Wife: భార్య అక్రమ సంబంధం, కొడవలితో గొంతు చీల్చేశాడు, భార్య బతికిపోయింది, కొడుకు ప్రాణం, ఎస్కేప్ !
బెంగళూరు/బెళగావి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. ఇటీవల భార్య తీరుపై భర్తకు అనుమానం మొదలైయ్యింది. భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేస్తోందని భర్తకు అనుమానం మొదలైయ్యింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. తన భార్య చెప్పిన మాట వినదని, ఆమె అక్రమ సంబంధం విషయం అందరికి తెలిసిపోతే పరువు పోతుందని భర్త అనుకున్నాడు. భార్య అక్రమ సంబంధం విషయంలో రగిలిపోయిన భర్త కత్తి తీసుకుని భార్యను, కన్న కొడుకు గొంతు చీల్చేశాడు. కత్తితో గొంతు చీల్చడంతో కొడుకు ప్రాణాలు పోయాయి.

దంపతుల హ్యాపీలైఫ్
కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని గోకాక్ తాలుకాలోని శిల్తిబావి ప్రాంతంలో ముత్తప్ప అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 7 సంవత్సరాల క్రితం ముత్తప్ప కుటుంబ సభ్యులు చూపించిన లక్ష్మీ (27) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న లక్ష్మీ, ముత్తప్ప దంపతులు నాలుగు సంవత్సరాల పాటు చాలా సంతోషంగా కాపురం చేశారు.

భార్య మీద అనుమానం
ముత్తప్ప, లక్ష్మీ దంపతులకు బాళేష్ (4) అనే కుమారుడు ఉన్నాడు. ఇటీవల భార్య లక్ష్మీ తీరుపై ఆమె భర్త ముత్తప్పకు అనుమానం మొదలైయ్యింది. భార్య లక్ష్మీ మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేస్తోందని ముత్తప్పకు అనుమానం మొదలైయ్యింది. లక్ష్మీ మీద ఆమె భర్త ముత్తప్ప నిఘా వేశాడు.

ఇంటిలో ఎక్కువగా ఉంటున్న భార్య
ముత్తప్ప వ్యవసాయం చేస్తున్నాడు. ఎక్కువగా చెరకు పంట వేస్తున్న ముత్తప్ప అతని భార్య లక్ష్మీతో కలిసి పొలం చెరుకు తోట దగ్గరకు వెళ్లేవాడు .ఇటీవల లక్ష్మీ ఎక్కువగా ఇంటి దగ్గర ఉండటంతో ఆమె భర్త ముత్తప్పకు ఇంకా అనుమానం ఎక్కువ అయ్యింది. ఇదే విషయంలో ముత్తప్ప, లక్ష్మీ దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి.

భార్య, కొడుకు గొంతు చీల్చేశాడు
తన భార్య లక్ష్మీ చెప్పిన మాట వినదని, ఆమె అక్రమ సంబంధం విషయం అందరికి తెలిసిపోతే పరువు పోతుందని ముత్తప్ప అనుకున్నాడు. భార్య లక్ష్మీ, కొడుకు బాళేష్ తో కలిసి చెరుకు తోట దగ్గరకు బయలుదేరాడు. ఆ సందర్బంలో లక్ష్మీ, ముత్తప్పల మద్య వాగ్వివాదం జరిగింది. ఆ సందర్బంలో లక్ష్మీ అక్రమ సంబంధం విషయంలో రగిలిపోయిన ముత్తప్ప చెరుకు కత్తిరించే కొడవలి తీసుకుని భార్య లక్ష్మీ గొంతు, కన్న కొడుకు బాళేష్ గొంతు చీల్చేశాడు.

భార్య బతికిపోయింది
కొడవలితో గొంతు చీల్చడంతో కొడుకు బాళేష్ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తీవ్రగాయాలైన లక్ష్మీ ఐసీయూలో చికిత్స పొందుతున్నదని, ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు అన్నారు. భార్య అక్రమ సంబంధంలో కొడుకును చంపేసి ముత్తప్ప తప్పించుకుని పరారైనాడని పోలీసులు తెలిపారు. .












Click it and Unblock the Notifications