Wife: బిజీగా ఉంటున్న భర్త మీద కోపం, 7 నెలల కొడుకును చంపేసి ఆత్మహత్య, షాక్ !

అహమ్మదాబాద్/గుజరాత్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. దంపతులకు 7 నెలల వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు. కూలీలను పెట్టుకుని వ్యవసాయం చేయిస్తున్న భర్త బిజీగా ఉంటున్నాడు. భర్త తల్లి కూడా వీరితోనే నివాసం ఉంటున్నది. నాలుగు రోజుల నుంచి దంపతుల మద్య ఓ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో ఉంటున్న తల్లి ఆమె కొడుకు, కోడలికి నచ్చచెబుతూ వస్తోంది. సాయంత్రం తల్లి కొడుకు గుడికి వెళ్లారు. ఆ సందర్బంలో భార్య, ఆమె 7 నెలల కొడుకు ఇంట్లోనే ఉన్నారు. గుడికి వెళ్లి వచ్చిన భర్త తలుపు తియ్యాలని భార్యకు చెప్పాడు. ఎంతసేపు అయినా భార్య ఇంటి తలుపులు తియ్యకపోవడంతో భర్తకు అనుమాం వచ్చి గోశాలలో ఉన్న కూలీలను పిలిపించి తలుపులు పగలగొట్టి చూశారు. అప్పటికే కొడును హత్య చేసిన తల్లి కూడా ఆత్మహత్య చేసుకుందని వెలుగు చూడటం కలకలం రేపింది.

 దంపతుల హ్యాపీలైఫ్

దంపతుల హ్యాపీలైఫ్

గుజరాత్ లోని అమ్రేలి పట్టణంలో తుషార్ సావాలియా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కాజల్ (30) అనే మహిళను తుషార్ పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తుషార్, కాజల్ దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. తుషార్, కాజల్ దంపతులకు 7 నెలల వయసు ఉన్న కుమారుడు ఉన్నాడు.

 పంటినొప్పితో బాదపడుతున్న భార్య

పంటినొప్పితో బాదపడుతున్న భార్య

తుషార్ తల్లికూడా వీరితోనే కలిసిజీవిస్తోంది. నాలుగు రోజుల నుంచి కాజల్ పంటినొప్పితో బాదపడుతోంది. కూలీలను పెట్టుకుని వ్యవసాయం చేయిస్తున్న తుషార్ బిజీగా ఉంటున్నాడు. తను పొలం పనుల మీద సమీపంలోని గ్రామంలోకి వెళ్లి వస్తున్నాని, ఇప్పుడు ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లడం సాధ్యం కాదని, రెండు రోజుల తరువాత వెలుదామని తుషార్ అతని భర్య కాజల్ ను ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లకుండా ఆలస్యం చేశాడు.

 గుడికి వెళ్లిన అత్తా, భర్త

గుడికి వెళ్లిన అత్తా, భర్త

కాజల్, తుషార్ దంపతుల మద్య ఆసుపత్రికి వెళ్లే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో ఉంటున్న తల్లి ఆమె కొడుకు తుషార్, కోడలు కాజల్ కు నచ్చచెబుతూ వస్తోంది. సాయంత్రం తల్లి ఆమె కొడుకు తుషార్ సమీపంలోని గుడిలు పూజలు చేయించడానికి వెళ్లారు. ఆ సందర్బంలో కాజల్ ఆమె ఆమె 7 నెలల కొడుకు ఇంట్లోనే ఉన్నారు. భర్త తుషార్, అత్త బయటకు వెళ్లిన తరువాత కాజల్ ఇంటి లోపల లాక్ చేసుకుంది.

 కొడుకును చంపేసి ఆత్మహత్య చేసుకున్న తల్లి

కొడుకును చంపేసి ఆత్మహత్య చేసుకున్న తల్లి

గుడికి వెళ్లి వచ్చిన తుషార్ ఇంటి తలుపు తియ్యాలని అతని భార్య కాజల్ కు చెప్పాడు. ఎంతసేపు అయినా భార్య కాజల్ ఇంటి తలుపులు తియ్యకపోవడంతో తషార్ కు అనుమాం వచ్చి గోశాలలో ఉన్న కూలీలను పిలిపించి తలుపులు పగలగొట్టి చూశారు. అప్పటికే కొడును హత్య చేసి కాజల్ విషం తాగి ఆత్మహత్య చేసుకుందని వెలుగు చూడటం కలకలం రేపింది. ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లలేదని భర్త తుషార్ మీద కోపంతో కాజల్ ఆమె కొడును చంపేసి ఆత్మహత్య చేసుకుందని అమ్రేలి పోలీసు అధికారి జేపీ, భండారి స్థానిక మీడియాకు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+