Nurse: నైట్ డ్యూటీకి వెలుతున్న నర్సు, భర్తకు డౌట్, నాయుడు ఆసుపత్రిలో అరాచకం !

చెన్నై/ కోయంబత్తూర్: లవ్ మ్యారేజ్ చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కుమార్తె ఉంది. కుమార్తె పుట్టిన తరువాత కూడా దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రముఖ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో భార్య నర్సుగా ఉద్యోగం చేస్తున్నది. భార్య నైట్ షిఫ్ట్ లు కూడా ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. భార్య మీద భర్తకు అనుమానం మొదలైయ్యింది. దెబ్బకు దంపతులు విడిపోయి వేరుగా నివాసం ఉంటున్నారు. ఆసుపత్రిలో భార్య విధుల్లో ఉంది. ఆసుపత్రిలోకి వెళ్లిన భర్త ఆమెతో మాట్లాడాడు. ఆ సందర్బంలో దంపతుల మద్య గొడవ పెద్దది అయ్యింది. సహనం కోల్పోయిన భర్త ఆసుపత్రిలో అందరిముందు నర్సును దారుణగా హత్య చేశాడు. నాయుడు ఆసుపత్రిలో పట్టపగలు అందరిముందు నర్సు హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

 లవ్ మ్యారేజ్...... దంపతుల హ్యాపీలైఫ్

లవ్ మ్యారేజ్...... దంపతుల హ్యాపీలైఫ్

తమిళనాడులోని కోయంబత్తూరులో వినోద్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. 10 సంవత్సరాల క్రితం నాన్సీ (32) అనే యువతిని వినోద్ ప్రేమించాడు. ప్రేమించుకున్న వినోద్, నాన్సీ వివాహం చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న వినోద్, నాన్సీ దంపతులు కొన్ని సంవత్సరాలు చాలా సంతోషంగా కాపురం చేశారు.

 నైట్ డ్యూటీకి వెలుతున్న భార్య

నైట్ డ్యూటీకి వెలుతున్న భార్య

కుమార్తె పుట్టిన తరువాత కూడా వినోద్, నాన్సీ దంపతులు చాలా సంతోషంగా ఉన్నారు. కోయంబత్తూరులోని ప్రముఖ జి. కుప్పుస్వామి నాయుడు మెడికల్ కాలేజ్ అండ్ ఆసుపత్రిలో వినోద్ భార్య నాన్సీ నర్సుగా ఉద్యోగం చేస్తున్నది. వినోద్ భార్య నాన్సీ నైట్ షిఫ్ట్ లు కూడా ఉద్యోగానికి వెళ్లి వస్తోంది.

 భార్య మీద అనుమానంతో విడిపోయాడు

భార్య మీద అనుమానంతో విడిపోయాడు

నైట్ షిఫ్ట్ ఉద్యోగం చేస్తున్న భార్య నాన్సీ మీద వినోద్ కు అనుమానం మొదలైయ్యింది. కొంతకాలం గొడవలుపడిన వినోద్, నాన్సీ దెబ్బకు దంపతులు విడిపోయారు. కోయంబత్తూరులోని శివానంద కాలనీలో నాన్సీ వేరుగా నివాసం ఉంటున్నది. భర్త వినోద్ కు దూరంగా ఉంటున్న నాన్సీ ఉద్యోగానికి వెళ్లి వస్తోంది.

 భార్య మీద కసి.... పగ

భార్య మీద కసి.... పగ

తనకు దూరంగా ఉంటున్న నాన్సీ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తోందని వినోద్ రగిలిపోయాడు. ఎలాగైనా నాన్సీకి బుద్ది చెప్పాలని వినోద్ కొంతకాలం నుంచి ఎదురు చూశాడు. ఆసుపత్రిలో నాన్సీ విధులకు హాజరైయ్యింది. ఆసుపత్రిలోకి వెళ్లిన వినోద్ అతని భార్య నాన్సీ దగ్గరకు వెళ్లి ఆమెతో కొంతసేపు మాట్లాడాడు.

 అందరి ముందు భార్యను పొడిచి చంపేశాడు

అందరి ముందు భార్యను పొడిచి చంపేశాడు

ఆ సందర్బంలో మాటామాటా పెరిగిపోవడంతో వినోద్, నాన్సీ దంపతుల మద్య గొడవ పెద్దది అయ్యింది. సహనం కోల్పోయిన వినోద్ కత్తి తీసుకుని ఆసుపత్రిలో అందరిముందు అతని భార్య నాన్సీని దారుణగా పొడిచి స్పాట్ లో చంపేశాడు. భార్య నాన్సీని హత్య చేసి పారిపోవడానికి ప్రయత్నించాడు.

 చితకబాది సినిమా చూపించారు

చితకబాది సినిమా చూపించారు

నాన్సీని చంపేసి పారిపోతున్న వినోద్ ను ఆసుపత్రి సిబ్బంది, రోగుల కుటుంబ సభ్యులు పట్టుకుని చితకబాది ఓ రూమ్ లో నిర్బందించి పోలీసులకు అప్పగించారు. కోయంబత్తూరులోని కుప్పస్వామి నాయుడు ఆసుపత్రిలో పట్టపగలు అందరిముందు నర్సు నాన్సీ హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+