Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: ఉద్యోగం చేసే కంపెనీలో భార్యకు బాయ్ ఫ్రెండ్, సుకుమార్ హత్యకు సూపర్ స్కెచ్, భర్త ఫ్రెండ్ కు ?

భార్యకు అక్రమ సంబంధం ఉంది. భర్తను చంపేయాలని అనుకున్న భార్య సిరంజిలో విషం, యాసిడ్ కలిపి ఎక్కించి దానిని లిక్కర్ బాటిల్ లో కలిపి భర్తకు ఇచ్చింది. భర్త ఆ బాటిల్ తీసుకెళ్లి అతని ఫ్రెండ్ తో కలిసి షేర్ చేసుకుని తాగేశారు.

చెన్నై/ చెంగల్పట్టు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. భర్త ఓ షాపులో పని చేస్తున్నాడు. భార్య ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ప్రతిరోజు ఉదయం ఉద్యోగానికి వెలుతున్న భార్య సాయంత్రం లేటుగా ఇంటికి వస్తోంది. ఎందుకు లేట్ అవుతోంది అని భర్త ప్రశ్నిస్తే కంపెనీలో పని ఎక్కువగా ఉందని భార్య చెబుతూ వచ్చింది. తరువాత భార్య పని చేస్తున్న కంపెనీలోనే ఆమెకు ప్రియుడు ఉన్నాడని భర్తకు తెలిసిపోయింది. భర్తకు తన అక్రమ సంబంధం మ్యాటర్ తెలిసిపోయిందని, అతన్ని చంపేస్తే పీడపోతుందని భార్య అనుకుంది. సిరంజిలో విషం, యాసిడ్ ఎక్కించి వాటిని క్వాటర్ బాటిల్ లో కలిపి ఆ బాటిల్ భర్తకు ఇచ్చింది. భర్త ఆ బాటిల్ తీసుకెళ్లి అతని స్నేహితుడితో కలిసి షేర్ చేసుకుని తాగేశారు. భార్య చేసిన పనికి ఆమె భర్తతో పాటు అతని స్నేహితుడు ?. భార్య సిరంజితో ఎంత పని చేసింది అని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

దంపతులు హ్యాపీ

దంపతులు హ్యాపీ

తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని మధురాంతగాం సమీపంలోని నటరాజ్ పురంలో సుకుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు కొన్ని సంవత్సరాల క్రితం కవిత అనే యువతిని సుకుమార్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న సుకుమార్, కవిత దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. సుకుమార్ ఓ ఫేమస్ చికెన్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్నాడు.

కంపెనీలో భార్యకు ప్రియుడు

కంపెనీలో భార్యకు ప్రియుడు

కవిత ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. పని చేస్తున్న కంపెనీలోనే ఓ ప్రియుడిని సెట్ చేసుకున్న కవతి అతనితో ఎంజాయ్ చేస్తోంది. చికెన్ సెంటర్ లో పని చేస్తున్న సుకుమార్ ప్రతిరోజు మద్యం సేవించి ఇంటికి వెలుతున్నాడు. మద్యం మత్తులో భర్త ఉంటే అతని భార్య కవిత మాత్రం కంపెనీలో పని పూర్తి అయిన తరువాత ఆమె ప్రియుడితో రహస్య ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేసి తరువాత ఇంటికి వెలుతోంది.

ప్రియుడితో జల్సాలు చేస్తున్న భార్య

ప్రియుడితో జల్సాలు చేస్తున్న భార్య

చాలా కాలం నుంచి కవిత ఆమె ప్రియుడు పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతిరోజు సాయంత్రం కనీసం రెండు గంటలు కవిత ఆమె ప్రియుడితో రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టింది. ప్రతిరోజు ఉదయం ఉద్యోగానికి వెలుతున్న కవిత సాయంత్రం లేటుగా ఇంటికి వస్తోంది. ఎందుకు లేట్ అవుతోంది అని భర్త సుకుమార్ ప్రశ్నిస్తే కంపెనీలో పని ఎక్కువగా ఉందని, అందుకే లేటు అవుతోందని కవిత భర్తకు మాయమాటలు చెబుతూ వచ్చింది.

భార్య అక్రమ సంబంధం మ్యాటర్ ?

భార్య అక్రమ సంబంధం మ్యాటర్ ?

తన భార్య కవిత పని చేస్తున్న కంపెనీలోనే ఆమెకు ప్రియుడు ఉన్నాడని సుకుమార్ కు తెలిసిపోయింది. మద్యం సేవించడం అలవాటు ఉన్న సుకుమార్ రోజు మద్యం సేవించి ఇంటికి వెళ్లి అతని భార్య కవితను బెండ్ తియ్యడం మొదలుపెట్టాడు. భర్త సుకుమార్ కొట్టే దెబ్బలు తట్టుకోలేక కొంతకాలం నుంచి కవిత కంపెనీలో పని పూర్తి అయిన తరువాత నేరుగా ఇంటికి రావడం మొదలుపెట్టింది. ప్రియుడి మోజులో పడిన కవితకు ఏం చెయ్యాలో అర్థం కాకుండా పోయింది. తన భర్త సుకుమార్ కు తన అక్రమ సంబంధం మ్యాటర్ తెలిసిపోయిందని, భర్తను చంపేస్తే పీడపోతుందని, తరువాత ప్రియుడితో హ్యాపీగా ఉండటానికి అవకాశం ఉంటుందని కవిత అనుకుంది.

మరిదిని పిలిపించి ?

మరిదిని పిలిపించి ?

కవిత ఆమె భర్త సుకుమార్ తమ్ముడు మణిని కలిసి అతనికి రూ. 400 డబ్బులు ఇచ్చి రెండు క్వాటర్ బాటిల్స్ తీసుకురావాలని చెప్పింది. మణి రెండు క్వాటర్ బాటిల్స్ తీసుకెళ్లి అతని వదిన కవితకు ఇచ్చాడు. అయితే కవిత ఒక్క బాటిల్ మాత్రం తీసుకుని మరో బాటిల్ మణికి ఇచ్చి నువ్వే తాగాలని చెప్పింది. క్వాటర్ బాలిల్ తీసుకున్న కవిత ఇంజక్షన్ వేసే సిరంజి తీసుకుని అందులోకి విషం, యాసిడ్ ఎక్కించింది. సిరంజిలో ఉన్న యాసిడ్, విషంను క్వాటర్ బాటిల్ లోకి తెలివిగా ఎక్కించింది.

అప్పటికే ఫుల్ టైట్ గా ఇంటికి వెళ్లిన భర్త

అప్పటికే ఫుల్ టైట్ గా ఇంటికి వెళ్లిన భర్త

రాత్రి ఇంటికి వెళ్లిన సుకుమార్ కు అతని భార్య క్వాటర్ బాటిల్ ఇచ్చింది. ఎవరో మీ స్నేహితుడు వచ్చి ఈ బాటిల్ ఇచ్చాడని కవిత చెప్పింది. అప్పటికే ఫుల్ గా మద్యం సేవించి వెళ్లిన సుకుమార్ ఇప్పుడు మద్యం సేవించడానికి తనకు ఓపికలేదని, రేపు తాగుతానని కవితకు చెప్పి నిద్రపోయాడు. మరుసటి రోజు క్వాటర్ బాటిల్ జోబులో పెట్టుకున్న సుకుమార్ మద్యాహ్నం భోజనం ముందు తాగుదామని చికెన్ సెంటర్ కు వెళ్లిపోయాడు. చికెన్ సెంటర్ లో సుకుమార్ తో పాటు చాలా సంవత్సరాల నుంచి బీహార్ కు చెందిన హరిలాల్ పని చేస్తున్నాడు. హరిలాల్, సుకుమార్ చాలా సంవత్సరాల నుంచి స్నేహితులు.

భర్త స్నేహితుడికి షాక్

భర్త స్నేహితుడికి షాక్

మద్యాహ్నం భోజనం చేసే ముందు క్వాటర్ బాటిల్ ఓపెన్ చేసిన సుకుమార్ గ్లాస్ లోకి కొంచెం పోసుకున్నాడు. ఆ సమయంలో తనకు కొంచెం మద్యం ఇవ్వాలని హరిలాల్ అడిగాడు. క్వారట్ లో మూడు మూడు ఔన్స్ లు షేర్ చేసుకున్న హరిలాల్, సుకుమార్ మద్యం సేవించి భోజనం చేశారు. సాయంత్రం హరిలాల్ అస్వస్థతకు గురి కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. సుకుమార్ ఇంటికి వెళ్లి కుప్పకూలిపోవడంతో అతన్ని తమ్ముడు మణి ఆసుపత్రికి తరలించారు. మద్యంలో విషం కలిపారని వైద్యులు చెప్పారు. పోలీసులు రంగంలోకి దిగి లిక్కర్ బాటిల్ ఎక్కడ తీసుకున్నావని సుకుమార్ ను ప్రశ్నించారు. తన భార్య కవిత బాటిల్ ఇచ్చిందని సుకుమార్ చెప్పాడు.

మేడమ్ స్కెచ్ తో మైండ్ బ్లాక్

మేడమ్ స్కెచ్ తో మైండ్ బ్లాక్

పోలీసులు కవితను బెండ్ తీశారు. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చెయ్యాలని అనుకున్నానని, అయితే ఇలా జరుగుతుందని తాను ఊహించలేదని కవిత పోలీసులకు చెప్పింది. భర్త సుకుమార్, హరిలాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని, కవితను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు అన్నారు. అక్రమ సంబంధం విషయంలో కవిత ఆమె భర్త హత్యకు లిక్కర్, విషం, యాసిడ్, సిరంజితో వేసిన స్కెచ్ గురించి తెలుసుకున్న పోలీసులు హడలిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+