Wife: మొదటి భర్త వదిలేశాడు, రెండో భర్త హ్యాండ్ ఇచ్చాడు, ఎందుకు వదిలేశారంటే ? !

బెంగళూరు: వివాహం చేసుకున్న యువతి ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. పెళ్లి చేసుకున్న భర్తతో కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య తేడా వచ్చింది. భర్తకు దూరం అయిన మహిళ ఉద్యోగం చేస్తూ పిల్లలను పోషిచింది. టిక్ టాక్ పిచ్చి ఎక్కువగా ఉన్న మహిళకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి టిక్ టాక్ వీడియోలు చేశారు. టిక్ టాక్ వీడియోలతో పరిచయం అయిన యువకుడితో ప్రేమలో పడినన మహిళ అతన్ని ప్రేమించింది. సంవత్సరం క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఏడాదిపాటు భార్యతో కాపురం చేసిన భర్త తరువాత ఆమెను టార్చర్ పెట్టాడు. తరువాత భార్యకు హ్యాండ్ ఇచ్చిన భర్త అతని మొబైల్ ఫోన్ నెంబర్ మార్చేసి ఎస్కేప్ అయ్యాడు. మొదటి భర్త వదిలేయడం, రెండో భర్త హ్యాండ్ ఇచ్చి పారిపోవడంతో ఇప్పుడు ఆమె తనకు న్యాయం చెయ్యాలని పోలీసులను ఆశ్రయించింది.

 భర్తను వదిలేసిన భార్య

భర్తను వదిలేసిన భార్య

బెంగళూరులోని కేఆర్ పురం సమీపంలో రేష్మా అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరుకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న రేష్మా అతనితో కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేసింది. పెళ్లి చేసుకున్న భర్తతో కాపురం చేసిన రేష్మా ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత రేష్మా దంపతుల మద్య తేడా వచ్చింది. నాలుగు సంవత్సరాల క్రితం రేష్మా ఆమె భర్తకు విడాకులు ఇచ్చేసింది.

 టిక్ టాక్ ప్రియుడు

టిక్ టాక్ ప్రియుడు

రేష్మాకు టిక్ టాక్ వీడియోలు చేసే పిచ్చి ఉంది. టిక్ టాక్ వీడియోలు చేస్తున్న రేష్మాకు ముండేగోడ తాలుకాలోని నందికట్టా గ్రామంలో నివాసం ఉంటూ టిక్ టాక్ వీడియోలు చేస్తున్న రమేష్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. రేష్మా, రమేష్ కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తూ దగ్గర అయ్యారు. భర్తకు దూరం అయిన రేష్మా బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఆమె పిల్లలను పోషిచింది

 టిక్ టాక్ ప్రియుడితో రెండో పెళ్లి

టిక్ టాక్ ప్రియుడితో రెండో పెళ్లి

టిక్ టాక్ వీడియోలతో పరిచయం అయిన రమేష్ ప్రేమలో పడిన రేష్మా అతన్ని ప్రేమించింది. తనకు ఇంతకు ముందే పెళ్లి జరిగిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని రేష్మా ఆమె ప్రియుడు రమేష్ కు చెప్పింది. నీకు పిల్లలు ఉన్నా సరే నేను పెళ్లి చసుకుంటానని రమేష్ అతని ప్రియురాలు రేష్మాకు చెప్పాడు.

 టార్చర్ పెట్టిన రెండో భర్త

టార్చర్ పెట్టిన రెండో భర్త

గత ఏడాది గుడిలో రేష్మాను పెళ్లి చేసుకున్న రమేష్ ఆమెకు సింధూ అని పేరు పెట్టాడు. అప్పటి నుంచి రమేష్, రేష్మా దంపతులు ముండగోడ ప్రాంతంలోని అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. మొదట భార్య రేష్మాతో సంతోషంగా కాపురం చేసిన రమేష్ తరువాత రానురాను అతని భార్య రేష్మా అలియాస్ సింధూతో గొడవలు పడటం మొదలుపెట్టాడు.

 మాయం అయిపోయిన రెండో మొగుడు

మాయం అయిపోయిన రెండో మొగుడు

రానురాను రమేష్, రేష్మా దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ఇటీవల భార్య రేష్మాకు హ్యాండ్ ఇచ్చిన ఆమె రెండో భర్త రమేష్ అతను నివాసం ఉంటున్న ముండగొడలోని అతని నుంచి పారిపోయాడు. రమేష్ అతని మొబైల్ ఫోన్ నెంబర్ మార్చేసి ఎస్కేప్ అయ్యాడు. మొదటి భర్త వదిలేయడం, రెండో భర్త రమేష్ హ్యాండ్ ఇచ్చి పారిపోవడంతో రేష్మా ఇప్పుడు బెంగళూరు చేరుకుని ఇక్కడి కేఆర్ పురం పోలీస్ స్టేషన్ లో అతని మీద కేసు పెట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+