బెంగళూరులో దారుణం: కట్టుకున్న భర్తే స్నేహితులతో కలిసి...

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. రంజాన్ ఉపవాసంలో ఉన్న భార్యపై కట్టుకున్న భర్తే తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని భారతీనగర్ ఠాణా పరిధిలోని శివాజీ నగర్ ప్రాంతంలో ఉన్న బంబూ బజార్ లో చోటు చేసుకుంది.

కేఆర్ పురానికి చెందిన ఓ దంపతుల మధ్య పలు విభేదాలున్నాయి. రంజాన్ సందర్భంగా కఠిన ఉపవాసమాచరిస్తున్న భార్య(34)పై ఆమె భర్తే దారుణానికి ఒడిగట్టాడు. స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ నెల 11న బయటకు వెళదామని చెప్పిన భర్త.. భార్యను బంబూ బజార్ లో ఓ ఇంటికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ అతని స్నేహితులు ముగ్గురు ఉన్నారు. వారంతా కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

Wife raped by husband along with friends

ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలిని ఇరుగు పొరుగు వారు బౌరింగ్‌ ఆసుపత్రిలో చేర్పించారు. రంజాన్‌ మాసం సందర్భంగా ఆమె ఉపవాసం ఉంటోంది. అయినా కిరాతకుడైన భర్త కలహాల నేపథ్యంలో ఈ ఘోరానికి పాల్పడ్డాడు.

జరిగిన దారుణాన్ని తనలోనే దాచుకుని కుమిలిపోతున్న ఆమెకు తల్లిదండ్రులు, బంధువులు ధైర్యం చెప్పడంతో పోలీసులకు మౌఖికంగా ఫిర్యాదు చేసింది. రంజాన్ ముగిసిన అనంతరం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తానని తెలిపింది.

వైద్య నివేదిక అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ ఘటనపై సదరు నిందితులు కేసు నుంచి తప్పించుకునేందుకు పైరవీలు మొదలుపెట్టినట్టు సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bangalore June 18: Nowadays, Humanity is unaware, here an incident has occurred in Bangalore that a 34-year-old woman has been raped by husband along with their friends. From this perspective, on Saturday filed a case of rape against her husband and three other men who, she claimed, had forced her into a vehicle and took her to a dilapidated house where they sexually assaulted her. According to the Bharatinagar police said the complainant, a resident of K R Puram, was found unconscious at Bamboo Bazar near Shivajinagar on Friday. Passersby rushed her to Bowring hospital. The doctor who examined her informed the police.
Please Wait while comments are loading...