ లోని లూధియానాలోని ఫోకల్ పాయింట్ V ఫేజ్ లో సూరజ్ బహదూర్ చెత్రీ అలియాస్ సూరజ్ బహదూర్ (50), బిష్ణు ప్రియా బహదూర్ అలియాస్ బిష్ణు (42) దంపతులు నివాసం ఉంటున్నారు. సూరజ్ పని చేస్తున్న ఫ్యాక్టరీలోని సర్వెంట్ క్వాటర్స్ లో వీరు నివాసం ఉంటున్నారు.
23 సంవత్సరాల క్రితం సూరజ్ బహదూర్, బిష్ణుల వివాహం జరిగింది. వివాహం జరిగినప్పటి నుంచి సూరజ్ బహదూర్, బిష్ణు దంపతులు చాలా సంతోషంగా ఉన్నారని సమాచారం.

కొడుకు పెళ్లి చెయ్యాలని ఆలోచిస్తున్నాడు
సూరజ్ బహదూర్, బిష్ణు దంపతులకు 21 ఏళ్ల వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు. సూరజ్ బహదూర్ లూధియానాలోని ఓ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. సూరజ్ బహదూర్, బిష్ణు దంపతుల కుమారుడు పెళ్లి వయసుకు వచ్చాడు. మంచి పెళ్లి సంబంధం కుదిరితే కొడుక్కి పెళ్లి చెయ్యాలని సూరజ్ బహదూర్ అనుకుంటున్నాడు.

నైట్ డ్యూటీలు చేస్తున్న భర్త
ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్న సూరజ్ బహదూర్ పగటి పూట, నైట్ డ్యూటీలు చేస్తున్నాడు. సూరజ్ బహదూర్ కొడుకు కూడా వేరే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మద్య కాలంలో సూరజ్ బహదూర్ ఎక్కువగా నైట్ డ్యూటీలు చేస్తున్నాడు. రాత్రి 8 గంటలకు డ్యూటీకి వెలుతున్న సూరజ్ బహదూర్ మరుసటి రోజు ఉదయం 9 గంటలకు ఇంటికి చేరుకుంటున్నాడు.

భార్యను మంచం మీద చంపేసిన భర్త
నైట్ డ్యూటీ ముగించుకుని ఉదయం 9 గంటటలకు ఇంటికి వెళ్లిన సూరజ్ బహదూర్ అతని భార్య బిష్ణుతో గొడవ పెట్టుకున్నాడు. తరువాత ఏం జరిగిందో అనే విషయం మాత్రం బయటకు రాలేదని తెలిసింది. ఆ సమయంలో సూరజ్ బహదూర్, బిష్ణు దంపతుల మద్య మాటామాటా పెరిగిపోయింది. ఆ టైమ్ లో సహనం కోల్పోయిన సూరజ్ బహదూర్ మంచం మీద ఉన్న అతని భార్య బిష్ణును పట్టుకుని చితకబాదేశాడు. అంతటితో శాంతించని సూరజ్ బహదూర్ అతని భార్య బిష్ణును గొంతు కోసి చంపేశాడు.

భార్య శవం పక్కనే నిద్రపోయిన భర్త
భార్య బిష్ణు మంచం మీద పడిపోవడంతో సూరజ్ బహదూర్ ఆమె శవం పక్కనే నిద్రపోయాడు. నైట్ డ్యూటీ ఉండటంతో రాత్రి 7 గంటల సమయంలో సూరజ్ బహదూర్ నిద్రలేచాడు. తరువాత భార్య బిష్ణును నిద్రలేవాలని సూరజ్ బహదూర్ ఆమెను లేపాడు. అయితే భార్య బిష్ణు ప్రాణాలు పోయాయని మాత్రం సూరజ్ బహదూర్ గుర్తించలేకపోయాడు.

తమ్ముడికి ఫోన్ చేసి ఏం చెయ్యాలని అడిగాడు
భార్య బిష్ణు చనిపోయిందని తెలుసుకున్న సూరజ్ బహదూర్ హడలిపోయాడు. సూరజ్ బహదూర్ అతని సోదరుడు క్రిష్ణ బహదూర్ కు ఫోన్ చేసి మీ వదినను చంపేశాను, ఏం చెయ్యమంటావు ? అని అడిగాడు. తన సోదరుడు వదినను హత్య చేశాడని తెలుసుకున్న క్రిష్ణ బహదూర్ హడలిపోయాడు. క్రిష్ణ బహదూర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

పారిపోకుండా భార్య శవం పక్కనే కుర్చున్న భర్త
లూధియానా పోలీసుల వెళ్లి చూడగా భార్యను చంపేసిన సూరజ్ బహదూర్ పారిపోవడానికి ప్రయత్నించకుండా అతని భార్య బిష్ణు శవం పక్కనే కుర్చుని ఉన్నాడని సీనియర్ పోలీసు అధికారి రాజేష్ కుమార్ మీడియాకు చెప్పారు. చిన్న విషయంలో సూరజ్ బహదూర్ అతని భార్య బిష్ణను హత్య చేశాడని, భార్యను హత్య చెయ్యాలని సూరజ్ బహదూర్ అనుకోలేదని విచారణలో అతని చెప్పాడని, కేసు విచారణలో ఉందని సీనియర్ పోలీసు అధికారి రాజేష్ కుమార్ స్థానిక మీడియాకు చెప్పారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications