Wife: కారు డ్రైవర్ తో భార్యను చంపించిన అసిస్టెంట్ ప్రొఫెసర్, మధ్యలో అల్లుడు, పక్కాప్లాన్ రివర్స్ !
న్యూఢిల్లీ: ప్రముఖ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి మంచి జీతం తీసుకుంటున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తే సంతోషంగా ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. పెద్దలు, బంధువుల సమక్షంలో ఇరుకుటుంబ సభ్యులు గ్రాండ్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ పెళ్లి జరిపించారు. వివాహం చేసుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ అతని సొంత ఇంటిలో కాపురం పెట్టాడు. ఇటీవల ఇంట్లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ భార్య దారుణ హత్యకు గురైయ్యింది. హత్య చేసిన నిందితులు ఆమె చనిపోయిందా ? లేదా ? అని చెక్ చేసుకోవడానికి కరెంట్ షాక్ కూడా ఇచ్చారు. మహిళను హత్య చేసిన హంతుకుడు పోలీసులకు చిక్కాడు. పోలీసుల విచారణలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అతని మేనల్లుడు కూడా అరెస్టు కావడం కలకలం రేపింది.

ఢిల్లీ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్
ఢిల్లీ యూనివర్శిటీలో వీరేందర్ కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రముఖ ఢిల్లీ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్న వీరేందర్ కుమార్ కు మంచి జీతం తీసుకుంటున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్న వీరేందర్ కుమార్ కు మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తే సంతోషంగా ఉంటుందని పింకీ (32) అనే యువతి కుటుంబ సభ్యులు అనుకున్నారు.

గ్రాండ్ గా పెళ్లి జరిగింది
పెద్దలు, బంధువుల సమక్షంలో ఇరుకుటుంబ సభ్యులు అసిస్టెంట్ ప్రొఫెసర్ వీరేందర్ కుమార్, పింకీల వివాహం గ్రాండ్ గా జరిపించారు. వివాహం చేసుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ వీరేందర్ కుమార్ ఢిల్లీలోని బురారీలోని వెస్ట్ సంత్ నగర్ లోని అతని సొంత ఇంటిలో కాపురం పెట్టాడు. వివాహం చేసుకున్న తరువాత వీరేందర్ కుమార్ అతని భార్య పింకీతో సంతోషంగా జీవించడం మొదలు పెట్టాడు.

మేడ మీద ఇల్లు ఖాళీ చేయించిన భార్య
వీరేందర్ కుమార్ ఇంటి మేడ మీద రాకేష్ అనే వ్యక్తి ఉంటున్నాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ వీరేందర్ కుమార్ దగ్గర రాకేష్ కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. వీరేందర్ కుమార్ కారు ఒకటి తీసిచ్చి అతన్ని ట్యాక్సీగా తిప్పుకోమని చెప్పాడు. ఈ విషయం జీర్ణించుకోలేని వీరేందర్ కుమార్ భార్య పింకీ మేడ మీద ఉంటున్న రాకేష్ ను ఇల్లు ఖాళీ చేయించింది. వీరేందర్ కుమార్ నివాసం ఉంటున్న ఏరియాలోనే రాకేష్ అద్దె ఇంటిని తీసుకుని అక్కడే అతని భార్యతో కలిసి ఉంటున్నాడు.

ఇంట్లో భార్య దారుణ హత్య
గత సోమవారం మద్యాహ్నం వీరేందర్ కుమార్ అతని తల్లిని పిలుచుకుని ఆసుపత్రికి వెళ్లాడు. ఆ సమయంలో వీరేందర్ కుమార్ భార్య పింకీ మాత్రమే ఇంట్లో ఉంది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ వీరేందర్ కుమార్ భార్య పింకీ దారుణ హత్యకు గురైయ్యింది. హత్య చేసిన నిందితులు పింకీ చనిపోయిందా ? లేదా ? అని చెక్ చేసుకోవడానికి కరెంట్ షాక్ కూడా ఇవ్వడం కలకలం రేపింది.

పింకీని హత్య చేసిన కారు డ్రైవర్ అరెస్టు
ఇంటికి వెళ్లిన వీరేందర్ కుమార్ తన భార్య పింకీని ఎవరో హత్య చేశారని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. పోలీసులు మొదట వీరేందర్ కుమార్ దగ్గర పని చేసిన రాకేష్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో రాకేష్ చెప్పిన వివరాలు తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.
Recommended Video

భర్త, మేనల్లుడు పక్కాప్లాన్ రివర్స్
తన మాజీ యజమాని వీరేందర్ కుమార్ భార్య పింకీని తానే హత్య చేశానని రాకేష్ అంగీకరించాడు. అయితే పింకీని హత్య చెయ్యమని చెప్పింది తన మాజీ యజమాని, ఆమె భర్త వీరేందర్ కుమార్, అతని మేనల్లుడు గోవిందా అని రాకేష్ పోలీసులకు చెప్పాడు. రాకేష్ ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం సాయంత్రం పింకీ హత్య కేసులో ఆమె భర్త, అసిస్టెంట్ ప్రొఫెసర్ వీరేందర్ కుమార్, అతని మేనల్లుడు గోవిందాను అరెస్టు చేశామని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. తాను ఆసుపత్రికి వెలుతున్నానని, ఆ సమయంలో తన భార్య పింకీని చంపేయాలని వీరేందర్ కుమార్ తనకు చెప్పాడని రాకేష్ పోలీసులకు చెప్పాడు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications