Machete murders: అత్తకు నో బెయిల్, కోడలి అక్రమ సంబంధంతో అరాచకం, కళ్ల ముందే నరికేస్తుంటే !
గురుగ్రామ్: కోడలి అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న ఆమె మామ, మాజీ ఆర్మీ ఉద్యోగి రిగిలిపోయాడు. ఎంత చెప్పినా కోడలు ఆమె పద్దతి మార్చుకోలేదని మామ రగిలిపోయాడు. మాజీ ఆర్మీ ఉద్యోగి అయిన మామ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. తమ కుటుంబం పరువు పోతుందని కోపంతో కోడలితోపాటు మరో ముగ్గురిని దారుణంగా నరికి చంపేశాడ. నాలుగు హత్యల కేసులో అరెస్టు అయిన మామ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ ఉద్యోగి భార్య కూడా ఇదే నాలుగు హత్యల కేసులో మహిళా ఖైదీలు ఉండే జైల్లో విచారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తోంది. తన భర్త అంత్యక్రియలు హిందూ సాంప్రధాయం ప్రకారం నిర్వహించడానికి పెరోల్ ఇవ్వాలని భార్య వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. భర్త అంత్యక్రియలకు హాజరుకావడానికి బెయిల్ రాకపోవడంతో ఆమె కుమిలిపోతున్నదని సమాచారం.

కోడలు అక్రమ సంబంధం
గురుగ్రామ్ సమీపంలోని రాజేంద్ర నగర్ లో రావురాయ్ సింగ్ నివాసం ఉంటున్నాడు. రావురాయ్ సింగ్ మాజీ ఆర్మీ ఉద్యోగి. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రావురాయ్ సింగ్ ఆ ప్రాంతంలో మంచిపేరు పెట్టుకున్నాడు. రావురాయ్ సింగ్ కుమారుడు ఆనంద్ భార్య సునీత వారి అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న క్రిషన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆరోపణలు ఉన్నాయి.

మస్త్ మజా చేసిన కోడలు
భర్త ఆనంద్, మామ రావురాయ్ సింగ్ బయటకు వెళ్లిన తరువాత అద్దె ఇంటిలో ఉంటున్న క్రిషన్ ఇంటికి వెలుతున్న సునీత అతనితో మస్త్ మజా చేస్తోందని ఆమె కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. కోడల సునీత అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న ఆమె మామ రావురాయ్ సింగ్ రిగిలిపోయాడు. బుద్దిమార్చుకోవాలని కోడలు సునీతకు ఆమె మామ రావురాయ్ సింగ్ చాలాసార్లు చెప్పాడని తెలిసింది. ఎంత చెప్పినా సునీత ఆమె పద్దతి మార్చుకోలేదని రావురాయ్ సింగ్ రగిలిపోయాడు.

అందర్ని ఒకేసారి చంపేసిన ఇంటి పెద్ద
తన కోడలు సునీత అక్రమ సంబంధం వదులుకోవడానికి సిద్దంగా లేదని తెలుసుకున్న ఆమె మామ రావుసింగ్ రిగిలిపోయాడు. బుద్దిమార్చుకోవాలని చెప్పినా నా మాట వినడం లేదని ఆగస్టు 24వ తేదీన సునీత, అద్దె ఇంటిలో నివాసం ఉంటున్న క్రిషన్, అనామిక తివారీ, క్రిషన్, అనామిక తివారీ తోమ్మిది సంవత్సరాల కుమార్తెను దారుణంగా చంపేసిన రావురాయ్ సింగ్ తరువాత పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ కేసులో తివారీ మరో కూతురు ప్రత్యక్ష సాక్షిగా ఉంది.

జైల్లో ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ మాజీ ఉద్యోగి
రావుసింగ్ రాయ్ భోండి జైల్లో ఉంటున్నాడు. రావుసింగ్ రాయ్ భార్య బిమ్లేష్ కూడా జైల్లో ఉంది. రావురాయ్ సింగ్ భార్య బిమ్లేష్ బట్టలకు కూడా రక్తపు మరకలు ఉండటంతో ఆమె కూడా భర్త నలుగురిని హత్య చెయ్యడానికి సహకరించి ఉంటుందని పోలీసులు అంటున్నారు. జైలు జీవితం గడుపుతున్న రావురాయ్ సింగ్ హిందీలు పద్యాలు రాసుకోవడానికి పేపర్ ప్యాడ్, పెన్నులు ఇచ్చారు. మంగళవారం జైల్లోని బాత్ రూమ్ లు, బ్యారక్ ల మద్యో బెడ్ షీట్ తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు అన్నారు.

బెయిల్ కోసం అర్జీ పెట్టుకున్న భార్య
గురుగ్రామ్ లోని మహిళా జైల్లో బీమ్లేష్ విచారణ ఖైదీగా ఉంటున్నది, రావురాయ్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన అంత్యక్రియలు చెయ్యడానికి ఆయన భార్య బిమ్లేష్ కు పెరోల్ మంజూరు చెయ్యాలని ఆమె తరపు న్యాయవాది ప్రశాంత్ యాదవ్ కోర్టుకు మనవి చేశారు. రావురాయ్ సింగ్ కుటుంబ ఆచారాల ప్రకారం బిమ్లేష్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి అవకాశం ఇవ్వాలని ఆమె న్యాయవాది ప్రశాంత్ యాదవ్ కోర్టులో మనవి చేశారు.

భార్యకు మొత్తం తెలుసు.... బెయిల్ ఇవ్వకూడదు
నాలుగు హత్యలు చెయ్యడానికి భర్త రావురాయ్ సింగ్ కు అతని భార్య బిమ్లేష్ కూడా అన్ని రకాలుగా సహకరించిందని, నలుగురు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అవకాశం ఉన్నా ఆమె అలాంటి ప్రయత్నాలు చెయ్యలేదని, కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నిర్లక్షం చెయ్యడంతో నలుగురి ప్రాణాలు పోయాయని బాధితుల కుటుంబ సభ్యుల న్యాయవాది రావత్ కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు.

వెళ్లి వచ్చి వారంకాక ముందే ?
వాదనలు విన్న న్యాయమూర్తి రావురాయ్ సింగ్ భార్య బిమ్లేష్ కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. ఆక్టోబర్ 2వ తేదీన రావురాయ్ సింగ్, ఆయన భార్య బిమ్లేష్ ను వారి కుటుంబ సభ్యులు వేర్వేరుగా జైల్లో కలుసుకున్నారు. కుటుంబ సభ్యులు కలుసుకుని వారం రోజులు కూడా కాకముందే రావురాయ్ సింగ్ అదే జైల్లో డెత్ నోట్ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications