Wife: భార్య పాములాగా మారుతోందని అనుమానం, మంత్రగత్తె అని ఆవేశంతో చంపేసిన భర్త, మామ!
వడోదరా/ అహమ్మదాబాద్: వివాహం చేసుకున్న మహిళ భర్తతో జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉండాలని అత్తారింటిలో అడుగు పెట్టింది. వివాహం అయిన తరువాత భర్త ఆమెతో చక్కగానే కాపురం చేశాడు. దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. కోడలు ఇంట్లో అడుగుపెట్టిన తరువాత ఆ ఇంట్లో సమస్యలు తలెత్తాయి. తమ కోడలు మంత్రగత్తె అని, ఆమె ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి సమస్యలు మొదలైనాయని అత్తారింటి వాళ్లు అనుమానం పెంచుకున్నారు. ఇదే సమయంలో భర్త అన్నను పాము కాటు వేయడంతో అతను చనిపోయాడు.
తన భార్య పాములాగా మారిపోయి తన అన్నను చంపేసిందని భర్త, అతని తండ్రి ఇంకా అనుమానం పెంచుకున్నాడు. తన భార్య పాము కావడం వలనే విపరీతంగా పాలు తాగుతోందని అనుమానం వచ్చింది. అంతే భార్యను గుట్టుచప్పుడు కాకుండా చంపేసిన భర్త, అతని తండ్రి ఆమె శవాన్ని తీసుకెళ్లి కొండ మీద నుంచి కిందకు విసిరేశారు. తన భార్య కొండ మీద నుంచి జారి కిందపడిపోయిందని అందరిని నమ్మించడానికి ప్రయత్నించారు. బాధితురాలి సోదరుడి ఎంట్రీతో కథ రసవత్తరంగా మారింది.

9 ఏళ్ల క్రి తం పెళ్లి
గుజరాత్ లోి ఛోటా ఉదేపూర్ సమీపంలోని కవంత్ ప్రాంతంలో దేశింగ్ భిల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 9 సంవత్సరాల క్రితం దేశింగ్ భిల్ ఇంట్లో సెట్ చేసిన మస్లీ భిల్ (32) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న మస్లీ భిల్ తన భర్త దేశింగ్ భిల్ తో జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉండాలని అత్తారింటిలో అడుగు పెట్టింది. వివాహం అయిన తరువాత మస్లీ భిల్ తో ఆమె భర్త దేశింగ్ భిల్ చక్కగానే, సంతోషంగానే కాపురం చేశాడు.

కోడలు మంత్రగత్తె అని అనుమానం
దేశింగ్ భిల్, మస్లీ భిల్ దంపతులకు 7 సంవత్సరాల వయసు ఉన్న ఓ కొడుకు ఉన్నాడు. కోడలు మస్లీ భిల్ ఇంట్లో అడుగుపెట్టిన తరువాత ఇంట్లో సమస్యలు తలెత్తాయని ఆమె భర్త దేశింగ్ భిల్ కుటుంబ సభ్యులు అనుమానం పెంచుకున్నారు.. తమ కోడలు మస్లీ భిల్ మంత్రగత్తె అతని, ఆమె ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి సమస్యలు మొదలైనాయని అత్తారింటి వాళ్లు రానురాను అనుమానం పెంచుకున్నారు.

పాముకాటుకు బావ బలి
దేశింగ్ భిల్ కు అన్న ఉన్నాడు. నాలుగు సంవత్సరాల క్రితం పొలం దగ్గర నుంచి వస్తున్న సమయంలో దేశింగ్ భిల్ అన్నను పాము కాటు వేయడంతో అతను చనిపోయాడు. తన భార్య మస్లీ భిల్ పాములాగా మారిపోయి తన అన్నను చంపేసిందని ఆమె భర్త దేశింగ్ భిల్, అతని తండ్రి ఇంకా అనుమానం పెంచుకున్నారు. తన భార్య మస్లీ భిల్ పాము కావడం వలనే ఆమె విపరీతంగా పాలు తాగుతోందని భర్త దేశింగ్ భిల్ కు అనుమానం ఎక్కువ అయ్యింది.

పండుగ ముందు రోజు స్కెచ్
తన భార్య మస్లీ భిల్ ను చంపకుంటే మన ఇంట్లో అందరూ చనిపోతారని దేశింగ్ భిల్ కుటుంబ సభ్యులు చర్చించుకున్నారు. ఎలాగైనా మస్లీ భిల్ ను చంపేయాలని అనుకున్నారు దీపావళి పండుగకు ఒక రోజు ముందు (ఈనెల 3వ తేదీ) ఇంట్లో పని చేసుకుంటున్న మస్లీ భిల్ ను ఆమె భర్త దేశింగ్ భిల్, అతని తండ్రి పట్టుకున్నారు. ఆ రోజే మస్లీ భిల్ ను చంపేస్తే పీడపోతుందని అనుకున్నారు.

చంపేసి కొండ మీద నుంచి శవం విసిరేశారు
అదే రోజు భార్య మస్లీ భిల్ ను గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే చంపేసిన ఆమె భర్త దేశింగ్ భిల్, అతని తండ్రి ఆమె శవాన్ని తీసుకెళ్లి ఊరి సమీపంలోని కొండ మీద నుంచి కిందకు విసిరేశారు. తన భార్య మస్లీ భిల్ కొండ మీద నుంచి జారి కిందపడిపోయి చనిపోయిందని దేశింగ్ భిల్ ఊరిలోని వాళ్లను, బంధువులు అందరిని నమ్మించడానికి ప్రయత్నించారు.

కొడుకు కోసం వెళ్లి చావు కొనితెచ్చుకుంది
మస్లీ భిల్ సోదరుడు ఎంట్రీతో కథ రసవత్తరంగా మారింది. నాలుగు నెలల క్రితం తన మా సోదరి మస్లీ భిల్ పుట్టింటకి వచ్చేసి తాను ఇక అత్తారింటిలో అడుగుపెట్టనని చెప్పిందని, తాను మంత్రగత్తె అని అనుమానం పెంచుకుని ప్రతిరోజు తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆమె చెప్పిందని మస్లీ భిల్ సోదరుడు పోలీసులకు చెప్పారు. అయితే కొడుకు అత్తారింటిలోనే ఉండిపోవడంతో మస్లీ భిల్ మళ్లీ అక్కడికే వెళ్లి చావు కొని తెచ్చుకుందని వాపోయాడు.
Recommended Video

నేరం అంగీకరించిన భర్త
మస్లీ భిల్ సోదరుడు కేసు పెట్టడంతో ఆమె భర్త దేశింగ్ భిల్, అతని తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. మస్లీ భిల్ ను తామే హత్య చేశామని దేశింగ్ భిల్, అతని తండ్రి అంగీకరించారని, ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు పంపించామని కవంత్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ డిహోరా స్థానిక మీడియాకు చెప్పారు. మొత్తం మీద భార్య మంత్రగత్తె అని అనుమానం పెంచుకుని తండ్రితో కలిసి ఆమెను చంపేసిన భర్త ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు.












Click it and Unblock the Notifications