Wife: నా కూతురికి బలవంతంగా పబ్ లో నా భార్య బీరు తాగిస్తోంది, శాడిస్టు ,ఇదిగో సాక్షం, కక్కును వదల్లేదు !
బెంగళూరు/ చెన్నై: వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు మాత్రమే సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కూతురు ఉంది. భర్త మాజీ సైనికుడు. దంపతుల మద్య తేడాలు రావడంతో విడిపోయారు. కూతురు ఆమె తల్లి దగ్గర నివాసం ఉంటున్నది. భర్త వేరే సిటీలో నివాసం ఉంటున్నాడు. ఇటీవల భార్య సోషల్ మీడియాలో గ్రూప్స్ లో కొన్ని ఫోటోలు చూసిన భర్త షాక్ అయ్యాడు. తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు తన మైనర్ కూతురికి బలవంతంగా మద్యం తాగిస్తున్నారని, పబ్ లకు పిలుచుకుని వెళ్లి ఈ వయసులోనే మద్యం అలవాటు చేశారని భార్య, ఆమె ఫ్యామిలీ మీద కేసు పెట్టారు. తన కూతురితో పాటు ఇంట్లో పెంచుకుంటున్న కుక్కను కూడా వదలకుండా మద్యం తాగించారని మాజీ సైనికుడు కేసు పెట్టడం కలకలం రేపింది.

భార్యతో విడిపోయిన మాజీ సైనికుడు
బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న 45 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు మాత్రమే సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు 7 ఏళ్ల వయసు ఉన్న ఓ కూతురు ఉంది. భర్త మాజీ సైనికుడు. దంపతుల మద్య తేడాలు రావడంతో విడిపోయారు.

తల్లి దగ్గర కూతురు.... చెన్నైలో మాజీ సైనికుడు
బెంగళూరులోని కొత్తనూరు దిన్నె సమీపంలో భార్య ఆమె 7 సంవత్సరాల కూతురితో కలిసి నివాసం ఉంటున్నది. మాజీ సైనికుడు చెన్నై చేరుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల మాజీ సైనికుడు బెంగళూరులో నివాసం ఉంటున్న మాజీ భార్య సోషల్ మీడియాలో గ్రూప్స్ లో కొన్ని ఫోటోలు, ఆమె వాట్సాప్ స్టేటస్ లు చూసి షాక్ అయ్యాడు.

7 ఏళ్ల కూతురికి పబ్ లో మద్యం తాగిస్తున్న తల్లి ?
తన భార్య, ఆమె కుటుంబ సభ్యులు తన మైనర్ కూతురికి బలవంతంగా బీరు తాగిస్తున్నారని, పబ్ లకు పిలుచుకుని వెళ్లి మద్యం తాగిస్తున్న ఫోటోలు చూసిన మాజీ సైనికుడు హడలిపోయాడు. కూతురు మద్యం తాగుతున్న ఫోటోల విషయం గురించి మాట్లాడాలని మాజీ సైనికుడు బెంగళూరులో ఉన్న భార్యకు ఫోన్ చేశాడు. అయితే భార్య మాత్రం భర్త ఫోన్ రిసీవ్ చెయ్యలేదని తెలిసింది.

ఫోటోలు సాక్షాలుగా ఇచ్చిన మాజీ సైనికుడు
ఎలాగైనా తన భార్య, ఆమె కుటుంబ సభ్యుల నుంచి తన కూతురిని రక్షించాలని మాజీ సైనికుడు డిసైడ్ అయ్యాడు. మే 27వ తేదీన బెంగళూరు వచ్చిన మాజీ సైనికుడు అతని కుమార్తెను కలిశాడు. అప్పటి నుంచి మాజీ భార్య కూతురికి బీరు తాగిస్తున్న సమయంలో, మాజీ భార్య, ఆమె కుటుంబ సభ్యులు పబ్ లకు వెళ్లి పార్టీలు చేసుకుంటున్న సమయంలో తీసిన ఫోటోలు అతని కూతురి సహాయంతో సంపాధించాడు.

కుక్కకు కూడా మద్యం తాగించారు... నా భార్య ఫ్యామిలీలో శాడిస్టులు
తాను బీరు వాసన చూసి తట్టుకోలేకపోయానని, మమ్మీ, వాళ్ల కుటుంబ సభ్యులు బలవంతంగా పబ్ లో తనతో బీరు తాగించారని తన కూతురు తనకు చెప్పిందని మాజీ సైనికుడు బెంగళూరులోని కొత్తనూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. తన కూతురితో పాటు ఇంట్లో పెంచుకుంటున్న పెంపుడు కుక్కను కూడా వదలకుండా ఆ కుక్కతో మద్యం తాగించారని, నా భార్య ఫ్యామిలీలో చాలా మంది శాడిస్టులు ఉన్నారని మాజీ సైనికుడు కేసు పెట్టాడు.

ఫోటోలు సాక్షంగా ఇచ్చిన మాజీ సైనికుడు
భార్య, ఆమె కుటుంబ సభ్యులు మైనర్ అమ్మాయితో బలవంతంగా బీరు తాగిస్తున్న సమయంలో తీసిన ఫోటోలను మాజీ సైనికుడు పోలీసులకు సాక్షంగా ఇచ్చాడు. మాజీ సైనికుడి భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల మీదకేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని కొత్తనూరు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications