Leader: పొలిటికల్ లీడర్ ఆత్మహత్యకు కారణం ఇదే, కొత్త కోడలు చేసిన పనికి అత్తా, భర్త ?, మ్యాటర్ లీక్ !
బెంగళూరు: పొలిటికల్ లీడర్ స్థానికుల దగ్గర మంచి పేరు తెచ్చుకున్నాడు. వయసులో 20 సంవత్సరాలు తేడా ఉన్న మహిళను ఐదు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. ఇంట్లో టీ తాగిన పొలిటికల్ లీడర్ తరువాత తోట దగ్గరకు వెళ్లాడు. తోటలోని చెట్టుకు ఆ పొలిటికల్ లీడర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది. వివాహం చేసుకున్న ఐదు నెలలకే ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ హడలిపోయారు. పొటిలికల్ లీడర్ ఆత్మహత్య చేసుకున్న ప్రాంతంలో డెత్ నోట్ చిక్కింది. పొలిటికల్ లీడర్ ఆత్మహత్యకు అతని రెండో భార్య కారణం అని వెలుగు చూడటం కలకలం రేపింది.

పక్కపక్క ఊర్లలో ?
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని కుణిగల్ తాలుకాలోని హులియూరు దుర్గ సమీపంలోని అక్కిమరిపాళ్యలో శంకరన్న అలియాస్ శంకర్ (45) నివాసం ఉంటున్నారు, శంకరన్న నివాసం ఉంటున్న గ్రామం సమీపంలోని సంతోమావత్తూరు గ్రామంలో మేఘనా (25) అనే మహిళ నివాసం ఉంటున్నది. మేఘనాకు గతంలో వివాహం అయ్యింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన మేఘనా భర్త రెండు సంవత్సరాలు అయినా తిరిగిరాలేదు..

ఐదు నెలల క్రితమే వివాహం చేసుకున్నారు
శంకరన్న, మేఘనాలకు 2021 అక్టోబర్ నెలలో ఊర్లోని గుడిలో వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న శంకరన్న, మేఘనా దంపతులు సంతోషంగా కలిసి కాపురం చేస్తున్నారు. వివాహం చేసుకున్న తరువాత శంకరన్న, మేఘనాల ఇంటి సమస్యలు ఇంత వరకు బయటకు కాలేదు, ఆ విషయాలు ఎవ్వరికీ తెలీలేదు.

ఆత్మహత్య చేసుకున్న భర్త
మంగళవారం ఉదయం ఇంట్లో టీ తాగిన పొలిటికల్ లీడర్ శంకరన్న తరువాత ఆయన సొంత తోట దగ్గరకు వెళ్లాడు. తోటలోని చెట్టుకుశంకరన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్థితిలో శవమై కనిపించడం కలకలం రేపింది. ఉదయం ఊర్లో వారిని పలకరించి వెళ్లిన పొలిటికల్ లీడర్ శంకరన్న కొన్ని గంటల్లోనే శవమై కనిపించడంతో స్థానికులు హడలిపోయారు. ఆత్మహత్య చేసుకునే ముందు శంకరన్న డెత్ నోట్ రాసిపెట్టాడు.

అత్తా కోడలి పట్టింపులు
శంకరన్న పేరుతో కొన్ని ఎకరాల పొలం ఉంది. శంకరన్నను వివాహం చేసుకున్న మేఘనా మన పొలం అమ్మేసి బెంగళూరు వెళ్లి అక్కడే ఉందామని భర్తకు చెప్పింది. అయితే పొలం అమ్మడానికి శంకరప్ప తల్లి అంగీకరించలేదు. నేను చనిపోయిన తరువాత మీరు పొలం అమ్ముకుని ఎక్కడికైనా వెళ్లాలని శంకరన్నకు అతని తల్లి తేల్చి చెప్పింది. ఇదే విషయంలో అత్తా, కోడలు మేఘనాకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని వెలుగు చూసింది.

ఐదు నెలలకే భర్త ప్రాణం తీసిన భార్య ప్లాన్
తల్లికి, ఇటు కొత్తగా పెళ్లి చేసుకున్న భార్య మేఘనాకు సర్దిచెప్పలేక సతమతం అయిన శంకరన్న అతని సొంత పొలంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసు అధికారులు అంటున్నారు. సంతోషంగా జీవిస్తున్న శంకరన్న జీవితంలో ఐదు నెలల క్రితమే ఎంట్రీ ఇచ్చిన మేఘనా చివరికి అతని ప్రాణం పోవడానికి కారణం అయ్యిందని వెలుగు చూడటం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications