Wife: వైఫ్ ఫర్ సేల్, వదిన స్కెచ్, పక్కాగా పాటించిన మరిది, పక్కింటోడి భార్యను కొనుక్కుని ఫ్రెండ్స్!
జైపూర్/రాజస్థాన్: యువకుడికి పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. అనుకున్నట్లే ఆ యువకుడి పెళ్లి జరిగిపోయింది. అయితే పెళ్లి కూతురు మైనర్. పెళ్లి చేసుకున్న భార్యతో కాపురం చెయ్యడం భర్తకు ఇష్టం లేదు. కొంతకాలం భర్త అతని మైనర్ భార్యతో కళ్లు మూసుకుని కాపురం చేశాడు. ఇదే సమయంలో వదిన లైన్ లోకి వచ్చి మరిదికి బ్రైన్ వాష్ చేసింది. అందంగా ఉన్న భార్యను కొనుక్కోవడానికి మరో వ్యక్తి సిద్దం అయ్యాడు. వదినతో కలిసి పెళ్లి చేసుకున్న మైనర్ భార్యను ఆమె భర్త వేరే వ్యక్తికి అమ్మేశాడు. అంతకు ముందే అద్దె ఇల్లు సెట్ చేసిన వదిన ఆమె మరిది భార్యను అక్కడికి పిలుచుకుని వెళ్లింది. వదినతో కలిసి మైనర్ భార్యను అమ్మేసిన భర్త డబ్బులు తీసుకుని వదినతో పాటు వెళ్లిపోయి చేతులు దులుపుకున్నాడు.
విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి తన కుమార్తెను కిడ్నాప్ చేశారని కేసు పెట్టాడు. అప్పటికే పక్కింటోడి భార్యను కొనుకున్న ఆ వ్యక్తితో పాటు అతని స్నేహితులు ఆమె మీద అత్యాచారం చేసి నిర్బంధించారని వెలుగు చూడటం కలకలం రేపింది. భార్యను అమ్మేసిన భర్త, ఆమె భర్తతో పాటు మరో వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. వేరే వ్యక్తి భార్యను కొనుకున్న కామాంధుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. భార్యను అమ్మేయడానికి భర్త ఎక్కడి నుంచి స్కెచ్ వేశాడు అని విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

పెళ్లి చేస్తే బాగుపడుతాడని అనుకున్నారు
రాజస్థాన్ లోని బుంది జిల్లాలోని హిందోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ్ గఢ్ ప్రాంతంలో రాకేష్ మీనా అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రాకేష్ మీనాకు పెళ్లి చెయ్యాలని, పెళ్లి జరిగితేనే జులాయిగా తిరుగుతున్న రాకేష్ మీనా దారిలోకి వస్తాడని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. అనుకున్నట్లే రాకేష్ మీనాకు ఓ అమ్మాయితో పెళ్లి జరిగిపోయింది. అయితే పెళ్లి కూతురు మైనర్.

కళ్లు మూసుకుని కాపురం చేసిన భర్త
పెళ్లి చేసుకున్న భార్యతో కాపురం చెయ్యడం ఆమెభర్త రాకేష్ మీనాకు ఏమాత్రం ఇష్టం లేదు. కొంతకాలం రాకేష్ మీనా అతని మైనర్ భార్యతో కళ్లు మూసుకుని కాపురం చేశాడు. ఇదే సమయంలో రాకేష్ మీనా వదిన ప్రియా లైన్ లోకి వచ్చింది. ప్రియా ఆమె మరిది రాకేష్ మీనాకు బ్రైన్ వాష్ చేసింది. నువ్వు నీ భార్యతో ఎందుకు కాపురం చేస్తావు. దాని పీడ వదిలించుకో అంటూ ప్రియా ఆమె మరిది రాకేష్ మీనాకు చెప్పింది.

నా భార్యను అమ్మేస్తాను.... ఎవరికి కావాలి?
అందంగా ఉన్న తన భార్యను అమ్మేస్తానని రాకేష్ మీనా అతని స్నేహితులకు చెప్పాడు. రాకేష్ మీనా భార్య అందంగా ఉండటంతో ఆమెను కొనుక్కోవడానికి విజయ్ గఢ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓం ప్రకాష్ అనే యువకుడు సిద్దం అయ్యాడు. రాకేష్ మీనా, అతని అన్న మహేంద్ర, వదిన ప్రియా కలిసి రాకేష్ మీనాను కొనుక్కోవడానికి సిద్దం అయిన ఓంప్రకాష్ తో డీల్ మాట్లాడుకుని డబ్బులు తీసుకున్నారు.

టైలర్ దగ్గరికి పిలుచుకుని వెళ్లి అమ్మేశారు
విజయగఢ్ ప్రాంతంలో ఉన్న లేడీస్ టైలర్ దగ్గరకు పిలుచుకుని వెళ్లాలని మైనర్ భార్య ఆమె భర్త రాకేష్ మీనాకు చెప్పింది. రాకేష్ మీనా అతని భార్యను పిలుచుకుని టైలర్ దగ్గరకు వెళ్లారు. అక్కడ రాకేష్ మీనా అతని అన్న మహేంద్ర, వదిన ప్రియాతో కలిసి మైనర్ భార్య మీద దాడి చేశారు. ఇదే సమయంలో అక్కడికి వెళ్లిన ఓంప్రకాష్ కిరాతకుడు రాకేష్ మీనా అతని భార్యను అమ్మేశాడు.

అద్దె ఇంటిలో గ్యాంగ్ రేప్
అప్పటికే రాకేష్ మీనా అన్న మహేంద్ర, వదిన ప్రియా కలిసి డియో ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకోవడంతో అక్కడికి రాకేష్ మీనా భార్యను పిలుచుకుని వెళ్లారు. అక్కడ రాకేష్ మీనా భార్యను వదిలేశారు. రాకేష్ మీనా భార్యను కొనుక్కున్న ఓంప్రకాష్, అతని స్నేహితుడు నంద తదితరులు కలిసి ఆమె మీద అత్యాచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి.

కిడ్నాప్ కేసు పెట్టిన తండ్రి
మైనర్ భార్యను అమ్మేసిన రాకేష్ మీనా ఏమీ పట్టనట్లు తిరగడం మొదలుపెట్టాడు. రాకేష్ మీనాకు కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసుకుని తండ్రి తన కుమారుతు కనపడటం లేదని నవంబర్ 3వ తేదీన హిందోలి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగే విషయాలు వెలుగు చూశాయి.

రూమ్ లో నిర్బంధించి అత్యాచారం
అప్పటికే పక్కింటోడు రాకేష్ మీనా భార్యను కొనుకున్న ఓంప్రకాష్ తో పాటు అతని స్నేహితులు ఆమె మీద అత్యాచారం చేసి నిర్బంధించారని పోలీసుల విచారణలో వెలుగు చూడటం కలకలం రేపింది. పోలీసులు రాకేష్ మీనా భార్యను రక్షించి ఆమెను విచారణ చేసి వివరాలు సేకరించారు.
Recommended Video

నా భర్త వదిన కింగ్ పిన్
తన భర్త రాకేష్ మీనా ఆమె వదిన ప్రియాతో కలిసి తనను ఓంప్రకాష్ కు అమ్మేశారని బాధితురాలు పోలీసులకు చెప్పింది. భార్యను అమ్మేసిన ఆమె భర్త రాకేష్ మీనా, అన్న మహేంద్ర, వదిన ప్రియాతో పాటు మరో వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. రాకేష్ మీనా భార్యను కొనుకున్న కామాంధుడు ఓం ప్రకాష్ తప్పించుకున్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
భార్యను అమ్మేయడానికి ఆమె భర్త రాకేష్ మీనా, వదిన ప్రియా కలిసి ఎప్పటి నుంచి స్కెచ్ వేశారు అని విషయం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. మొత్తం మీద మైనర్ భార్యను అమ్మేసిన భర్త, అతని కుటుంబ సభ్యులు ఇప్పుడు కటకటాలపాలైనారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications