Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: రోజూ సెకండ్ షో సినిమా వేస్తున్న భర్త, భార్యకు కాలిపోయి వేడినూనె స్కెచ్, లేడీస్ టైలర్ ఫినిష్ !

చెన్నై/ నామక్కల్: పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో సంతోషంగా జీవనం సాగించాలని దంపతులు కలలు కన్నారు. వివాహం చేసుకున్న తరువాత చక్కగా కాపురం చెయ్యడంతో ఓ కుమార్తె, కుమారుడు జన్మించారు. లేడీస్ టైలర్ పని చేస్తున్న భర్త ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తున్నాడు. సాయంత్రం అయితే భర్త స్వర్గంలో విహరించాలని కలలు కంటున్నారు. ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ బాటిల్స్ మద్యం తీసుకుని నిర్జన ప్రదేశంలోకి వెలుతున్న భర్త, అతని ఫ్రెండ్ ఆకాశంలో చుక్కలు చూస్తూ చికెన్ పకోడా పక్కన పెట్టుకుని ఫుల్ బాటిల్ మందు తాగేస్తున్నాడు. ఉదయం నుంచి కష్టపడి పని చేస్తూ సంపాధించిన డబ్బు మొత్తం రాత్రి రెండు గంటల్లో తగలేస్తున్నాడు.

భార్య కిరాణా షాపు పెట్టుకుని వ్యాపారం చేస్తూ వచ్చిన డబ్బుతో ఇద్దరు పిల్లలను పోషిస్తున్నది. కరోనా దెబ్బతో పని లేకపోవడంతో భర్త ఖాళీగా ఉంటున్నాడు. రాత్రి అయితే నరాలు జువ్వన లాగడంతో ఎలాగైనా మద్యం తాగాలని భర్త ఉబలాట పడుతున్నాడు. భార్య షాపు దగ్గరకు వెళ్లి ఆమెను పీడించి మద్యం తాగడానికి డబ్బులు తీసుకుని వెలుతున్నాడు. భార్య డబ్బుతో మద్యం సేవించి ఇంటికి వస్తున్న భర్తను పట్టుకుని చిత్రాన్నం లెక్కలో చితకబాదేస్తున్నాడు. ప్రతిరోజు రాత్రి ఇంట్లో సెకండ్ షో వేసుకుని చితకబాదడంతో చాలా కాలం నుంచి భార్య ఓపిక పట్టింది. ఇకలాభం లేదని డిసైడ్ అయిన భర్తను చంపేయాలని స్కెచ్ వేసింది. రాత్రి నిలబడటానికి కూడా నానం లేకుండా ఇంటికి వచ్చి చిందులు వేస్తున్న భర్త తల మీద అతని భార్య మసమసలాడుతున్న వేడి నూనె పోయ్యడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

 కొడుకు, కూతురు

కొడుకు, కూతురు

తమిళనాడులోని నామక్కల్ జిల్లాలోని పట్టాయ్ ప్రాంతంలో తంగరాజ్ (50) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 20 సంవత్సరాల క్రితం తంగరాజ్ సెల్వరాణి (45) అనే మహిళ వివాహం చేసుకున్నాడు. తంగరాజ్, సెల్వరాణి దంపతులకు ఒ కుమారుడు, కుమార్తె ఉన్నారు. వివాహం జరిగిన 10 సంవత్సరాల వరకు భర్త తంగరాజ్ అతని భార్య సెల్వరాణితో హ్యాపీగానే ఉన్నాడు.

 ఫుల్ బాటిల్స్ తాగేసి రాత్రి చుక్కలు చూస్తున్న భర్త

ఫుల్ బాటిల్స్ తాగేసి రాత్రి చుక్కలు చూస్తున్న భర్త

లేడీస్ టైలర్ పని చేస్తున్న తంగరాజ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తున్నాడు. సాయంత్రం అయితే తంగరాజ్ స్వర్గంలో విహరించాలని కలలు కంటున్నారు. ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ బాటిల్స్ మద్యం తీసుకుని నిర్జన ప్రదేశంలోకి వెలుతున్న తంగరాజ్ అతని ఫ్రెండ్ కలిసి ఆకాశంలో చుక్కలు చూస్తూ చికెన్ పకోడా పక్కన పెట్టుకుని ఫుల్ బాటిల్ మందు తాగేస్తున్నాడు.

 భార్యకు కిరాణా షాపు

భార్యకు కిరాణా షాపు

తంగరాజ్ భార్య సెల్వరాణి కిరాణా షాపు పెట్టుకుని వ్యాపారం చేస్తూ వచ్చిన డబ్బుతో ఇద్దరు పిల్లలను పోషిస్తున్నది. కరోనా దెబ్బతో పని లేకపోవడంతో సెల్వరాణి భర్త తంగరాజ్ ఖాళీగా ఉంటున్నాడు. రాత్రి అయితే నరాలు జువ్వన లాగడంతో ఎలాగైనా మద్యం తాగాలని భర్త తంగరాజ్ ఉబలాట పడుతున్నాడు. తంగరాజ్ ప్రతిరోజు రాత్రి అతని భార్య సెల్వరాణి కిరాణా షాపు దగ్గరకు వెళ్లి ఆమెను పీడించి మద్యం తాగడానికి డబ్బులు తీసుకుని వెలుతున్నాడు.

 మొగుడి కంటే భార్య లావు, పొడవు

మొగుడి కంటే భార్య లావు, పొడవు

భార్య సెల్వరాణి డబ్బుతో మద్యం సేవించి ఇంటికి వెలుతున్న సెల్వరాజ్ చివరికి ఆమెనే పట్టుకుని చిత్రాన్నం లెక్కలో చితకబాదేస్తున్నాడు. భర్త సెల్వరాజ్ కంటే కొంచెం పొడవు, లావుగా ఉన్న సెల్వరాణి కూడా మొదట ఎదురుతిరిగి భర్త తంగరాజ్ ను పట్టుకుని చితకబాదింది.

వెనక్కి తగ్గిన భార్య

వెనక్కి తగ్గిన భార్య

కొంతకాలానికి పిల్లల ముందు భర్త తంగరాజ్ పరువు పోతుందని ఆమె కొంచెం వెనక్కి తగ్గింది. ప్రతిరోజు రాత్రి సెకండ్ షో వేసుకుంటున్న తంగరాజ్ చితకబాదడంతో చాలా కాలం నుంచి అతని భార్య సెల్వరాణి ఓపిక పట్టింది. ఇకలాభం లేదని డిసైడ్ అయిన సెల్వరాణి ఆమె భర్త తంగరాజ్ ను చంపేయాలని స్కెచ్ వేసింది.

 నెత్తిన వేడి నూనె పోస్తే తిరుగే ఉండదు

నెత్తిన వేడి నూనె పోస్తే తిరుగే ఉండదు

రాత్రి నిలబడటానికి కూడా నానం లేకుండా ఇంటికి వచ్చి చిందులు వేస్తున్న భర్త తంగరాజ్ కు అతని భార్య సెల్వరాణి చాలా సేపు సర్దిచెప్పడానికి ప్రయత్నించింది. అయితే మద్యం మత్తులో ఉన్న తంగరాజ్ ఆవేశంతో ఊగిపోయాడు. అంతే గ్యాస్ స్టౌవ్ మీద రెండు లీటర్ల నూనె వేడి చేసిన సెల్వరాణి ఆ నూనే తంగరాజ్ తల మీద పోసేసింది.

 మొగుడి ప్రాణాలు పోయాయి

మొగుడి ప్రాణాలు పోయాయి

మసమసలాడుతున్న వేడి నూనె పోయ్యడంతో తంగరాజ్ నోరు, ముక్కు, చెవుల్లో నుంచి ఆ నూనే అతని శరీరంలోకి వెళ్లిపోయి అవయవాలు కాలిపోవడంతో అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. తంగరాజ్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించడానికి ప్రయత్నించినా అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది.

Recommended Video

    Who Is Stuart Binny ? | బిన్నీ రికార్డ్ బ్రేక్ చెయ్యడం బుమ్రా వల్ల కూడా కాదు || Oneindia Telugu
     టార్చర్ తట్టుకోలేక చంపేశాను

    టార్చర్ తట్టుకోలేక చంపేశాను

    తంగరాజ్ ను చంపేసిన అతని భార్య సెల్వరాణి ఇంటిలోనే ఉండిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సెల్వరాణిని అదుపులోకి తీసుకున్నారు. భర్త తంగరాజ్ తనను ప్రతిరోజు డబ్బులు ఇవ్వాలని వేదింపులకు గురి చేశాడని, తాగి ఇంటికి వచ్చిన తరువాత తనతో పాటు తన పిల్లలను చితకబాదుతున్నాడని, అతని టార్చర్ తట్టుకోలేక చంపేశానని సెల్వరాణి అంగీకరించిందని పోలీసులు అంటున్నారు. తంగరాజ్ టార్చర్ పెట్టడం వలనే అతను హత్యకు గురైనాడా ?, లేక సెల్వరాణికి ఏమైనా అక్రమ సంబంధం ఉందా ? అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామని పోలీసులు అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+