Wife: లేడీ డాక్టర్ ఆత్మహత్య కేసు, భర్త నిందితుడు, నాలుగు నెలల్లో కోర్టు సంచలన తీర్పు, శిక్ష ఖరారు !
కొచ్చి/కేరళ: కేరళతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఆయుర్వేద డాక్టర్ విస్మయ ఆత్మహత్య కేసులో ఆమె భర్త మాజీ ఆర్ టీఓ అధికారి ప్రధాన నిందితుడు, దోషి అని వెలుగు చూసింది. ప్రభుత్వ అధికారిగా ఉన్నతస్థాయి ఉద్యోగం చేస్తున్న భర్త అతని భార్య డాక్టర్ అనే విషయం కూడా మరిచిపోయి ఆమెకు నరకం చూపించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని వెలుగు చూసింది.

భార్య ఆత్మహత్యకు కారణం అయిన భర్త
భార్య విస్మయాకు నరకం చూపించి ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయిన సస్పెండ్ కు గురైన మాజీ ఆర్ టీఓ అధికారి ఎస్. కిరణ్ కుమార్ దోషి అని సోమవారం కోర్టు తీర్పు చెప్పింది. ఆర్ టీఓ అధికారిగా ఉద్యోగం చేస్తున్న కిరణ్ కుమార్ అతని అధికారం అడ్డం పెట్టుకుని భార్య ఆత్మహత్య కేసు నుంచి తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినా చివరికి అతని జైల్లో చిప్పకూడా గ్యారెంటీ అని వెలుగు చూసింది.

కుటుంబ సభ్యుల ఆలోచన వేరు
కేరళకు చెందిన విస్మయా ఆయుర్వేద డాక్టర్ గా పని చేస్తోంది. కోల్లాంకు చెందిన కిరణ్ కుమార్ అసిస్టెంట్ ఆర్ టీఓ అధికారిగా ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కిరణ్ కుమార్ కు మా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం సుఖంగా ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు.

మొగుడి టార్చర్ తట్టుకోలేక భార్య ?
పెద్దలు కిరణ్ కుమార్, డాక్టర్ విస్మయాల వివాహం జరిపించారు. పెళ్లి చేసుకున్న కొంతకాలం భార్య విస్మయాతో సంతోషంగా ఉన్నట్లు నటించిన కిరణ్ కుమార్ ఆమెను కట్నం తీసుకురావాలని టార్చర్ పెట్టి ఆమెకు నరకం చూపించారు. భర్త కిరణ్ కుమార్ పెట్టే టార్చర్ తట్టుకోలేక విస్మయా ఆమె భర్త ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

డాక్టర్ ఆత్మహత్యకు ఆమె భర్త కారణం
విస్మయా ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడు అయిన కిరణ్ కుమార్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. కిరణ్ కుమార్ నేరం చేశాడని రుజుకు అయ్యిందని మే 23వ తేదీ సోమవారం కోల్లం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సుజిత్ కేఎస్ అన్నారు. నిందితుడు కిరణ్ కుమార్ కు మంగళవారం శిక్ష ప్రకటిస్తామని కోర్టు తెలిపింది. మొత్తం మీద భార్య విస్మయా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయిన ఆర్ టీఓ అధికారి కిరణ్ కుమార్ తరువాత కేసు నుంచి తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications