Wife: అల్లుడా మజకా, అత్త ముక్కు బాగుందని కోసేసిన అల్లుడు, వీడికి ఏం పోయేకాలం వచ్చిందంటే ?
తల్లిదండ్రులు కన్నకూతురిని ఇంటికి పిలుచుకుని వెళ్లడానికి ప్రయత్నించారు. అల్లుడికి ఎక్కడో కాలిపోయి అత్త ముక్కు కోసి పారేయడంతో అందరూ హడలిపోయారు.
భోపాల్/మధ్యప్రదేశ్: కూతురుకి పెళ్లి చేస్తే ఆమె భర్తతో జీవితాంతం సుఖంగా ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న అల్లుడు కారణంగా కూతురు నరకం అనుభవిస్తుందని తెలుసుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కన్నకూతురిని ఇంతకాలం పెంచి పోషించిన మాకు ఇప్పుడు ఆమెను చూసుకోవడం పెద్ద కస్టం కాదని అనుకున్న తల్లిదండ్రులు కన్నకూతురిని ఇంటికి పిలుచుకుని వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే అల్లుడికి ఎక్కడో కాలిపోయి అత్త ముక్కు కోసి పారేయడంతో అందరూ హడలిపోయారు.

హ్యాపీగా ఉంటారని అనుకున్నారు
మధ్యప్రదేశ్‌లోని మోర్నియా జిల్లాలోని చందాపూర్ గ్రామంలో రహామత్ బఘేల్ అలియాస్ రహామత్, రామ్ విలాసి దంపతులు నివాసం ఉంటున్నారు. దంపతులకు శ్యామ సుందరి అనే కుమార్తె ఉంది. కూతురు శ్యామ సుందరిని పక్క పట్టణంలో నివాసం ఉండే రాజు బాగేల్ అలియాస్ రాజుకు ఇచ్చి పెళ్లి చేశారు. వివాహం చేసుకున్న రాజు అతని భార్యతో కొంతకాలం మాత్రమే సంతోషంగా ఉన్నాడు.

అల్లుడామజాకా
రహామత్, రామ్ విలాసి దంపతుల కూతురు శ్యామ సుందరి, అల్లుడు రాజుల మధ్య ఇటీవల మనస్పర్థలు వచ్చాయి. రాజు, శ్యామ సుందరిని నిరంతరం కొడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో మానసిక క్షోభకు గురైన శ్యామ సుందరి పోలీసులకు ఫిర్యాదు చేసి విడిగా జీవించాలని అనుకుంది. ఈ సందర్భంలో శ్యామ సుందరి తండ్రి రహామత్, తల్లి రామ్ విలాసి వారి కుమార్తెను చూడటానికి వెళ్లారు.

అత్తమామలతో గొడవపడిన అల్లుడు
గొడవ గురించి కూతురితో మాట్లాడుతుండగా ఇకపై తన భర్త రాజుతో కలిసి ఉండలేనని శ్యామ సుందరి ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. ఈ సమస్యతో రహామత్, రామ్ విలాసి దంపతులు వారి కుమార్తెను పుట్టింటికి పిలుచుకుని వెళ్లాలని డిసైడ్ అయ్యారు, శ్యామ సుందరిని పిలుచుకుని రాజు ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో అల్లుడు రాజు అతని అత్తమామలతో గొడవకు దిగాడు.

అత్త ముక్కు కోసేసిన అల్లుడుగారు
ఒక్కసారిగా ఆవేశానికి లోనైన రాజు అతని అత్త రామ్ విలాసి ముక్కు కోసి పారిపోయాడు. దీని తరువాత రహామత్ అతని భార్య రామ్ విలాసిని ఆసుపత్రిలో చేర్చాడు. రహామత్ అతని అల్లుడు రాజు మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య శ్యామ సుందరిని తన అత్త రెచ్చగొట్టి పిలుచుకుని వెళ్లిపోతున్నదని, అందుకే రాజు ఆమె ముక్కు కోసేశాడనని ప్రాథమిక విచారణలో వెలుగు చూసిందని, కేసు విచారణలో ఉందని, రాజు కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications