
Wife: హ్యాపీలైఫ్ లో భర్త శాడిజం, భార్యను పుట్టింటికి తరిమేశాడు, వాట్సాప్ లో ఏం పంపించాడంటే, దెబ్బకు !
పూణే/ముంబాయి: రెండు కుటుంబాలు పెళ్లి సంబంధం సెట్ చేశాయి. వివాహం చేసుకుంటున్న తమ కూతురు అత్తారింటిలో సంతోషంగా ఉంటుందని అమ్మాయి కుటుంబ సభ్యులు అనుకున్నారు. వివాహం చేసుకున్న తరువాత భర్త అతని భార్యతో మొదట సంతోషంగా సంసారం చెయ్యడంతో ఓ బిడ్డ పుట్టింది. రానురాను భర్తతో పాటు ఆమె అత్తమామలు ఆమెకు సినిమా చూపించారు. అత్తమామలు ఏదైనా తప్పు చేస్తే భర్తకు చెప్పి సమస్యను పరిష్కరించుకోవడానికి కూడా ఆమెకు అవకాశం లేకుండా పోయింది. పెద్దలు పంచాయితీలు చేసినా భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు ఏమాత్రం మారలేదు. భర్త అతని భార్య, బిడ్డను ఆమె పుట్టింటికి తరిమేశాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న భర్త ఓ రోజు అతని భార్య మొబైల్ నెంబర్ కు వాట్సాప్ లో మెసేజ్ పంపించాడు. వాట్సాప్ లో మెసేజ్ చూసిన భార్య హడలిపోయింది. చివరికి తన భర్త వాట్సాప్ లో ఏమి పంపించాడో అనే విషయంపై అతని భార్య పోలీసు కేసు పెట్టడంతో భర్త ఇప్పుడు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.
Illegal
affair:
ఒకే
ఆంటీతో
ఫ్రెండ్స్
వన్స్
మోర్,
బర్త్
డే
పార్టీలో
నేరుజారి
?,
కట్
చేసి
రోడ్డు
మీద
!

నాలుగు సంవత్సరాల క్రితం !
పూణే సిటీలో షేక్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. పూణేలోనే రిజయా బేగం (పేరు మార్చడం జరిగింది) అనే యువతి నివాసం ఉంటున్నది. షేక్, రజియా బేగం కుటుంబాలు పెళ్లి సంబంధం సెట్ చేశాయి. షేక్ ను వివాహం చేసుకుంటున్న తమ కూతురు రజియా బేగం అత్తారింటిలో సంతోషంగా ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు.

ఫస్ట్ గుడ్ బాయ్ గా ఉన్న కిలాడీ మొగుడు
రిజయా బేగంను వివాహం చేసుకున్న తరువాత ఆమె భర్త షేక్ మొదట సంతోషంగా సంసారం చెయ్యడంతో ఓ బిడ్డ పుట్టింది. బిడ్డ పుట్టిన తరువాత షేక్ లో మార్పులు వచ్చాయి. కొంతకాలం తరువాత షేక్ అతని భార్య రజియా బేగం మీద ప్రతాపం చూపించడం మొదలు పెట్టాడు. రానురాను భర్త షేక్ తో పాటు అత్తమామలు రజియా బేగంకు సినిమా చూపించారని సమచారం.

ఫ్లాట్, ఖరీదైన వస్తువులు కట్నంగా కావాలని డిమాండ్
పూణేలో ఖరీదైన అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ తీసుకోవడానికి మీ ఇంటి నుంచి డబ్బులు తీసుకురావాలని షేక్ అతని భార్య రజియా బేగంకు చెప్పాడు. దానితో పాటు కొత్త ఫ్రిజ్, ఏసీ మిషన్లు, కారు, బైక్ కావాలని, మీ పుట్టింటికి వెళ్లి అవన్ని తీసుకురావాలని అత్తమామలు రజియా బేగంకు చెప్పడంతో ఆమె షాక్ అయ్యింది.

భార్యకు చాన్స్ లేకుండా పోయింది
ఇప్పటికే కట్నం కింద మా పుట్టింటి వాళ్లు చాలా ఇచ్చారని, ఇప్పుడు ఇవ్వడానికి వారి దగ్గర ఏమాత్రం డబ్బులు లేదని రజియా బేగం ఆమె భర్త షేక్ కు నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. భార్య రజియా బేగం చెబుతున్న మాటలను షేక్ ఏమాత్రం పట్టించుకోలేదు. అత్తమామలు ఏదైనా తప్పు చేస్తే భర్త షేక్ కు చెప్పి సమస్యను పరిష్కరించుకోవడానికి కూడా ఆమెకు అవకాశం లేకుండా పోయింది. పెద్దలు పంచాయితీలు చేసినా షేక్ తో పాటు అతని కుటుంబ సభ్యులు ఏమాత్రం మారలేదని తెలిసింది.

భార్యను పుట్టింటికి తరిమేశాడు
పుట్టింటికి వెళ్లి మేము చెప్పినవన్నీ తీసుకురావాలని షేక్ అతని భార్య రజియా బేగం, బిడ్డను గత మార్చి నెలలో ఆమె పుట్టింటికి పంపించేశాడు. అప్పటి నుంచి రజియా బేగం ఆమె బిడ్డతో కలిసి పుట్టింటిలోనే ఉంటున్నది. తన భర్త షేక్ మారుతాడని, మమ్మల్ని ఇంటికి పిలుస్తాడని అతని భార్య రజియా బేగం ఇంతకాలం ఆశగా ఎదురు చూసింది.

వాట్సాప్ మెసేజ్ తో భార్య మైండ్ బ్లాక్
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న షేక్ ఇటీవల అతని భార్య రజియా బేగం మొబైల్ నెంబర్ కు వాట్సాప్ లో మెసేజ్ పంపించాడు. వాట్సాప్ లో మెసేజ్ చూసిన భార్య హడలిపోయింది. రజియా బేగం వాట్సాప్ నెంబర్ కు తలాక్... తలాక్.... తలాక్ అని పంపించిన షేక్ ఇక ముందు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని మెసేజ్ చెయ్యడంతో ఆమె మైండ్ బ్లాక్ అయ్యింది.
Recommended Video

కేసు పెట్టిన భార్య..... జెండా ఎత్తేసిన భర్త
ఇంతకాలం తన భర్త షేక్ తో పాటు తన అత్తమామలు తనకు చిత్రహింసలకు గురి చేసినా తట్టుకుని అక్కడే ఉంటూ కాపురం చేశానని, తన మీత భౌతికదాడులు జరిగినా ఓర్పుగా ఉన్నానని, ఇప్పుడు వాట్సాప్ లో తలాక్ చెప్పి తనకు విడాకులు ఇచ్చాడని రజియా బేగం ఆమె భర్త షేక్ మీద పూణే మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. బాధితురాలు కేసు పెట్టిన తరువాత ఆమె భర్త షేక్ పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని కేసు విచారణ చేస్తున్న పోలీసు ఇన్స్ పెక్టర్ హెచ్ బీ ఖోస్తే స్థానిక మీడియాకు చెప్పారు. భారత చట్టం ప్రకారం త్రిపుల్ తలాక్ చెప్పడం నేరమని, ఆ సెక్షల కింద షేక్ మీద కేసు నమోదు చేశామని పోలీసు ఇన్స్ పెక్టర్ హెచ్ బీ ఖోస్తే అంటున్నారు. వివాహం జరిపించిన సమయంలో అల్లుడు షేక్ కు కట్నం కింద ఏమేమి వస్తువులు తీసిచ్చాము, అందుకు సాక్షులు ఎవరెవరు ఉన్నారు అనే పూర్తి సాక్షాలను బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ముందు పెట్టారు. ఇంత చేసినా మా అమ్మాయికి షేక్ తో పాటు అతని కుటుంబ సభ్యులు టార్చర్ పెట్టారని, ఇప్పుడు వాట్సాప్ లో త్రిపుల్ తలాక్ చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారని బాధితురాలు వాపోతున్నారు.